Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Jun 2024 09:08 IST

1. ఒత్తిడికి ఓడిపోతున్నారు!

ప్రేమ విఫలమైందనో... కుటుంబ సమస్యలనో...ఆర్థిక ఇబ్బందులనో.. పరీక్షల్లో తప్పామనో... ఇలా రకరకాల కారణాలతో ఒత్తిడికి లోనై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. జీవితంలో ముందుకెళ్లే దారి కనబడక.. తోడుగా నిలిచేవారు లేక.. ఎంతో విలువైన జీవితానికి విషాదకర ముగింపు పలుకుతున్నారు. కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగుల్చుతున్నారు. పూర్తి కథనం

2. రైలు ప్రయాణం మరింత సులభం

రైలులోని సాధారణ (జనరల్‌) బోగిల్లో టిక్కెట్‌ తీసుకోవడం కష్టసాధ్యంగా ఉండేది. సికింద్రాబాద్, విజయవాడ, కాజీపేట్‌ వంటి పెద్ద స్టేషన్లలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు ఉంటారు. వరుసలో నిలబడి టికెట్‌ తీసుకోవడం సమయం పట్టడంతోపాటు శ్రమతో కూడుకున్న పని. దీన్ని గుర్తించి జనరల్‌ టికెట్‌ పొందేందుకు పలు విధానాలను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. యూటీఎస్‌ యాప్, ఏటీవీఎం యంత్రం, క్యూఆర్‌ కోడ్‌ విధానాలతో సులభంగా టిక్కెట్‌ పొందే అవకాశం ఉంది.పూర్తి కథనం

3. కేసీఆర్‌కు న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లుంది

‘‘విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై జ్యుడిషియల్‌ విచారణకు రాబోమని ఎవరైనా అంటే వారి గురించి న్యాయవ్యవస్థ చూసుకుంటుంది. జస్టిస్‌ నరసింహారెడ్డి అనుభవం కలిగిన వారు. నేను చెప్పిందే వేదం, శాసనం.. విచారణకు హాజరుకాము అని కేసీఆర్‌ అంటున్నారంటే ఆయనకు న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని భావిస్తున్నాం. పూర్తి కథనం

4. బాధ్యతలు అప్పగించక ముందే సామగ్రి తరలింపు.. ధర్మారెడ్డి తీరుపై విమర్శలు

తితిదే ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి మరొకరికి బాధ్యతలు అప్పగించక ముందే గుట్టుగా తన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసేసి, సామగ్రిని తరలించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 11 నుంచి ధర్మారెడ్డికి ప్రభుత్వం సెలవు మంజూరు చేయగా.. ఆ రోజే తిరుమలలోని క్యాంపు కార్యాలయం నుంచి తనకు సంబంధించిన వస్తువులు, సామగ్రిని రెండు ట్రక్కుల్లో తరలించేశారు.పూర్తి కథనం

5.మేరఠ్‌లో అతిపెద్ద భూగర్భ రైల్వేస్టేషన్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో అతిపెద్ద ఆర్‌ఆర్‌టీఎస్‌ భూగర్భ రైల్వేస్టేషను నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ రైల్వేస్టేషనులో ప్రయాణికులు సులువుగా లోపలకు, బయటకు వెళ్లేలా నాలుగు ప్రవేశ, నిష్క్రమణ గేట్లతోపాటు 20 చోట్ల అత్యాధునిక ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. మెట్లతోపాటు అయిదు లిఫ్టులు కూడా అందుబాటులో ఉంటాయి. పూర్తి కథనం

6. మందుపాతరల దండకారణ్యం..!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ అభయారణ్యం అట్టుడుకుతోంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఆధిపత్య పోరుతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. వరుసగా వెలుగుచూస్తున్న మందుపాతరల ఘటనలతో గండకారణ్యంగా మారింది. భద్రత బలగాలే లక్ష్యంగా మావోలు ఏర్పాటు చేసిన ప్రెషర్‌ బాంబులు పేలుతుండటంతో కలవరానికి దారి తీస్తోంది.పూర్తి కథనం

7. కల్తీ ఆహారం.. ప్రజారోగ్యం పణం!

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనుమతుల్లేని దుకాణాలు.. కల్తీ ఆహారం.. నామమాత్రంగా తనిఖీలు, అరకొరగా నమూనాల సేకరణ.. ఫలితాల వెల్లడిలో జాప్యం.. వెరసి ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. కల్తీ ఆహారం ప్రజారోగ్యాన్ని చిదిమేస్తోంది. ఆర్థికంగానూ అవస్థల పాల్జేస్తోంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. పూర్తి కథనం

8. తెదేపాకు, చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటా

వెనకబడిన వర్గాలకు చెందిన తనకు ఇన్నాళ్ల పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. 164 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు విజయకేతనం ఎగరవేసేలా పార్టీ శ్రేణులు అహర్నిశలు పడ్డ కృషిలో తానూ పాలుపంచుకున్నానని గుర్తు చేసుకున్నారు.పూర్తి కథనం

9. సైబర్‌ వలతో విలవిల.. మాతృభూమికి రప్పించడం ఎలా?

ఉద్యోగాలపై ఆశతో కంబోడియా వెళ్లి.. అక్కడి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ యువత రక్షణపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 మందిని ఆ రాష్ట్ర పోలీసులు సైబర్‌ నేరస్థుల చెరనుంచి విడిపించి వెనక్కి రప్పించారు. తెలంగాణకు చెందిన యువకులకు కూడా విముక్తి కల్పించాలని ఇక్కడి అధికారులు నిర్ణయానికి వచ్చారు.పూర్తి కథనం

10. తెదేపా స్పీకర్‌ అభ్యర్థిని నిలిపితే ‘ఇండియా’ మద్దతు!

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలో తెదేపా తన అభ్యర్థిని నిలబెడితే ఆ పార్టీకి ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తారని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. ముంబయిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..స్పీకర్‌ ఎన్నిక చాలా ముఖ్యమైందన్నారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని