Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 Jun 2024 09:00 IST

1. అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల

గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు జగనన్న కాలనీల పేరుతో ప్రజాధనాన్ని మెక్కేశారు. ఇళ్ల పట్టాల పంపిణీని అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. రాప్తాడు పరిధిలోని ప్రభుత్వ లేఅవుట్‌లోని ఓపెన్‌ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కూడా ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించేశారు. పూర్తి కథనం

2. స్వీయ తప్పిదాలతోనే పాస్‌పోర్టు జారీలో ఆలస్యం

ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో 5  సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. రోజూ 4,000 పాస్‌పోర్టులు మంజూరు చేస్తున్నారు. ధ్రువపత్రాల సరిగా లేకపోవడంతో 5 నుంచి 10 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. అపాయింట్‌మెంట్‌ లభించిన తర్వాత దరఖాస్తుదారులు ఏఆర్‌ఎన్‌ (అప్లికేషన్‌ రిఫరెన్స్‌ నంబరు) ప్రతిలో ఇచ్చిన సూచనలు చదవక పోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు.పూర్తి కథనం

3. వైకాపా సేవలో.. విశాఖ పోలీసులు!

విశాఖలో కొందరు పోలీసులు ఐదేళ్లుగా ప్రజల రక్షణను గాలికొదిలేసి.. వైకాపా నాయకులు ఏది చెబితే అది చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ఆ నాయకులను అడ్డుకోవడం, అక్రమ కేసులు బనాయించడం, ప్రజల పక్షాన పోరాడిన మీడియా మీద కక్షతో కేసులు పెట్టడం తప్ప.. ప్రశాంత నగరంలో శాంతిభద్రతలు ఏమైపోతున్నాయో కనీసం పట్టించుకోలేదు.పూర్తి కథనం

4. భారాస హయాంలో అనర్హులకూ పోడు భూములు

భారాస ప్రభుత్వ హయాంలో పోడు భూముల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అనర్హులకు పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారుల్ని ఆమె ఆదేశించారు. పూర్తి కథనం

5. బుక్కెడు బువ్వకు భరోసా!

అన్నార్తులు, పేదల క్షుద్బాధ తీరనుంది. మూడు పూటలా కడుపు నిండా ఆహారం అందనుంది. వైకాపా పాలనలో మూతపడిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.పూర్తి కథనం

6. తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పలు సమస్యలు తిష్ఠవేశాయి. దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుండగా గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత సంక్లిష్టంగా మారినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టే ఉన్నతాధికారులు ఆదిశగా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.పూర్తి కథనం

7. పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌?

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్‌ తెరిచినట్లు తెలిసింది. పోలింగ్‌ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారు. దీన్ని అడ్డుకున్న తెదేపా కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై అనుచరులతో దాడి చేయించారు.పూర్తి కథనం

8. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిటీని కేసీఆర్‌ రద్దు చేయమనడం విడ్డూరం

భారాస పార్టీని భాజపాలో విలీనం చేయడానికి భారాస లోపాయికారీగా చర్చలు జరుపుతుందని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పూర్తి కథనం

9. ‘పబ్‌జీ’ ప్రియుడి కోసం.. భారత్‌కు అమెరికా యువతి

పబ్‌జీ ఆడుతూ ప్రేమలో పడి భారత్‌కు వచ్చిన పాక్‌ మహిళ సీమా హైదర్‌ తరహాలోనే మరో ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఈసారి అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చిన యువతిని ఇటావా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్‌ (30) అనే యువతికి ఇటావా యువకుడు హిమాన్షు యాదవ్‌తో పబ్‌జీ ఆట ద్వారా పరిచయం పెరిగి ప్రేమగా మారింది.పూర్తి కథనం

10. అధికారం వచ్చిందని.. కక్ష సాధింపులొద్దు

‘అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు.. విర్రవీగడం లాంటి చర్యలొద్దు.. ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దు’ అని తెదేపా నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కార్యకర్తల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు స్పష్టం చేశారుపూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని