Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 08 Jul 2024 09:01 IST

1. చంద్రబాబుతోనే హైదరాబాద్‌ అభివృద్ధి: సినీ నటుడు సుమన్‌

ఆత్మకూరు, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వల్లే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని సినీ నటుడు సుమన్‌ పేర్కొన్నారు. ఆత్మకూరులో ఆదివారం మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగే వ్యక్తి చంద్రబాబు అన్నారు. పూర్తి కథనం

2. నేటి నుంచి పిన్నెల్లిని విచారించనున్న పోలీసులు

నరసరావుపేట: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం పోలీసులు విచారించనున్నారు. పోలింగ్‌ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావుపై పిన్నెల్లి దాడి చేశారు.పూర్తి కథనం

3. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో తండ్రీ, కొడుకు క్వాలిఫై

కామేపల్లి, న్యూస్‌టుడే: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌  పరీక్షలో తండ్రి, కొడుకు అర్హత సాధించారు. దాసరి రవికిరణ్‌ ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తనయుడు మైకేల్‌ ఇమ్మానియేలు (25) దూర్యవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. 53 ఏళ్ల వయస్సులో రవికిరణ్‌ తనయుడికి సూచనలు ఇవ్వడంతోపాటు తానూ పరీక్ష రాశారు. పూర్తి కథనం

4. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : బీటెక్‌ రవి

పులివెందుల (వేంపల్లె), న్యూస్‌టుడే : హత్యా రాజకీయాలే జగన్‌ కుటుంబ పునాదులని పులివెందుల తెదేపా బాధ్యుడు బీటెక్‌ రవి ధ్వజమెత్తారు. పులివెందులలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. వేంపల్లెలో వైకాపా కార్యకర్తపై దాడి జరిగిన ఘటనపై మాజీ సీఎం జగన్, శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు  వేదాలు వల్లించినట్లు ఉందని, వారు ఎలాంటి నేరం చేయనట్లు, వారికి క్రిమినల్‌ చరిత్ర లేనట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పూర్తి కథనం

5. భాజపాలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాజపాలో చేరాలంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ స్పష్టంచేశారు. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకునే అవకాశాలు లేవన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఎంపీ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.పూర్తి కథనం

6. అన్న నిర్వహణ కాంట్రాక్టర్‌.. మేనల్లుడు హెచ్‌ఆర్‌ అధికారి

సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు.. మేనల్లుడు హెచ్‌ఆర్‌ విభాగానికి ఇన్‌ఛార్జ్‌. ఇదీ ఏపీ ఫైబర్‌నెట్‌ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డి తీరు. ఆయన సొంత జాగీరులా సంస్థ ఆదాయాన్ని బంధుగణానికి.. కోటరీకి పంచిపెట్టారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌లో అక్రమాలు చూస్తే నోరెళ్లబెట్టే పరిస్థితి. 2019లో ఏటా రూ.7.08 కోట్లు ఉన్న సంస్థ జీతాల పద్దును.. ఏకంగా రూ.48 కోట్లకు పెంచేశారు.పూర్తి కథనం

7. ఇసుక విధానంలో డిజిటల్‌ చెల్లింపులు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో..సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్‌ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను విక్రయించి చెల్లింపులను నగదు రూపంలో తీసుకుని పెద్దయెత్తున అక్రమాలకు పాల్పడింది. పూర్తి కథనం

8. ప్రీమియం ఎకానమీ సీట్లతో ఎయిరిండియా కొత్త విమానం

దిల్లీ: ప్రీమియం ఎకానమీ సీట్లు అమర్చిన నారోబాడీ విమానమైన ఎ320 నియో, ఎయిరిండియాకు చేరింది. ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్‌ తరగతి సీట్లు, అదనపు లెగ్‌రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి.పూర్తి కథనం

9. స్నాక్స్‌ అంటే లొట్టలేస్తాం.. లేబుల్‌ చదివాకే పొట్టలోకేస్తాం

భారతీయుల్లో ఆరోగ్యకరమైన చిరుతిళ్లపై శ్రద్ధ పెరుగుతోంది. 73 శాతం మంది తాము చిరుతిళ్లు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్‌పై ముద్రించిన ముడి పదార్థాల (ఇంగ్రిడియంట్స్‌) జాబితా, పోషక విలువల వివరాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నట్లు ‘ది హెల్దీ స్నాకింగ్‌ రిపోర్ట్‌-2024’ నివేదిక తేల్చింది.పూర్తి కథనం

10. ఉత్తర భారతంలో తరుగుతున్న పాతాళగంగ

దిల్లీ: ఉత్తర భారత దేశం.. 2002 నుంచి 2021 మధ్య దాదాపు 450 క్యూబిక్‌ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కోల్పోయిందని తాజా అధ్యయనం పేర్కొంది. ఇది దేశంలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ అయిన ఇందిరా సాగర్‌ డ్యామ్‌ (మధ్యప్రదేశ్‌) గరిష్ఠ నిల్వ సామర్థ్యం కన్నా 37 రెట్లు ఎక్కువ కావడం విశేషం.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని