Tomato: మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80

మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం కిలో టమాటా ధర అత్యధికంగా రూ.80 పలికింది.

Published : 17 Jun 2024 14:10 IST

మదనపల్లె గ్రామీణ: మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం కిలో టమాటా ధర అత్యధికంగా రూ.80 పలికింది. బక్రీద్ సందర్భంగా మార్కెట్‌కు రైతులు తక్కువ సరకును తీసుకొచ్చారు. గత వారం రోజులుగా ఇక్కడ ధర అత్యల్పంగా కిలో రూ.41 నుంచి అత్యధికంగా రూ.64 ఉంది. సోమవారం మాత్రం ఏ గ్రేడ్ కిలో రూ.69 నుంచి రూ.80 వరకు, బీ గ్రేడ్ రూ.50 నుంచి రూ.68 వరకు ధర పలికింది.

ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరకు తగ్గడంతో పాటు, దేశవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో టమాటా దిగుబడి తగ్గింది. దీంతో నాణ్యమైన సరకు మార్కెట్‌కు రావడం లేదు. ఈ పరిస్థితులు ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే మదనపల్లె మార్కెట్‌కు డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌కు రోజూ 600 టన్నుల నుంచి 750 టన్నుల మేరకు సరకును రైతులు తీసుకొస్తున్నారు. సోమవారం బక్రీద్ కావడంతో మార్కెట్‌కు ఎగుమతికి అవసరమైన దాని కంటే తక్కువగా వచ్చింది. మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల నుంచి కేవలం 396 టన్నులు టమాటాలు మాత్రమే తీసుకొచ్చారు. దీంతో కిలో ధర రూ.80కి చేరుకుంది. రైతుల నుంచి వ్యాపారులు సగటున 25 కిలోల బుట్ట ధర రూ.1600 నుంచి రూ.1900కు కొనుగోలు చేసి బయటి మార్కెట్లకు ఎగుమతి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని