టాప్‌ 10 న్యూస్‌ - 5 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 01 Apr 2021 16:55 IST

1. జిల్లా కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. పరిషత్‌ ఎన్నికలను కొనసాగిస్తూ విడుదల చేయాల్సిన ప్రకటనపై ఎస్‌ఈసీ కలెక్టర్లతో చర్చిస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీ రాజ్ శాఖ‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం పరిషత్‌ ఎన్నికల తేదీలపై ఎస్‌ఈసీ ప్రకటన చేసే అవకాశముంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. TS: పరువు హత్యలపై హైకోర్టులో విచారణ

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరువు హత్యలపై సామాజిక కార్యకర్త సాంబశివరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో జరిగిన పరువు హత్యలపై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రకం హత్యల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. వాటిని తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

3.2021 చెన్నై చెయ్యాల్సిందేమిటి? 

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకటి. ముంబయి ఇండియన్స్‌ తర్వాత అత్యధిక టైటిళ్లు సాధించిన ఏకైక జట్టు‌. మెగా లీగ్‌ ఆరంభ సీజన్‌ నుంచి ఏటా కనీసం ప్లేఆఫ్స్‌ చేరిన నిలకడైన టీమ్‌. కానీ, గతేడాదే దారుణ ఫలితాలు చవిచూసి చతికిల పడింది. ఐపీఎల్‌లో ఎన్నడూ లేనివిధంగా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే 14వ సీజన్‌లో తిరిగి పూర్వ వైభవాన్ని సాధించాలంటే ధోనీసేన ఏం చేయాలి. దాని ముందున్న సవాళ్లు, అవకాశాలు ఏమిటి? మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. పోల్‌ అప్‌డేట్‌: అల్లర్లలోనూ వెల్లువెత్తిన ఓటర్లు

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ఉద్రిక్తంగా సాగుతోంది. పలుచోట్ల ఘర్షణలు, అల్లర్ల వంటి ఘటనలో చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ జరుగుతుండగా.. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 71.07శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. కొత్త ఆర్థిక సంవత్సరం.. అదరగొట్టిన సూచీలు

దేశీయ మార్కెట్లు ఆర్థిక సంవత్సరాన్ని (2021-22) లాభాలతో ప్రారంభించాయి. ఆర్థిక సంవత్సరం తొలిరోజైన గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు అదరగొట్టాయి. మెటల్‌, ఫైనాన్షియల్‌ షేర్ల అండతో భారీ లాభాలను అందుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ మళ్లీ 50 వేల మార్కును చేరుకుంది. సెన్సెక్స్‌ 520.68 పాయింట్ల లాభంతో 50,029.83 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 176.70 పాయింట్ల లాభంతో 14,867.40 వద్ద స్థిరపడింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. కొడుకు మృతదేహం కోసం.. తండ్రి అన్వేషణ

చేతిలో పలుగు, పారతో రోజూ ఉదయాన్నే ఇంటి నుంచి బయల్దేరుతాడు ఆ తండ్రి. సమీపంలోని పొలాల్లో భూమిని తవ్వుతాడు. వ్యవసాయం చేసేందుకు కాదు.. మట్టిలో కలిసిపోయిన తన కన్నకొడుకు మృతదేహం కోసం..! అవును.. దేశరక్షణ కోసం సైన్యంలో చేరిన తన కుమారుడు ఉగ్రవాదుల చెరలో ప్రాణాలు కోల్పోతే.. జాలి, దయ లేని ముష్కరులు కనీసం శవాన్ని కూడా అప్పగించలేదు. కన్నకొడుకు కడచూపుకు కూడా నోచుకోని ఆ తండ్రి.. కనీసం మృతదేహం దొరికినా చాలనుకుని ఎనిమిది నెలలుగా భూమిని జల్లెడ పడుతూనే ఉన్నాడు. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన 56ఏళ్ల మంజూర్‌ అహ్మద్‌ వాగే కన్నీటి గాథ ఇది.. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. మున్సిపల్ పదవుల్లో మహిళలకు పెద్దపీట:జగన్‌

కార్పొరేషన్‌, మున్సిపల్‌ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసినట్లు ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 61శాతం పదవులు కేటాయించినట్లు తెలిపారు. విజయవాడలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్‌ తరగతుల కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. కడుపులో మంట పుడుతోందా..? తగ్గించుకోండిలా!

9. నేను లిప్‌లాక్‌ చేయలేదు: విష్వక్‌సేన్‌

తాను కథానాయకుడిగా నటించిన రెండు సినిమాల్లో లిప్‌లాక్స్‌ లేవని కథానాయకుడు విష్వక్‌సేన్‌ అన్నారు. ప్రస్తుతం ‘పాగల్‌’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విష్వక్‌ తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. తాను నటించిన సినిమాల్లో అధరచుంబనాలు ఎక్కువగా ఉన్నాయనంటూ ఓ నెటిజన్‌ ఇటీవల పోస్ట్‌ పెట్టాడని విష్వక్‌ తెలిపారు. ‘‘వెళ్ళిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’ అనే రెండు సినిమాల్లో నేను నటించాను. ఆ సినిమాల్లో అధరచుంబనాల్లేవు. మీకు కనుక ఆ సినిమాల్లో అలాంటి సన్నివేశాలు కనిపిస్తే చెప్పండి’ అని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఎఫ్‌బీలో లాగిన్‌ అవ్వకుండానే..

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్‌ నెట్‌వర్క్‌ ఏదంటే అది ఫేస్‌బుక్కేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, దాంట్లో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోనివారు.. ఉన్న అకౌంట్‌ని డిలీట్‌ చేసిన వారూ చాలా మందే ఉంటారు. అందుకు కారణాలు ఏవైనా.. ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ లేకుండానే దాంట్లో వెతుకులాట సాగించాలంటే? అది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమే.. అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే.. ఎఫ్‌బీలో ఉన్న వ్యక్తుల్ని, ఇతర సమాచారాన్ని అకౌంట్‌ లేకుండానే వెతకొచ్చు. అదెలాగో చూద్దాం.. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని