Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Jul 2024 09:01 IST

1. ‘పెద్దాయన’కు మేలు చేసేలా బొగ్గు గని ఒప్పందం

అమరావతి: ఏ ప్రభుత్వ రంగ సంస్థ అధికారైనా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు చూస్తారు. కానీ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఎండీగా మొన్నటి వరకు వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం.. ఓ బొగ్గు గని ప్రాజెక్టు ద్వారా వైకాపా ప్రభుత్వంలో నెంబర్‌ టూగా చక్రం తిప్పిన ‘పెద్దాయన’కు ఎక్కువ ప్రయోజనం దక్కేలా చూశారు. ఆయన చేసిన ఘనకార్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి కథనం

2. తితిదే నిధుల వినియోగంపై విజిలెన్స్‌ ఆరా

తిరుపతి, న్యూస్‌టుడే- బైరాగిపట్టెడ: తితిదే గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల హయాంలో నిబంధనలను అతిక్రమించి నిధుల కేటాయించడం, ఇంజినీరింగ్‌ పనులు చేపట్టడంపై విజిలెన్స్‌ అధికారులు కూపీ లాగుతున్నారు. శ్రీవాణి టికెట్ల కేటాయింపుతో పాటు ఆ ట్రస్టు ద్వారా వచ్చిన నిధుల వినియోగంపైనా ఆరాతీస్తున్నారు.పూర్తి కథనం

3. ఆషాఢం.. అమ్మోరికి బోనం

చాంద్రాయణగుట్ట, బన్సీలాల్‌పేట: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పట్టే బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. నగరంలో ఆషాఢమాసంలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగే బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. బోనాల సందడి చూస్తే పల్లె పట్నానికి  తరలొచ్చిందా అనిపిస్తుంది.పూర్తి కథనం

4. TG TET: ఇక టెట్‌ ఏటా రెండుసార్లు

హైదరాబాద్‌: ఇక నుంచి తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు. ఏటా జూన్, డిసెంబరులో పరీక్షను జరుపుతామని అందులో పేర్కొన్నారు.పూర్తి కథనం

5. తింటే బిర్యానీ తినాలి...!

చూస్తే తాజ్‌మహల్‌ చూడాలి.. తింటే బిర్యానీ తినాలి.. అనేలా మారాయి ప్రస్తుత రోజులు. ఒకప్పుడు హోటళ్లలో తినాల్సి వస్తే ఎక్కువ శాతం భోజనం వైపే మొగ్గు చూపేవారు.. ఇప్పుడది మారింది. ఇల్లు.. రెస్టారెంట్‌.. ఏదైనా బిర్యానీని ఒక పట్టు పట్టాల్సిందే. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఇష్టంగా లాగించేస్తున్నారు. ఏ కార్యక్రమమైనా దీనికే పెద్దపీట వేస్తున్నారు.పూర్తి కథనం

6. బుల్‌ను మించిన బంగారం

ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధభాగంలో అటు స్టాక్‌ మార్కెట్, ఇటు బంగారం సానుకూలతలనే అందించాయి. ఈ రెండింటిలో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు మంచి లాభాలే వచ్చాయి. అయితే ఎన్‌ఎస్‌ఈ ప్రామాణిక సూచీ అయిన నిఫ్టీ 50కి మించి సంప్రదాయ పెట్టుబడి సాధనమైన పసిడి అధిక ప్రతిఫలాలను ఇవ్వడమే ఇక్కడ విశేషం. పూర్తి కథనం

7. మణికొండలో కేవ్‌ పబ్‌పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు

హైదరాబాద్‌: మణికొండలోని కేవ్ పబ్‌లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు సోదాలు చేశారు. పబ్‌లో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారంతో ఆకస్మిక దాడులు చేశారు. 50 మందిని అదుపులోకి తీసుకొని వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో 24 మంది మాదకద్రవ్యాలు స్వీకరించినట్లు నిర్ధరణ అయింది. పూర్తి కథనం

8. జీఎస్‌టీని 5 శాతం చేయండి

హైదరాబాద్‌: దేశంలో 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యాన్ని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) విధించుకుంది. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. మరోవైపు వైద్య బీమా ప్రీమియం ఏటా 15 శాతం వరకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి కథనం

9. రేపటి నుంచి ఉచిత ఇసుక

అమరావతి: రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందజేస్తుంది.పూర్తి కథనం

10. శారీరకంగా దృఢంగా ఉన్నా: దలైలామా

దిల్లీ: తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని.. బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బౌద్ధ గురువు దలైలామా పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసుకొని కోలుకుంటున్నారు. శనివారం 89వ పడిలోకి అడుగు పెట్టిన ఆయన ఈ మేరకు జన్మదిన సందేశం విడుదల చేశారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని