Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 11 Jul 2024 09:00 IST

1. పెట్రోలియం రిఫైనరీపై ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు దిశగా మరో అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురిని కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించి వారం కూడా గడవక ముందే బీపీసీఎల్‌ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్లతో ఏర్పాటు చేసే ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించింది. పూర్తి కథనం 

2. మానవతతో భూ పరిహారం

హైదరాబాద్‌: జాతీయ రహదారులకోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలో రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో సీఎం బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.పూర్తి కథనం 

3. జోగి మెడకు అగ్రి ఉచ్చు.. ఏసీబీ విచారణకు డీజీపీ ఆదేశం

మాజీ మంత్రి జోగి రమేష్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వం జప్తు చేసిన భూములను కబ్జా చేసిన వ్యవహారంలో ఆయనపై విచారణ ప్రారంభించారు. ఏకంగా సర్వే నెంబరు మార్చి.. తనయుడు రాజీవ్, బాబాయ్‌ వెంకటేశ్వరరావు పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేయించిన ఆయన వాటిని వెంటనే అమ్మడం అనుమానాలకు తావిస్తోంది.పూర్తి కథనం 

4. టోఫెల్‌ పరీక్ష ఇక రెండు గంటల్లోపే..

హైదరాబాద్‌: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు టోఫెల్‌ పరీక్షను రెండు గంటల్లోపే నిర్వహించాలని నిర్ణయించినట్లు టోఫెల్‌ సంస్థ గ్లోబల్‌ హెడ్‌ ఒమర్‌ చిహాన్‌ తెలిపారు. విద్యార్థులు ఇష్టంగా మరింత ప్రశాంతంగా పరీక్ష రాయాలన్నదే తమ లక్ష్యమన్నారు.పూర్తి కథనం 

5. వైకాపా నాయకుల చూపు కూటమి వైపు

నిడదవోలు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమితమైన  నేపథ్యంలో అయిదేళ్ల రాజకీయ భవిష్యత్తుపై వైకాపా నాయకుల్లో గుబులు పట్టుకుంది. స్థానిక సంస్థల్లో విజయం సాధించిన వైకాపా నాయకులు తెదేపా, జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజులుగా వీరు కూటమి పార్టీల ప్రధాన నాయకులతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  పూర్తి కథనం 

6. కొత్త సినిమా టికెట్‌ ధరల పెంపుపై లోతైన విచారణ: ఏపీ హైకోర్టు

అమరావతి: కొత్త సినిమాల టికెట్‌ ధరలను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా.. లేదా.. అనే విషయాన్ని తేలుస్తామని, ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేస్తామని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని, ఇతర ప్రతివాదులను ఆదేశించింది.పూర్తి కథనం 

7. గంజాయి నియంత్రణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక

పాడేరు, న్యూస్‌టుడే: గంజాయి నియంత్రణకు ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆమె పర్యటించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘గిరిజనులకు చేతులెత్తి దండం పెడుతున్నా.. గంజాయికి దూరంగా ఉండండి’ అని విజ్ఞప్తి చేశారు.పూర్తి కథనం 

8. జగన్‌ లాంటి నియంత చేతిలో ఏపీ నలిగిపోవాలని కేటీఆర్‌ ఆశించారేమో: సోమిరెడ్డి

అమరావతి: జగన్‌మోహన్‌రెడ్డిలాంటి నియంత చేతిలో ఆంధ్రప్రదేశ్‌ మరో ఐదేళ్లు నలిగిపోవాలని భారాస నాయకత్వం ఆశించిందని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దిల్లీలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు, రాజకీయాలపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల్ని ఎక్స్‌ వేదికగా తప్పుబట్టారు.పూర్తి కథనం 

9. అనిశ్చితిలో యువత భవిత

దిల్లీ: భాజపా విద్యా వ్యతిరేక విధానాలవల్ల దేశంలోని యువత మొత్తం నిరాశలో కూరుకుపోయిందని, వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. నియామకాల్లో మందకొడి కారణంగా ఐఐటీల్లోని ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ల వేతనాల్లో తగ్గుదల నమోదైందని వచ్చిన వార్తలపై బుధవారం ఆయన వాట్సప్‌ ఛానల్‌లో స్పందించారు.పూర్తి కథనం 

10. పర్యాటక ప్రగతిలో మనమెక్కడ?

పర్యాటకంగా రాష్ట్రంలో అనేక ఆకర్షణలు ఉన్నా... ఆ రంగంలో పురోగమనం మాత్రం లేదు. 2022లో దేశీయ పర్యాటకుల్లో రాష్ట్ర వాటా 2022లో 3.51 శాతం...విదేశీ పర్యాటకుల్లో 0.80 శాతమే ఉంది. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మన కంటే ముందంజలో ఉన్నాయి.పూర్తి కథనం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని