Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. నీట్ రాయకుండా... మెడికల్ కెరియర్!
వైద్యపరిశ్రమలో అడుగుపెట్టాలంటే.. నీట్ రాసి డాక్టర్లే కావాల్సిన పనిలేదు. ఇంకా చాలా అవకాశాలున్నాయి. చికిత్స చేసేది వైద్యులే అయినా.. వివిధ రకాలుగా రోగికి సాయపడేలా వారి చుట్టూ ఎంతోమంది నిపుణులు సేవలు అందిస్తుంటారు. ప్రస్తుతం వీరికి డిమాండ్ పెరుగుతోంది. ఆసక్తి ఉన్నవారు కోర్సులు పూర్తిచేసుకుని ఉద్యోగంలో రాణించవచ్చు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. సెంట్రల్ హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు
పశ్చిమ హైదరాబాద్‌లో ఎక్కువగా కన్పించే ఆకాశహర్మ్యాల పోకడ సెంట్రల్ హైదరాబాద్‌కూ విస్తరిస్తోంది. ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న ఆబిడ్స్, చుట్టుపక్కల కొత్త నిర్మాణాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3. దారికొస్తేనే.. రయ్ రయ్!
జిల్లా నుంచి వెళ్లే మూడు ప్రధాన జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేశారు. అక్కడక్కడ కొన్ని పనులు అసంపూర్తిగా వదిలేశారు. గుత్తేదారు మాత్రం బిల్లులు చేసుకుని చేతులు దులుపుకొన్నారు. రహదారి మొత్తం అద్దంలా ఉంటుంది. అసంపూర్తిగా వదిలిన ప్రాంతాలు నరకానికి దారులై.. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. పూర్తి చేయడం లేదు. పరిష్కారం చూపడం లేదు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. ఆ అధికారి రూటే.. సపరేటు..!
రాజధానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతుల్లేకుండా విచ్చలవిడిగా సాగుభూములను వెంచర్లుగా మారుస్తున్నారు. వీటికి సదరు అధికారి మద్దతుగా ఉండటంతో స్థిరాస్తి వ్యాపారులు ఆడింది ఆటగా సాగుతోంది.ఇక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారని మండల ధరణి ఆపరేటర్‌ను, కంప్యూటర్ ఆపరేటర్‌ను ఇటీవలే జిల్లా ఉన్నతాధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే రెండు, మూడు రోజుల్లోనే సదరు కంప్యూటర్ ఆపరేటర్‌ను తిరిగి అదే ప్రాంతానికి బదిలీ చేయాలని... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5. చెప్పడాల్లేవ్.. ఆపేయడమే
ఆకివీడు, జంగారెడ్డిగూడెం పట్టణం, ఉండ ఎప్పుడు పోతుందో తెలియదు.. ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు..ఎంత సేపు ఉంటుందో అర్థం కాదు. విద్యుత్తు కోతలపై ఉమ్మడి జిలాల్లో ప్రజల ఆవేదన ఇది. కనీస సమాచారం లేని కోతలతో జనం అల్లాడుతుండగా.. చిరువ్యాపారుల రోజువారీ ఆదాయంపై ప్రభావం కనిపిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. చేపల వంటకాలు.. నోరూరించేందుకు సిద్ధం
జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో ఏటా ప్రభుత్వం చేప, రొయ్య పిల్లలను వదలుతుంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈనెల 8 నుంచి 10 వరకు చేపల ఆహార ఉత్సవం (ఫిష్ ఫుడ్ ఫెస్టివల్) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల సభ్యులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించారు. మూడు రోజులు నోరూరించే వివిధ రకాల చేపల వంటకాలు జిల్లావాసులకు అందుబాటులో ఉండనున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. కాచిగూడ, బేగంపేట స్టేషన్లకు ఆధునిక హంగులు
రాష్ట్రంలోని కాచిగూడ, బేగంపేట రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగులు సమకూరనున్నాయి. వీటితో పాటు ద.మ.రైల్వే జోన్ పరిధిలో రాజమహేంద్రవరం, గూడూరు, నాందేడ్ రైల్వే స్టేషన్లను కూడా తీర్చిదిద్దనున్నారు. ఈ స్టేషన్ల పునరభివృద్ధి పనులకు సంబంధించి అధ్యయనం చేయించాలన్న రైల్వే జోన్ సూచన మేరకు.. ద.మ.రైల్వే కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఆయా స్టేషన్ల మాస్టర్ ప్లాన్లు తయారు చేయనున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8. అంగారక ప్రపంచంలోకి.. ఆమె!
అంగారకుడిపై జీవుల మనుగడ సాధ్యమా అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2030లోగా ఆ గ్రహంపైకి మనుషుల్ని పంపే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఈక్రమంలో అక్కడి వాతావరణాన్ని మానవులు ఎంతవరకూ తట్టుకోగలరో పరీక్షించాలనుకున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి వాతావరణాన్నే భూమిపై సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల నుంచి ఎన్నో వడపోతల ద్వారా నలుగురిని ఎంపిక చేసి, ఏడాదిపాటు ఆ వాతావరణంలో నివసించే ఏర్పాట్లు చేశారు. వారిలో ఇద్దరు మహిళలే! పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
9. సోషల్ మీడియా యాప్‌లతో జరభద్రం
డోగేరాట్ పేరుతో కొత్త మాల్‌వేర్‌ను సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల ద్వారా యూజర్ల డివైజ్‌లలోకి హ్యాకర్లు ప్రవేశపెడుతున్నట్లు సైబర్ పరిశోధనా నిపుణులు వెల్లడించారు. దీని సాయంతో ఆర్థిక, బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్, వినోద రంగాల్లో పనిచేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల డివైజ్‌లలోని సమాచారాన్ని లక్ష్యంగా ఎంచుకుంటున్నారని బెంగళూరుకు చెందిన క్లౌడ్‌సెక్ సైబర్ పరిశోధన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. కరీంనగర్‌లో శ్రీవారి కోవెల
కరీంనగర్‌లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరనున్నారు. సువిశాలమైన 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయాన్ని అద్భుత క్షేత్రంగా నిర్మించాలని తితిదే సంకల్పించింది. కరీంనగర్ పద్మానగర్‌లో ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ, శంకుస్థాపన పూర్తిచేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, తితిదే ఛైర్మన్ డాక్టర్ వై.వి.సుబ్బారెడ్డిల సమక్షంలో నాలుగు వేదాల శిలలతోపాటు గర్భగుడి శిలకు వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు, హోమం నిర్వహించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
Google Bard - Team India: వన్డే ప్రపంచకప్.. గూగుల్ బార్డ్ చెప్పిన భారత్ తుది జట్టు ఇదే
-
Team India Final XI: ప్రపంచకప్‌లో ఏ 11 మంది దిగితే మంచిది? మీ ఆలోచన ఏంటి?
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?
-
Viral video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన