Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
1. థైరాయిడ్ గ్రంథిపై కొవిడ్ ప్రభావం
లండన్: కొవిడ్ తీవ్రరూపం ధరిస్తే థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తుందనీ, ఆ దుష్ప్రభావం ఏడాది గడచిపోయిన తరవాత కూడా కనిపిస్తుందని ఇటలీలోని మిలాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. కొవిడ్ లక్షణాల తీవ్రత మధ్యస్థంగానూ, తీక్షణ స్థాయిలోనూ ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి వాపునకు గురవుతుంది. మెదడులోని హైపోథాలమస్- పిట్యూటరీ- థైరాయిడ్ గ్రంథులు కొవిడ్ దుష్ప్రభావానికి గురవుతున్నాయని పరిశోధకులు తేల్చారు.
2. శ్రీసత్యసాయి జిల్లాలో ఘోరం.. ఐదుగురు సజీవదహనం
తాడిమర్రి: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోరం జరిగింది. ఆటోపై విద్యుత్ తీగలు తెగిపడడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. తాడిమర్రి మండలం బుడ్డపల్లికి చెందిన కూలీలు చిల్లకొండయ్యపల్లికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బత్తాయి తోటల్లో చెట్ల వద్ద కలుపు తీసేందుకు కూలీలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
3. అప్పడాలు, మజ్జిగపైనా జీఎస్టీ మోత
ప్యాక్ చేసిన లేబుల్డ్ గోధుమపిండి, అప్పడాలు, పన్నీర్, పెరుగు, మజ్జిగ - లస్సీ, మాంసం (ఫ్రోజెన్ మినహాయించి), చేపలు, తేనె, ఎండు చిక్కుళ్లు-మఖానా, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్ పైనా ఇక నుంచి 5 శాతం జీఎస్టీ పడుతుంది. బుధవారం జరిగిన జీఎస్టీ మండలి 47వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు కొత్తపన్ను రేట్లు జులై 18 నుంచి అమల్లోకి రానున్నాయి. రూ.1000 కంటే తక్కువ విలువైన హోటల్ గదుల అద్దెపైనా 12 శాతం జీఎస్టీ విధిస్తారు. ఆసుపత్రిలో ఒక రోగికి రూ.5000కి మించి గది అద్దె తీసుకుంటే, ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ పడనుంది. బ్యాటరీ ప్యాక్ అమర్చినా, లేకున్నా విద్యుత్తు వాహనాలకు 5 శాతం జీఎస్టీ ఖరారు చేశారు.
4. భార్య అవయవదానంపై భర్తకు నిర్ణయాధికారం ఉండదు
దిల్లీ: ఒక వివాహిత అవయవదానం చేయడానికి ఆమె భర్త అంగీకారం అవసరంలేదని, అలా చేయడం వల్ల ఆ మహిళ తన సొంత శరీరంపై హక్కును కోల్పోయినట్టే అవుతుందని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ మహిళ తన రెండు కిడ్నీల్లో ఒకదాన్ని.. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి దానం చేసేందుకు ముందుకొచ్చారు. అయితే- ఆమె అవయవదానం చేయడానికి భర్త అంగీకారం అవసరమని, అతడి నుంచి ధ్రువీకరణపత్రం తీసుకురావాలని ఆసుపత్రి వర్గాలు షరతు పెట్టాయి. దీంతో సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించారు. తాను భర్త నుంచి దూరంగా ఉంటున్నానని, తన కిడ్నీ దానం చేయడానికి ఆయన అనుమతి తీసుకోలేనని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
5. ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక
భారత 16వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఈ స్థానానికి ఆగస్టు 6న పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే.. ఆరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, అదే రోజు లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తిచేస్తారు.
ఇంగ్లాండ్‌లో అయిదు టెస్టుల సిరీస్.. నాలుగు మ్యాచ్‌లు ముగిసేసరికి భారత్‌కు 2-1 ఆధిక్యం.. అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈ ఊపులో చివరి మ్యాచ్‌లోనూ సత్తా చాటి సిరీస్ చేజిక్కించుకుంటారనుకుంటే కరోనా కారణంగా నిరుడు ఆ టెస్టు జరగలేదు. ఆ మ్యాచ్ ఆడేందుకు, సిరీస్ పూర్తి చేసేందుకు ఇప్పుడు మళ్లీ ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టింది భారత్. అయితే ఈ తొమ్మిది నెలల విరామంలో ఇరు జట్లు చాలా మారిపోయాయి.. ఆట కూడా మారిపోయింది. ఆ మార్పులేంటో.. ఎవరి ఫామ్ ఎలా ఉందో.. చివరి టెస్టులో ఎవరి అవకాశాలెలా ఉన్నాయో.. చూద్దాం పదండి.
7. తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే... కనీసం అయిదు నక్షత్రాల హోటల్‌లో చేయి తిరిగిన నలభీములు అయ్యుండాలి కదా... కానీ... హైదరాబాద్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు... నేపథ్యం అతి సాధారణమైనా తెలంగాణ రుచుల తయారీలో మాత్రం అసామాన్యురాలీమె... అందుకే ఏరికోరి ఎంపికచేశారు... జులై 2 నుంచి జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీకి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయించారు.
8. రఘురామను హైదరాబాద్‌లోనే విచారించండి
రాజద్రోహం మినహా ఇతర సెక్షన్ల విషయంలో ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్‌లోని దిల్ కుషా ప్రభుత్వ అతిథి గృహంలో విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతిచ్చింది. ఇదే కేసులో ఇతర నిందితులైన ఏబీఎన్, టీవీ-5లతో కలిపి ఎంపీని విచారించాలని భావిస్తే 15 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని పేర్కొంది. ఆయన ఎంచుకున్న న్యాయవాది సమక్షంలోనే విచారించాలని, ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని ఆదేశించింది.
9. జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ, ఈడీకి సంబంధించి మొత్తం 18 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలయ్యాయి. విధి నిర్వహణలో ఆయనకు కలగని ఇబ్బంది (ఎంబ్రాస్‌మెంట్) ఏ కేసులోనూ ఛార్జిషీటే లేని నాకు ఎందుకు ఎదురవుతుంది’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ‘రాజకీయ నాయకులకు అఖిల భారత సర్వీసుల ప్రవర్తన నియమావళి వర్తించదు కదా అనొచ్చు. నైతికంగా వర్తిస్తుందా లేదా అనేది వారిష్టం. కానీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కూడా పలు కేసుల్లో అభియోగపత్రాలు దాఖలయ్యాయి.
10. నకిలీ ఉద్యోగం పసిగట్టేదెలా..?
‘వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండీ... కేవలం రూ.5వేలు రిజిస్ట్రేషన్ ఫీజు కడితే చాలు’.. ‘ఏడాదికి రూ.10 లక్షల ప్యాకేజీ.. మీ బ్యాంకు ఖాతా వివరాలు కాస్త చెప్పండి’ ‘డేటా ఎంట్రీ ఉద్యోగం సార్... కన్సల్టెన్సీకి కొంత ఖర్చులు చెల్లిస్తే జాబ్ మీదే’ ...ఇలా ఎవరైనా చెబుతుంటే సందేహించాల్సిందే! ఎందుకంటే ఇప్పుడు నకిలీ ఉద్యోగాల బెడద ఎక్కువైపోయింది. అందుకే అభ్యర్థీ... జర భద్రం!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Taiwan: ఆక్రమణ కోసమే చైనా సన్నాహాలు
-
Movies News
Mahesh Babu: ‘ఆ సహృదయం పేరు మహేశ్ బాబు’.. సూపర్ స్టార్‌కు తారల విషెస్
-
Sports News
ASIA CUP 2022: నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉంటే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తా: మాజీ సెలక్టర్
-
Politics News
Bihar: తేజస్వీతో కలిసి గవర్నర్‌ను కలవనున్న నీతీశ్.. భాజపాకు షాక్ తప్పదా?
-
Politics News
మాధవ్‌పై చర్యలు మొదలు పెడితే వైకాపా సగం ఖాళీ: రామ్మోహన్నాయుడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే