Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Jul 2024 09:12 IST

1. ప్రజలందరికీ హెల్త్‌ ప్రొఫైల్‌!

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా... రాష్ట్రంలోని ప్రజలందరి సమగ్ర ఆరోగ్య సమాచారం (హెల్త్‌ ప్రొఫైల్‌) సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేయడంతోపాటు సత్వర, సమగ్ర చికిత్సలే లక్ష్యంగా దీన్ని రూపొందించనున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి, ఆరోగ్యకార్డులను అందిస్తారు. పూర్తి కథనం

2. జోగి కబ్జాలో... ఎవరి పాపం ఎంత?

సర్వే నంబరు మార్చేసి.. సీఐడీని ఏమార్చేసి... రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులపై చర్యలకు పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే డీజీపీకి నివేదిక అందిన విషయం తెలిసిందే. బాధ్యులపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదు.పూర్తి కథనం

3. కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు

పెనమలూరు, న్యూస్‌టుడే: కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ- అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్యనియంత్రణ మండలికి చెందిన హార్డ్‌డిస్కులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.పూర్తి కథనం

4. పుష్పక్‌ ఏసీ జనరల్‌ బస్‌పాస్‌ రూ.5 వేలు

విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం గ్రేటర్‌ ఆర్టీసీ ‘పుష్పక్‌ ఏసీ జనరల్‌ బస్‌పాస్‌’ను ప్రవేశపెట్టింది. రూ.5,000 బస్‌పాస్‌తో.. పుష్పక్‌ ఏసీ బస్సులతోపాటు ఇతర బస్సుల్లోనూ గ్రేటర్‌లో ఏ మార్గంలోనైనా ప్రయాణించే వెసులుబాటు కల్పించినట్లు ఆర్టీసీ పేర్కొంది. పూర్తి కథనం

5. అమరావతిని బంగారం చేస్తాం

అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్‌ ప్రభుత్వం.. రాజధాని బ్రాండ్‌ ఇమేజ్‌ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ లాంటి మతిలేనివారు తప్ప రాజధానిని మారుస్తానని ఎవరూ అనరని ధ్వజమెత్తారు.పూర్తి కథనం

6. సగర్వంగా స్వదేశానికి.. భారత్‌ చేరుకున్న రోహిత్‌ సేన

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన రోహిత్‌ సేన సగర్వంగా భారత్‌కు చేరుకుంది. గురువారం ఉదయం జట్టు సభ్యుల ప్రత్యేక విమానం దిల్లీలో దిగింది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్‌ఇండియాకు (Team India) స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్తి కథనం

7. ఫోన్‌ ట్యాపింగ్‌ కుట్రలో నవీన్‌రావు

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్‌రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావుతోపాటు నవీన్‌రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్‌రావు బృందం ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది.పూర్తి కథనం

8. జగన్‌ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!

అమరావతి: మీరేదైనా వాహనం కొంటే స్టిక్కరింగ్‌కు ఎంతవుతుంది? మహా అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలు. కానీ, వైకాపా ప్రభుత్వం వైఎస్సార్‌ సంచార పశువైద్య సేవా వాహనాలకు రంగులు, జగన్‌ బొమ్మలు వేయించడానికి రూ.2.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. వైకాపా వీరవిధేయ అధికారులు కనీస ఆలోచన లేకుండా కోట్లు ఖర్చు పెట్టి వాహనాలకు వైకాపా రంగులు, జగన్‌ స్టిక్కర్లు వేశారు.పూర్తి కథనం

9. కాంగ్రెస్‌లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి?

మహబూబ్‌నగర్‌: భారాసకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు స్థానికంగా ఎమ్మెల్యేకు, గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరితకు మధ్య విబేధాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డి చేతిలోనే ఓడిపోయారు. పూర్తి కథనం

10. ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలుచేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులను సైతం 2012లో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాలని తెలిపింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని