Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Jul 2024 09:09 IST

1. చేసిన పాపం కాల్చేస్తే పోతుందని!?

కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ నాటి అటవీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటీవలి వరకూ పీసీబీ ఛైర్మన్‌గా పనిచేసిన సమీర్‌ శర్మ, ఆయన ఓఎస్డీ రామారావు వైపే చూపిస్తున్నాయి. పూర్తి కథనం

2. ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే

ఈయన పేరు రాములు. ఊరు చౌటుప్పల్‌. న్యూరో సంబంధిత సమస్యతో గాంధీ ఆసుపత్రిలో ఇటీవల చేరాడు. వైద్యులు చికిత్స అందించారు. అయితే రెండు నెలలు వాడాలంటూ ఆరు రకాల మందులు రాశారు. తీరా ఆసుపత్రి మందుల కౌంటర్‌ వద్దకు వెళ్లాక.. ఆ ఆరు మందుల్లో ఒక్కటే చేతిలో పెట్టారు. మిగతా ఐదు రకాలు బయట కొనుక్కోవాలని సూచించారు.పూర్తి కథనం

3. EPF higher pension: లాభమా? నష్టమా?

ఒక సంస్థలో పనిచేసి, పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఒకరు అధిక పింఛను కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేశారు. దాన్ని పరిశీలించిన ఈపీఎఫ్‌వో ఆయనకు డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. ఈపీఎస్‌కు బకాయిల కింద రూ.21 లక్షలు కట్టాలని అందులో పేర్కొంది. అయితే, నోటీసులో పేర్కొన్న మొత్తం చెల్లిస్తే ఎంత పింఛను వస్తుంది? పింఛనును ఏవిధంగా లెక్కిస్తారన్న వివరాలేమీ అందులో లేవు.పూర్తి కథనం

4. ట్యాపింగ్‌ కేసులో... మరో మలుపు!

రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇప్పట్లో తాను హైదరాబాద్‌ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు అరెస్టయిన నలుగురు అధికారుల వాంగ్మూలం, స్వాధీనం చేసుకున్న ధ్వంసమైన కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తప్ప ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించడంలేదు.పూర్తి కథనం

5. వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా

గూడూరు, న్యూస్‌టుడే: వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని విర్రవీగారు. ప్రజా ప్రయోజనాలు తోసిరాజని ఫక్తు రాజకీయ నాయకుల్లా చలామణి అయ్యారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా చెలరేగారు. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. పూర్తి కథనం

6. కాళేశ్వరం విచారణలో జోక్యం చేసుకోం..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి ఆరోపణలపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్‌ విచారణతోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.సి.ఘోష్‌ నేతృత్వంలోనూ న్యాయ విచారణ జరుగుతోందని, ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోలేమని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి కథనం

7. ‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’

కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. ఆయన పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతూ ‘నేను డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అందుకేనే మంత్రి పదవి రాలేదేమో’ అని వ్యాఖ్యానించారు.పూర్తి కథనం

8. ఏపీఎండీసీని వాడేసుకున్న ద్వివేది

అధికారులు, ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాల్సిన గనులశాఖ పూర్వపు ప్రత్యేక ప్రధానకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.. వైద్యబిల్లుల కోసం దారితప్పారు. ప్రభుత్వం నుంచి కాకుండా, తాను అదనపు బాధ్యతలు చూస్తున్న కార్పొరేషన్‌ నుంచి పలుదఫాలుగా రూ.80లక్షలు తీసుకున్నారు. ఈ వ్యవహారం తాజాగా బయటకొచ్చింది. పూర్తి కథనం

9. హైదరాబాద్‌ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి

దిల్లీ: హైదరాబాద్‌లో 2024 జనవరి-జూన్‌లో 18,573 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైనట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక తెలిపింది. గతేడాది ఇదే సమయంలో విక్రయమైన ఇళ్ల సంఖ్యతో పోలిస్తే, ఈ సంఖ్య 21% అధికమని వివరించింది. ఇదే సమయంలో కార్యాలయ స్థలాలకు గిరాకీ 71% అధికమై 50 లక్షల చదరపు అడుగులకు చేరినట్లు వెల్లడించింది.పూర్తి కథనం

10.  మార్కెట్లు పెరుగుతున్నాయ్‌.. జాగ్రత్త

ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ సూచించారు. గురువారమిక్కడ శాట్‌ కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరిన్ని ట్రైబ్యునల్‌ బెంచ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని