Updated : 24 Jan 2022 17:28 IST
Ap news: ఏపీలో కొత్తగా 14వేల కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40,266 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న పశ్చిమగోదావరిలో ఇద్దరు మృతి చెందగా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 4,800 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 93,305 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1728, అనంతపురంలో 1610, ప్రకాశంలో 1597, కర్నూలులో 1551, కడపలో 1492, నెల్లూరులో 1198 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 14,549 మంది మృతి చెందారు.
Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.