Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Jul 2024 09:17 IST

1. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్‌లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. పూర్తి కథనం

2. పిట్ట కొంచెం.. కిక్కు ఘనం..!

పక్షుల వ్యవహారశైలి చాలా వింతగా ఉంటుంది. కొన్ని విహంగాలు ఘాటైన రసాయనాల కోసం గాలిస్తుంటాయి. ఆస్ట్రేలియాలోని నార్‌ఫోక్‌ దీవిలోని పచ్చని చిలుకలు ఇందుకు ఉదాహరణ! ఇవి మిరియాల తీగను నమిలి ఆ పిప్పిని తమ ఈకలపైకి వెదజల్లుకోవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. పూర్తి కథనం

3. రీ సర్వే చిక్కులు.. రుణాలకు తిప్పలు!

ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. అంతా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. రుణాల కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలను (సొసైటీలు) సంప్రదిస్తున్నారు. ఈ సందర్భంగా రుణాలకు అవసరమైన ఒప్పంద బాండ్ల కోసం తనఖా రిజిస్ట్రేషన్లు జరగక గందరగోళానికి గురవుతున్నారు. రెవెన్యూ, సొసైటీ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు.పూర్తి కథనం

4. సత్యం వధ.. ధర్మం చెర!

అయిదేళ్ల వైకాపా పాలనలో అధికారులు ఆ పార్టీ నాయకులతో కలిసి చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారదన్న ధీమాతో కొంతమంది అధికారులు వైకాపా నాయకులతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంగా భావించి పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. పేదలను హింసించి, అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు.పూర్తి కథనం

5. వైకాపా జేబు సంస్థగా ఏపీ ఫైబర్‌నెట్‌!

ఏపీ ఫైబర్‌నెట్‌ను తన వారికి ఉపాధి కేంద్రంగా మాజీ సీఎం బంధువు.. ఎంపీ అవినాష్‌రెడ్డి మార్చేశారు. అవసరం లేకున్నా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఆ లేఖ తీసుకు రావడమే ఆలస్యమన్నట్లు.. సంస్థ అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి వారికి పోస్టింగులు ఇచ్చారు.పూర్తి కథనం

6. కాలానికి తగ్గట్టు నైపుణ్యంతో సాన పట్టు

ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఏ ఉద్యోగైనా నైపుణ్యం పెంచుకోవాల్సిందే.. వృత్తి నిపుణులు ఇందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2025లో 85 శాతం వృత్తి నిపుణులు నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించనున్నట్లు ‘అప్‌స్కిల్లింగ్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌ 2024-25’ నివేదిక వెల్లడించింది. పూర్తి కథనం

7. వసతుల్లేని వర్సిటీలు!

ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు, ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతోంది. పీజీ పట్టాలు పొందే సంగతేమో గాని..సురక్షితంగా బయటపడితే చాలన్నట్లుగా కొన్ని వర్సిటీల్లోని హాస్టళ్లలో పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.పూర్తి కథనం

8. చుక్‌ చుక్‌ బండి.. పట్టాల కింది నుంచీ వెళ్తుందండి..!

నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్‌ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్‌ లైన్లు, రైల్‌ ఓవర్‌ రైల్‌(ఆర్‌ఓఆర్‌) వంతెనలు నిర్మిస్తోంది. అయితే, ఈ ప్రక్రియలో భూసేకరణ సమస్యలు వస్తున్నాయి.పూర్తి కథనం

9. వాట్సప్‌లో ఏఐ స్నేహితుడు

అమరావతి: ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్‌ ఇంజిన్‌నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్‌లో చాట్‌ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. అదే మెటా ఏఐ. వాట్సప్‌ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ఇప్పుడిప్పుడే యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. పూర్తి కథనం

10. ఎందుకింత ఉద్వేగం!

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో చివరి ఓవర్‌ పూర్తి చేయగానే హార్దిక్‌ పాండ్య కళ్లలో నీరు.. మైదానాన్ని హత్తుకున్న రోహిత్‌ శర్మ కళ్లలో నీరు.. నేలపై కూలబడిన బుమ్రా కళ్లలో నీరు.. ఆకాశానికి చేతులు చాచిన కోహ్లి కళ్లలో నీరు.. సాధించామని సగర్వంగా తలెత్తుకున్న కోచ్‌ ద్రవిడ్‌ కళ్లలో నీరు. అది చూసి.. టీమ్‌ఇండియా సాధించిన విజయాన్ని చూసి.. దేశంలోని కోట్లాది అభిమానులు ఉద్వేగానికి గురయ్యారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని