టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

గత నెల రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలతో వాడీవేడిగా సాగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచారం గురువారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం (17న) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది...

Updated : 16 Apr 2021 09:00 IST

1. అంతం చేసిన ఆవేశం 

గురువారం ఉదయం...ఒక్కసారిగా విశాఖలో వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే ఇంటిలో ఆరుగురిని నరికి చంపారనే విషయం సంచలనం రేపింది. అప్పటికే మధురవాడ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనంలో నలుగురు మరణించిన తీరూ చర్చనీయాంశమయింది. ఇలా హత్యా ఘటనల్లో ఒకే రోజు పది మంది మరణించారని తెలిసి నగరం ఉలిక్కిపడింది.  పోలీసులు, ఇతర అధికారులు తక్షణం రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

2. నోట్లు రాలుతున్నాయ్‌!
గత నెల రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలతో వాడీవేడిగా సాగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచారం గురువారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం (17న) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. విజయం కోసం అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీ!

దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)పై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌) జీడీపీ వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంలోని చివరి మూడు నెలలు (2021 జనవరి-మార్చి) కన్నా పడిపోయే అవకాశం ఉందని భావిస్తోంది. వైరస్‌ కట్టడికి గతంలో మాదిరిగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించడానికి బదులు ప్రజలు భౌతిక దూరం పాటించేలా నిబంధనలను కఠినంగా అమలు చేయడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

4. చెన్నై ఐవీసీలో ‘కొవాగ్జిన్‌’ తయారీ?

కొవిడ్‌-19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో, టీకాల కొరతను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన ‘కొవాగ్జిన్‌’ టీకాను చెన్నై సమీపంలోని చెంగల్పట్టులో గల ఐవీసీ కాంప్లెక్సు (ఇంటిగ్రేటెడ్‌ వ్యాక్సిన్‌ కాంప్లెక్స్‌) లో తయారు చేయించే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీకాల తయారీలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఈ కాంప్లెక్సును ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

5. ఈ లెక్కలన్నీ చెప్పాల్సిందే...

పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సిందే. చట్టం అనుమతించిన మినహాయింపులు, లావాదేవీలతో పాటు అన్నీ రిటర్నులలో చూపించాల్సి ఉంటుంది. అయితే, కొన్నిసార్లు తెలియకపోవడం లేదా పొరపాటునో వాటిని రిటర్నులలో చూపించరు. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఆర్థిక లావాదేవీని ఆదాయపు పన్ను శాఖ గమనిస్తూ ఉంటుంది. కాబట్టి, ప్రతి రూపాయికీ లెక్క చెప్పక తప్పదు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి  

6. జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు 

రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై.. జడ్జి రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందినజయరామచంద్రయ్య బుధవారం ఫిర్యాదు చేయగా.. సస్పెండయిన జడ్జి రామకృష్ణపై ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదుచేశారు. రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో కరోనా పరీక్షల కోసం మదనపల్లె వెళ్తుండగా.. దారిలో పీలేరు ఎన్టీఆర్‌ కూడలి వద్ద మధ్యాహ్నం 12.30కు పోలీసులు వచ్చి రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

8. వైద్య ఆరోగ్య సిబ్బందికి సెలవుల రద్దు

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అదనంగా 25 శాతం పడకలు పెంచాలని ఆదేశించింది. మొత్తం పడకల్లో 70 శాతం కరోనా రోగులకు ఉపయోగించాలని నిర్దేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంపిక చేసిన సాధారణ శస్త్రచికిత్సలను వెంటనే వాయిదా వేసుకోవాలని తెలిపింది. కరోనా బాధితులను ఆసుపత్రుల్లో చేర్చేందుకు ప్రత్యేక ప్రొటోకాల్‌ ఏర్పాటు చేయాలని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

9. మాస్క్‌ మరవొద్దు.. జరిమానా వెయ్యించుకోవద్దు!

కరోనా విజృంభిస్తున్న వేళ మాస్క్‌ ధరించకుండా సంచరించే వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. మాస్క్‌ ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలంటూ కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉల్లంఘనులను గుర్తించడంపై పోలీస్‌శాఖ దృష్టి సారించింది. వీరికి ఎలా జరిమానాలు విధించాలనే అంశంపై మొదట్లో తర్జనభర్జనలు పడిన ఆ శాఖ చివరికి ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఇచ్చినట్టే ఈ-చలానా జారీచేయాలని నిర్ణయించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

10. ఫోన్‌ చేస్తే.. 3గంటల్లో పడకలు
కరోనా బాధితులు ఫోన్‌ చేస్తే.. మూడు గంటల్లోగా వారికి పడకలు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. 104 నంబరు ద్వారా కొవిడ్‌ సేవలు అందాలని, వీటిపై ప్రచారం చేయాలని చెప్పారు. కొవిడ్‌ నివారణ చర్యలు, టీకా పంపిణీ తీరుపై గురువారం ఆయన ఉప  ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స చేరాలనుకునే వారి నుంచి యాజమాన్యాలు అధిక ఫీజుల వసూళ్లు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని