Top Ten News @ 9AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన 10 వార్తల కోసం క్లిక్ చేయండి
1. ఇంటిపై ఇసుక పిడుగు
రాష్ట్రంలో ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. టన్నుకు రూ.500-600 వరకు పెరగడంతో ఇంటి నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆన్‌లైన్ బుకింగ్‌లతో రోజుకు 70 వేల టన్నుల ఇసుక విక్రయించేది. ధరల పెంపు వల్ల నది ఇసుకకు డిమాండ్ తగ్గడంతో గత పక్షం రోజులుగా రోజుకు సగటున 50 వేల టన్నులు మాత్రమే అమ్ముడవుతోంది. పేరుకు ఆన్‌లైన్ అయినా.. ఆ ప్రక్రియ చేసేదంతా లారీ యజమానులే. వారు చెప్పిందే ధర. ఒకవేళ వినియోగదారు నేరుగా ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకుని.. లారీని విడిగా కిరాయికి తీసుకెళ్లాలన్నా.. ఆ మేరకు అదనపు భారం తప్పదు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
2.ఏపీలో భారాస ఆవిర్భావ సభ
ఆంధ్రప్రదేశ్‌లో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. దీనికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరుకానున్నారు. భారాస ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్టీ నేత చింతల పార్థసారథిలు బుధవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ విస్తరణ, పటిష్ఠ నిర్మాణంపై చర్చించారు. త్వరలో సభా వేదిక, నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ప్రజల్లోకి ప్రబలంగా తీసుకెళ్లాలని కేసీఆర్ ఈ సందర్భంగా చంద్రశేఖర్‌కు సూచించారు. ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని మార్గదర్శనం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
3.అమెరికాలో హిమపాతం.. ఐరోపాలో వేసవి తాపం!
అనూహ్య వాతావరణ మార్పులకు భూగోళం ఆలవాలం అవుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా కొద్దిరోజుల కిందటే అమెరికాను మంచు కప్పేయటం చూశాం. అసాధారణ హిమపాతంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు, జనజీవనం అల్లాడటం చూశాం. వారం రోజుల్లోనే ఐరోపా వేదికగా మరో అసాధారణ ప్రకృతి పరిణామం ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. గడ్డ కట్టాల్సిన చోట, మంచు పేరుకుపోవాల్సిన చోట ఈ సారి ఆ ఊసే మాయమైంది. వాతావరణం ఎండాకాలంలా వేడిని తలపిస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
4. 18 ఏళ్ల వరకు లెక్కలు చదవాల్సిందే: బ్రిటన్ పౌరులకు తప్పనిసరి చేయనున్న సునాక్
ద్రవ్యోల్బణం, వైద్య సేవల్లో సంక్షోభం, జీతాలు పెంచాలని సిబ్బంది సమ్మె దిగడం వంటి పలు సమస్యలు బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ మొదటి ప్రసంగం చేయనున్నారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపడానికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రసంగానికి సంబంధించిన కొన్ని వివరాలు బయటకొచ్చాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
5. తుగ్లక్ పాలన!
తేలుకు పెత్తనమిస్తే తెల్లార్లూ కుట్టి చంపుతుంది. మూడున్నరేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అచ్చం అలాగే కాల్చుకుతింటోంది. ‘రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నారు’ అంటూ విపక్షనేతగా జగన్ మొసలి కన్నీళ్లు కార్చారు. అధికారంలోకి వచ్చాక ఇక తనకు ఎదురాడేవారే ఉండకూడదన్నట్లుగా పేట్రేగిపోతున్న ఆయన- ఏపీలో అక్షరాలా అరాచక రాజ్యాన్ని స్థాపించారు. తన విమర్శకులపైకి యథేచ్ఛగా పోలీసులను ఉసిగొల్పుతున్న వైకాపా సర్కారు ఆదినుంచీ చట్టానికి వక్రభాష్యం చెబుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
6. నా భర్త పార్టీ మారితే ఆయన అడుగుజాడల్లో నడవాలి కదా!: మాజీ మంత్రి సుచరిత
‘రాజకీయంగా మా మనుగడ అంటే వైకాపాతోనే అని ఎప్పుడూ చెబుతాం’ అని మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ‘సుచరిత ఆ స్టేట్‌మెంట్ ఇచ్చిందంటే నా భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడి ఉంటారు. అలాకాకుండా దయాసాగర్ పార్టీ మారతాను. నువ్వు నాతో రా అంటే నేను ఎంత రాజకీయ నాయకురాలినైనా, ఒక భార్యగా నేను నా భర్త అడుగుజాడల్లో నడుస్తాను కదా...’ అని ఆమె వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
7.ఉద్యోగులు ఉసూరు!
వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జీతం సమయానికి రాదు. ఆర్థిక ప్రయోజనాలకు నెలల కొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి. నిరసన తెలుపుదామంటే ఆంక్షలు, బైండోవర్ కేసులు. పింఛనర్లు డబ్బులు లేక మందుల దుకాణాల్లో బాకీలు పెట్టుకోవాల్సి వస్తోంది. దాచుకున్న డబ్బుల్లో నుంచి పెళ్లిళ్లు, ఇళ్ల స్థలాల కొనుగోలుకు రుణాల కోసం దరఖాస్తు చేస్తే అవి మూలకు చేరుతున్నాయి. ‘నీతి లేని ఓ నాయకుడా..! పలుకు లేని పరిపాలకుడా..!’ అంటూ జగన్ పాలనపై ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు పాట రాశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
8. సిరీస్ పట్టేస్తారా?
ఒక్క రోజే విరామం. అంతలోనే భారత్, శ్రీలంక జట్లు మరో టీ20 సమరానికి సిద్ధమైపోయాయి. వేదిక ముంబయి నుంచి పుణెకు మళ్లింది. గురువారమే రెండో టీ20. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20లో రెండు పరుగుల తేడాతో గట్టెక్కిన టీమ్‌ఇండియా.. ఈసారి సాధికారికమైన ఆటతో మ్యాచ్‌ను నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
9. బ్రిటిష్‌వాళ్ల కన్నా ఘోరంగా జగన్ పాలన
సీఎం జగన్ బ్రిటిష్ వాళ్ల కంటే ఘోరంగా తయారయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా నియోజకవర్గానికి వస్తున్న ఆయనను ఏపీ సరిహద్దులో బాదూరువద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నడిరోడ్డుపైనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనను ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో స్పష్టతివ్వాలని పోలీసులను ప్రశ్నించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
10. ప్రభుత్వ రంగ బ్యాంకుల దశ తిరిగింది
అయిదు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టాలను చవిచూసిన ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.లక్ష కోట్లకు పైగా లాభాలు ఆర్జించేలా దూసుకుపోతున్నాయి. ప్రభుత్వ సంస్కరణలకు తోడు, తగిన దిద్దుబాటు చర్యలే ఇందుకు కారణం. ఈ గణాంకాలు చాలు.. పీఎస్‌బీల తీరులో ఎంత మార్పు వచ్చిందో చెప్పడానికి. ఇటీవల ఎన్నడూ లేనంతగా 2017-18లో రూ.85,390 కోట్ల భారీ నష్టాన్ని మూట గట్టుకున్న బ్యాంకులు.. అయిదేళ్ల వ్యవధిలో, ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల భారీ లాభాన్ని ఆర్జించేలా తమ పనితీరును మెరుగు పరచుకున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు