Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Jun 2024 13:07 IST

1. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్‌ నుంచి స్పిల్‌వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. పూర్తి కథనం

2. రుషికొండ ప్యాలెస్‌లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: మంత్రి నారా లోకేశ్‌

రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్‌ పెడతామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రజా దర్బార్‌ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. బక్రీద్‌ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.పూర్తి కథనం

3. ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ

శ్చిమబెంగాల్‌ (West Bengal)లోని దార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడం (Train Collision)తో ఓ బోగీ గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.పూర్తి కథనం

4. హెచ్‌పీసీఎల్‌ సీఎండీ పదవికీ సరైన అభ్యర్థి దొరకలేదు

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) పదవికి సరైన అభ్యర్థి దొరకలేదని తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పీఈఎస్‌బీ ఈ నెల 14న హెచ్‌పీసీఎల్‌ సీఎండీ కోసం 8 మందిని ఇంటర్య్వూ చేసింది.పూర్తి కథనం

5. ఛేజింగ్‌ల్లో కోహ్లీని ప్రత్యేకంగా నిలిపింది అదే.. విరాట్‌ సీక్రెట్‌ వెల్లడించిన అక్రమ్‌

సమకాలీన క్రికెట్‌లో ఛేజ్‌ మాస్టర్‌ అంటే విరాట్‌ కోహ్లీనే. కొండంత లక్ష్యాలను కూడా నిలకడగా.. నిబ్బరంగా ఆడుతూ పిండి చేయగలడు. కింగ్‌ క్రీజులో ఉన్నంతవరకు ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోదంటే అతిశయోక్తి కాదేమో. కోహ్లీ బ్యాటింగ్‌ ప్లాన్ల గురించి తాజాగా పాక్‌ లెజెండ్‌ వసీం అక్రమ్‌ (Wasim Akram) ఓ మ్యాచ్‌ కామెంటరీలో స్పందించాడు. పూర్తి కథనం

6. ప్రధాని మోదీని కెనడాలో జీ7కు ఆహ్వానిస్తారా..? ట్రూడో ఏమన్నారంటే..

భారత్‌-కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇటలీలోని జీ7 సదస్సులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. వచ్చే ఏడాది కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానిస్తారా..? అన్న ప్రశ్న పలువురి మదిలో నెలకొంది. ఓ విలేకరి ఏకంగా ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau)నే అడిగేశారు. దానికి ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు. పూర్తి కథనం

7. పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికాకు నిఖిల్‌ గుప్తా అప్పగింత!

ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో అరెస్టై చెక్‌ రిపబ్లిక్‌ జైలులో మగ్గుతున్న భారతీయుడు నిఖిల్‌ గుప్తాను అమెరికాకు అప్పగించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం ఆయన్ను న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి.పూర్తి కథనం

8. సమయం వచ్చేసింది.. నా ప్రవేశం ప్రారంభమైంది.. శశికళ కీలక వ్యాఖ్యలు

తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇక అన్నాడీఎంకే (AIADMK) పనైపోయిందని భావించొద్దని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ (Sasikala) అన్నారు. పార్టీలోకి తన ప్రవేశం ప్రారంభమైందని.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ‘అమ్మ పాలన’ను తిరిగి తీసుకొస్తామంటూ ఆదివారం ఆమె కీలక ప్రకటన చేశారు.పూర్తి కథనం

9. బక్రీద్‌.. మసీదుల్లో ప్రార్థనలు

త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. వేలాదిగా మసీదుల వద్దకు చేరి ప్రత్యేక ప్రార్థనలను చేశారు. అనంతరం మతపెద్దలు బక్రీద్‌ నేపథ్యాన్ని వివరించారు.పూర్తి కథనం

10. ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్‌ బిల్లు చెల్లించాల్సిందే..సీఎం కీలక నిర్ణయం

జులై నుంచి రాష్ట్రంలోని ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ విద్యుత్ బిల్లుల(power bills)ను సొంత డబ్బులతో చెల్లించుకోవాల్సి ఉంటుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Himanta Sarma) ఆదివారం వెల్లడించారు. తాను, చీఫ్ సెక్రటరీ జులై 1నుంచి ఈ నిబంధనను అనుసరిస్తామన్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని