Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 10 Jul 2024 09:02 IST

1. తుంగభద్రలో అవి‘నీటి’ ప్రవాహం

ఆలూరు గ్రామీణ, హాలహర్వి, న్యూస్‌టుడే: తుంగభద్ర దిగువ కాల్వ ఆధునికీకరణ పనుల్లో అవి‘నీటి’ ప్రవాహం కొనసాగుతోంది. పనులన్నీ ప్రకాశం జిల్లాకు చెందిన వైకాపా నాయకుడి కనుసన్నల్లో కొనసాగుతున్నాయి. చిన్నస్థాయి గుత్తేదారుగా ఉన్న సదరు నేత వైకాపా పాలనలో బడా కాంట్రాక్టరుగా ఎదిగారు. పూర్తి కథనం

2. త్వరలోనే స్థానిక ఎన్నికలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ఓ ఫంక్షన్‌ హాల్‌లో కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.పూర్తి కథనం

3. పెద్దిరెడ్డి అక్రమాల నిగ్గు తేల్చుతాం!

రాయచోటి: కాలేటివాగు ప్రాజెక్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాల నిగ్గు తేల్చుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. కక్ష సాధింపులో భాగంగా ప్రాజెక్టు పనులు ఆపేయబోమని, పోలవరం ప్రాజెక్టే కడుతుండగా, కాలేటివాగు ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపేస్తామా అంటూ వ్యాఖ్యానించారు.పూర్తి కథనం

4. జీహెచ్‌ఎంసీ పరిధిలో రియల్‌ జిగేల్‌

‘గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది.   భవనాలు, లేఅవుట్ల అనుమతులతోపాటు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్న తీరు ఇందుకు నిదర్శనం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది’ అని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పూర్తి కథనం

5. కుమారస్వామి మనసులో ఏముందో?.. నేడు విశాఖ ఉక్కుకు రానున్న కేంద్ర మంత్రి

విశాఖ ఉక్కు భవిష్యత్తుపై మళ్లీ ఆశలు రేగుతున్నాయి. మూడేళ్లకు పైగా ఉద్యోగుల ఆందోళన... జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి... నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర ఉక్కుమంత్రి కుమారస్వామి బుధవారం వస్తున్నారు. ఉన్నతాధికారులు, కార్మిక నేతలతో గురువారం సమీక్షించనున్నారు.పూర్తి కథనం

6. నాకు విలువ ఉంది.. నన్ను దూరం చేయకండి!

ప్రస్తుతం మార్కెట్లో రూ.10 నాణెం వినియోగం కనుమరుగవుతోంది. కొందరు వ్యాపారులు   వద్దంటున్నారు.  చాలా మంది వినియోగంలో లేవనే ఉద్దేశంతో  తీసుకోవడం లేదు. దీంతో ఎక్కడికక్కడే ఉండిపోయాయి.  రూ.10 విలువైన నోట్ల వినియోగం సైతం తగ్గిపోయింది. దీంతో మార్కెట్లో నగదు, చిల్లర సమస్యలు ఏర్పడుతున్నాయి. పూర్తి కథనం

7. ఇది కాదా... ‘అచ్చు’త్సాహం!

ఈ పుస్తకాలేమీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నవి కాదు.. తన సొంత డబ్బులతో కొనే పుస్తకాలపై వైకాపా రంగులను పోలి ఉండేలా.. లోపల సీఎం జగన్మోహన్‌రెడ్డి అని ఆయన ఫొటోతో తెలుగు సంస్కృత అకాడమీ ముద్రించింది. వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు డీఎస్సీ నిర్వహిస్తామని హడావుడి చేసి చివరికి చేతులు ఎత్తేసింది.పూర్తి కథనం

8. మా పిల్లలు గంజాయికి బానిసలయ్యారు

‘మా పిల్లలు గంజాయికి బానిసలయ్యారు. గత ఐదేళ్లలో ఎక్కడంటే అక్కడ దొరకడం వల్ల గంజాయికి అలవాటు పడి ఆసుపత్రుల పాలయ్యారు. గంజాయి దొరక్కుండా చేసి మా పిల్లల్ని కాపాడండి’.. అని గుంటూరు నల్లచెరువు మహిళలు ఎమ్మెల్యే గళ్లా మాధవి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు.పూర్తి కథనం

9. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా?: మంత్రి పొంగులేటి

‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. సర్కారును కూల్చివేస్తామంటూ భారాస అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి చాటుమాటుగా దిల్లీలో భాజపా నేతలతో కేసీఆర్‌ మాట్లాడారు. త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని, భారాస అధికారంలోకి వచ్చాక ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తామో కూడా ఆయన చెప్పుకొన్నారు.పూర్తి కథనం

10. డీజీపీగా జితేందర్‌!

హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియవచ్చింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని