Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News At 9 PM: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Dec 2022 21:03 IST

1. హైదరాబాద్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ వ్యభిచారం.. ముఠా ఉచ్చులో 14,190 మంది మహిళలు

అంతర్జాతీయ ఆన్‌లైన్‌ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఉచ్చులో విదేశాలకు చెందిన మహిళలతో పాటు వివిధ నగరాలకు చెందిన యువతులు కూడా చిక్కుకున్నారు. మహిళలు, యువతులకు నిర్వాహకులు ఎండీఎంఏ మాదకద్రవ్యాలు అలవాటు చేయడంతో పాటు, బాధిత మహిళల ద్వారా విటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేయడం ద్వారా మత్తు దందా నిర్వహిస్తున్నట్టు  పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన అర్నవ్‌ ఈముఠాకు నాయకుడిగా ఉంటూ దందా కొనసాగిస్తున్నట్టు సైబరాబద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.నా దగ్గర ఎక్స్‌క్లూజివ్‌ సాక్ష్యాలున్నాయ్‌.. షేక్‌ చేస్తా : అర్చనా నాగ్‌

న అందంతో ప్రముఖులను ముగ్గులోకి దించి(Honey trap) వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలు, వీడియోలు చూపించి పెద్ద మొత్తంలో డిమాండ్‌ చేసిన వ్యవహారంలో అరెస్టయిన ఒడిశా మహిళ అర్చనా నాగ్‌(Archana Nag)ను ఈడీ(ED) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కోసం ఈడీ కార్యాలయానికి తరలించడానికి ముందు వైద్య పరీక్షల కోసం ఝార్పాడ ప్రత్యేక జైలు నుంచి భువనేశ్వర్‌లోని క్యాపిటల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు పరీక్షలు చేయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రధాని మోదీ సూచన.. నీతి ఆయోగ్‌ సీఈవోతో చంద్రబాబు భేటీ

నీతి ఆయోగ్‌ సీఈవో పరమేశ్వరన్‌ అయ్యర్‌(Parameswaran iyer)తో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. జీ-20 సదస్సు (g20 summit) నిర్వహణపై సోమవారం ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిజిటల్‌ నాలెడ్జ్‌ అంశంపై చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన సూచించిన అంశాలను తన ప్రసంగంలో ప్రధాని ప్రస్తావించారు. డిజిటల్‌ నాలెడ్జ్‌ విజన్‌ డాక్యుమెంట్‌పై నీతి ఆయోగ్‌ (Niti Aayog) అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు ప్రధాని సూచించారు. దీనిలో భాగంగానే నీతి ఆయోగ్‌ సీఈవోతో ఆయన సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 11న వాంగ్మూలం నమోదు చేస్తామన్న సీబీఐ.. అంగీకరించిన ఎమ్మెల్సీ కవిత

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత మెయిల్‌కు సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. ఈనెల 11న ఉదయం 11గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈనెల 11న సీబీఐ విచారణకు అంగీకరిస్తున్నట్టు తెలిపారు. ఈమేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని కవిత మెయిల్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


5. ఆ ఒక్క తప్పిదం చేయకుండా ఉంటే గెలిచేవారు: సునీల్‌ గావస్కర్‌

బంగ్లాదేశ్‌(Bangladesh)తో తొలి వన్డేలో పేలవమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించిన టీమ్‌ఇండియా(Team india).. 41.2 ఓవర్లలో 186 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. బౌలింగ్‌ పరంగా రాణించినప్పటికీ బంగ్లా ఆటగాళ్లు మెహదీ హసన్‌(Mehidy hasan), ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ జోరు ముందు భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు. ఫీల్డింగ్‌ పరంగానూ తేలిపోయారు. చివరి ఓవర్‌లో క్యాచ్‌ను వదిలేసి జట్టు ఓటమికి కారణమయ్యాడంటూ కేఎల్‌ రాహుల్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌(Sunil gavaskar) రాహుల్‌ పక్షాన నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్‌ రివార్డు పాయింట్లలో కోత.. జనవరి నుంచే..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) క్రెడిట్‌ కార్డులు (Credit card) వాడే వారికి అలర్ట్. రివార్డు పాయింట్ల ప్రోగ్రాములో ఎస్‌బీఐ కార్డ్‌ (SBI card) కొన్ని మార్పులు చేసింది. ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై ప్రస్తుతం ఇస్తున్న రివార్డు పాయింట్లలో (Reward points) కోత పెట్టింది. జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సైతం రివార్డు పాయింట్ల విషయంలో కొన్ని పరిమితులు విధించింది. ఎస్‌బీఐ సైతం ఇప్పుడు అదే బాట పట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 9 వేల మారుతీ సుజుకీ కార్ల రీకాల్‌.. మోడళ్లు ఇవే..

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతీ సుజుకీ  (Maruti Suzuki) భారీ సంఖ్యలో కార్లను రీకాల్‌ (Recall) చేస్తోంది. ముందు వరుసలోని సీటు బెల్టులో (Seat belt) లోపాన్ని సవరించేందుకు మొత్తం 9,125 కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. సియాజ్ (Ciaz)‌, బ్రెజా (Brezza), ఎర్టిగా (Ertiga), ఎక్స్‌ఎల్ 6 (XL6), గ్రాండ్‌ విటారా (Grand Vitara) వంటి మోడళ్లు రీకాల్‌ చేస్తున్న వాహనాల జాబితాలో ఉన్నాయి. 2022 నవంబర్‌ 2 నుంచి 28 మధ్య తయారైన వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆ కంపెనీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సినిమా చూశారని విద్యార్థులను కాల్చిచంపారు..

ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ చెప్పిందే వేదం.. చేసిందే చట్టం. ఇతర దేశాల సంస్కృతి ప్రభావం తమ దేశ పౌరులపై ఉండకూడదని టీవీ, రేడియో, శీతలపానీయాలు, దుస్తులు, హెయిర్‌స్టైల్‌ వంటి వాటిపై ఆ దేశంలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు. రెండు నెలల క్రితం దక్షిణ కొరియా సినిమాలు, వీడియోలు చూశారని.. ఇద్దరు  విద్యార్థులకు మరణశిక్ష విధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికా ప్రభుత్వానికి మెటా హెచ్చరిక..!

ఫేస్‌బుక్‌(Facebook), ఇన్‌స్టా(Instagram), వాట్సాప్‌(whatsapp)ల మాతృసంస్థ మెటా(Meta) ఓ చట్టం విషయంలో అమెరికా(USA) ప్రభుత్వానికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ చట్టం అమల్లోకి వస్తే అక్కడి మీడియా సంస్థలు ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసే కంటెంట్‌ ఫీజు విషయంలో బలంగా బేరమాడే అవకాశం లభిస్తుంది. ఈనేపథ్యంలో తాము వార్తా సంస్థలకు ట్రాఫిక్‌ పెంచేందుకు సహకరిస్తున్నామని మెటా చెబుతోంది. ఫేస్‌బుక్‌లో కంటెంట్‌ పోస్టు చేయడం వాటి ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గన్నవరంలో దారుణం.. ప్రేమ పేరుతో బాలికను అపహరించిన చర్చి పాస్టర్‌

ఆరోగ్యం బాగోలేదని చర్చికి తీసుకెళ్లిన మైనర్‌ బాలికను స్వస్థత పేరుతో పాస్టర్‌ ట్రాప్‌ చేశాడు. మాయమాటలతో లోబర్చుకుని 3 రోజుల క్రితం బాలికను తన వెంట తీసుకెళ్లాడు. నూజివీడులో చర్చి పాస్టర్‌గా ఉన్న వ్యక్తి మైనర్‌ను ట్రాప్‌ చేయడం కలకలం రేపింది. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన నాగేశ్వర్‌ భార్య ఆనారోగ్యంతో చనిపోయింది. అతనికి సుమారు 20ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలున్నారు. నూజివీడులో చర్చికి వచ్చిన బాలికకు స్వస్థత చేకూరుస్తానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను గత కొన్ని రోజులుగా గన్నవరం మండలం ఉస్తాబాద్‌ గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచారు. బాలిక జాడ తెలుసుకున్న నాగేశ్వర్‌ ఈనెల 2న ఉస్తాబాద్‌ వచ్చి బాలికను తీసుకెళ్లాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని