KTR: రాష్ట్ర నీటిపారుదల రంగంలో రేపు అద్భుత ఘట్టం: కేటీఆర్‌

రాష్ట్ర నీటిపారుదల రంగం చరిత్రలో రేపు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు...

Published : 22 Feb 2022 21:53 IST

హైదరాబాద్‌: రాష్ట్ర నీటిపారుదల రంగం చరిత్రలో రేపు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మల్లన్నసాగర్‌ జలాశయాన్ని సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేస్తారని ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ నిర్మాణం జరిగిందని తెలిపారు. మల్లన్నసాగర్‌ ద్వారా 11.29లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా నీరిచ్చేలా మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టు స్వయంగా సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో సగానికిపైగా జిల్లాల తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగిందన్నారు. నిర్వాసితుల కోసం గజ్వేల్‌లో ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీ నిర్మాణం చేపట్టామని హరీశ్‌రావు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని