Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jul 2024 09:20 IST

1. మా నాన్నను తీసుకురారూ..

‘ఆరు నెలల నుంచి మా నాన్న కనిపించడం లేదు. మా నాన్నను తీసుకురారూ..’ అంటూ ఓ బాలిక హోం మంత్రి అనిత వద్ద కన్నీటి పర్యంతమైంది. పాయకరావుపేట పాఠశాలలో చదువుతున్న బాలిక, తన తల్లి మాడుగుల లక్ష్మితో కలిసి మంత్రి వద్ద గోడు వెళ్లబోసుకుంది. పూర్తి కథనం

2. తాళాలిస్తే నిధులు తినేశారు

జిల్లాలో ఒంగోలు కోఆపరేటివ్‌ డివిజన్‌ పరిధిలో 70, మార్కాపురం పరిధిలో 23 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, అనుబంధ శాఖలు ఏర్పాటయ్యాయి. సహకార సమాఖ్య శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇవన్నీ నిబంధనల ప్రకారం చిత్తశుద్ధితో సేవలందిస్తే రైతులకు ఎంతగానో మేలు ఒనగూరేగేది.పూర్తి కథనం

3. హుకుం జారీ చేసినా.. ఊహూ

రాజధాని పరిధిలో ప్రతిపక్ష భారాసలో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్ఠానం మాటలను కార్పొరేటర్లు, ఇతర నేతలు పెడచెవిన పెడుతున్నారా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. శుక్రవారం జరిగిన భారాస నగర పార్టీ సమావేశానికి 10మంది బల్దియా కార్పొరేటర్లతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా డుమ్మాకొట్టారు.పూర్తి కథనం

4. పిన్నెల్లి అరాచకాలపై చర్చిద్దామా?

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: ‘మీకు ధైర్యముంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో, ఎంత గ్రానైట్‌ తరలించాడో.. ఎంత గ్రావెల్‌ అమ్ముకున్నాడో చర్చిద్దామా?’ అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు.పూర్తి కథనం

5. భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?.. రక్షణ శాఖకు అప్పగించేందుకు అన్వేషిస్తున్న హెచ్‌ఎండీఏ

నగరంలో నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్‌ కారిడార్, డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌లకు రక్షణ  శాఖ నుంచి భూములను తీసుకొంటున్న విషయం తెలిసిందే. ఇందుకు బదులుగా ఆ శాఖకు ఎక్కడ భూములు కేటాయించాలనే విషయమై హెచ్‌ఎండీఏ పరిశీలన చేస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ఏడు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూములపై అధికారులు ఆరా తీస్తున్నారు.పూర్తి కథనం

6. వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

హైదరాబాద్‌: ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే.. ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్‌ చాట్‌బాట్‌’ సేవలను తీసుకొచ్చింది. వాట్సప్‌ నంబర్‌ 88000 01915లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి.పూర్తి కథనం

7. ఇంటి నుంచి అదృశ్యం.. ఆరు గంటల్లో ప్రత్యక్షం

విజయవాడ నగరంలో నలుగురు మైనర్లు ఒకే రోజు అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. ఉదయం ఇళ్ల నుంచి వెళ్లిపోయిన వీరిలో ఓ బాలిక సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరింది. మరో ముగ్గురిని శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గుర్తించి రైల్వే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.పూర్తి కథనం

8. జాగ్రత్తలు పాటిస్తే జూలీతో జాలీయే..!

భీమిలిలో ఓ కుటుంబం వీధి కుక్కకు పెంచుకుంది. ఆ కుక్క కరిచి ఓ అబ్బాయి గత నెల 22న మృతి చెందాడు. అతడి తండ్రి అదే నెల 25న మరణించాడు. ఈ విషయం తెలిసి జీవీఎంసీ సిబ్బంది ఆ కుక్కను స్వాధీనం చేసుకోగా.. మరుసటి రోజే అది చనిపోయింది. అంతకుముందు ఆ కుక్క దాడికి గురైన మరో రెండు కుక్కలు రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందాయి. పూర్తి కథనం

9. సహకార సంఘాలకు వైకాపా చెదలు

అమరావతి: వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సహకార బ్యాంకుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒక్కో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పరిధిలో సగటున రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర అక్రమాలు జరిగాయి.పూర్తి కథనం

10. ఇక కుర్రాళ్ల సమయం

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువ రక్తంతో నిండిపోనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం. శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టు.. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తలపడనుంది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని