Published : 22 Feb 2022 18:20 IST

22-02-2022 ‘టూస్ డే’పై చక్కర్లు కొడుతున్న మీమ్స్‌.. చూశారా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ‘వికటకవి’ ఈ పదాన్ని ఎటు నుంచి చదివినా ఒకే అర్థం వస్తుంది. ఈరోజు తేదీ కూడా అంతే. 22-02-2022... దీన్ని ఎటు నుంచి చూసినా తేదీ ఒకటే వస్తుంది. తలకిందులుగా చూసినా ఒకేలా కనిపించడం మరో ప్రత్యేకత. అంతేకాదు ఈరోజును ‘టూస్‌ డే’ అని సంబోధిస్తున్నారు. తేదీలో 2 అంకె అత్యధిక సార్లు వచ్చింది కాబట్టి దీన్ని టూస్​డేగా పిలుచుకుంటున్నారు. దీంతో పాటు ఈ రోజు మంగళవారం. దీన్ని ఇంగ్లిష్​లో ట్యూస్​డే అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఈ రకంగానూ టూస్​డేకు ప్రత్యేకత వచ్చింది.

నిజానికి టూస్​డేకు చారిత్రకంగా ఎలాంటి ప్రాముఖ్యత లేదు. కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం కూడా ఎలాంటి ప్రత్యేకత లేదు. అయితే, ఈ తేదీ సంఖ్యల అమరిక ఆసక్తికరంగా ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం 2 అంకె చంద్రుడిని సూచిస్తుంది. ఈ తేదీ అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని కొందరికి  భావిస్తుంటారు. తేదీలో మాత్రమే ప్రత్యేకత ఉంది తప్ప రోజులో ఎలాంటి మార్పు లేదని మరికొందరు అంటున్నారు. ఈ ప్రత్యేక డేట్‌కి సంబంధించిన పలు మీమ్స్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అలరిస్తున్నాయి. వాటిని చూసేద్దామా మరి..










Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని