Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 19 Jun 2024 09:00 IST

1. కలుగులోకి దొంగలు... వెలుగులోకి అక్రమాలు

వైకాపా ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్ల జాడ గత 15 రోజులుగా కనిపించడంలేదు. అటు అడవుల్లోనూ... ఇటు ఎర్రచందనం స్మగ్లర్ల స్థావరాల్లోనూ చడీచప్పుడు లేకుండా పోయింది. ఓట్ల లెక్కింపు తర్వాత నుంచే కీలక స్మగ్లర్లు కనిపించకుండా పోయారు. వారి అనుచరుల జాడ కూడా లేకుండా పోయింది. వైఎస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని పీలేరు, రైల్వేకోడూరు, రాజంపేట, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో స్మగ్లర్ల ఇళ్లు మూతపడ్డాయి. పూర్తి కథనం

2. పవిత్రాగౌడకు అనారోగ్యం

చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రథమ నిందితురాలు పవిత్రాగౌడ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను మంగళవారం ఇక్కడ అన్నపూణేశ్వరి నగర పోలీసులు విచారిస్తున్న సమయంలో నీరసించిపోయారు. పోలీసులు వెంటనే స్పందించి వైద్యులను రప్పించి సేవలందించారు. అక్కడి నుంచి మల్లత్తహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.పూర్తి కథనం

3. శ్రావణపల్లి దక్కేనా?

దేశవ్యాప్తంగా కొత్త గనుల వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 21న లేదా ఆ తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర బొగ్గుశాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కిషన్‌రెడ్డి ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు బొగ్గు గనుల వేలం పాటలను దేశంలో ఒక్కో నగరంలో నిర్వహిస్తూ వచ్చారు.పూర్తి కథనం

4. గెలిచే సీట్లను చేజార్చారు!.. నేతల తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి

రాజంపేటలో తెదేపా ఓటమిపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను స్వయంగా ప్రచారానికి రావడంతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సైతం ప్రచారం చేయడంతో పాటు రాజంపేటను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత సైతం ఓటమి చెందడం ఏమిటని ప్రశ్నించారు.పూర్తి కథనం

5. ఉండాల్సింది 55 ఉన్నది 80

జూబ్లీహిల్స్‌ నివాసిత ప్రాంతంలో విపరీతమైన శబ్ద కాలుష్యం నమోదవుతోంది. నిర్మాణ కార్యకలాపాలు, డీజేల హోరు, వాహనాల రాకపోకలే ఇందుకు కారణమని తెలుస్తుంది. 65 డెసిబుల్స్‌ శబ్ద తీవ్రత దాటితే గుండె జబ్బులు, చెవుడు వచ్చే ప్రమాదం ఉందని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరిస్తుంటే.. మార్చి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అంతకు మించి శబ్ద తీవ్రత పెరుగుతోంది.పూర్తి కథనం

6. వరికపూడిశెలకు ఊపిరి

నాగార్జునసాగర్‌ జలాశయం బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసి సాగర్‌ కుడికాలువ కింద సాగునీరు అందని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని ఆయకట్టు సాగునీరు ఇవ్వడానికి వరికపూడిశెల ప్రాజెక్టు ప్రారంభించారు. తొలి విడతలో పల్నాడు జిల్లాకు, రెండో విడతలో పల్నాడుతోపాటు ప్రకాశం జిల్లాలోని పంట భూములకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. కొన్నేళ్లుగా ప్రతిపాదనలు ఉన్నా ఆచరణలో అనేక అడ్డంకులు ఎదురుకావడంతో పనులు ప్రారంభం కాలేదు.పూర్తి కథనం

7. తప్పుల తడకగా పదోన్నతుల జాబితా

స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతుల జాబితాలో తప్పులు చోటుచేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో మంగళవారం గందరగోళం నెలకొంది. మల్టీ జోన్‌-1(వరంగల్‌) పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10 వేల మందికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు దక్కాలి. ఆ మేరకు సోమవారం అర్ధరాత్రి దాటాక పదోన్నతుల జాబితాను పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఈవోలకు పంపారు.పూర్తి కథనం

8. ఎంపీ సై అంటే ఇక్కడ కొలువు

మాజీ సీఎం జగన్‌ ఇలాకా.. వైఎస్సార్‌ జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు వైకాపా కార్యకర్తలకు పునరావాస కేంద్రాలుగా మారాయి. ఎంపీ అవినాష్‌రెడ్డి ఎవరి పేరు చెబితే వారికి వీటిలో ‘పొరుగు సేవల’ కింద ఉద్యోగాలు దక్కుతున్నాయి. వైకాపా పాలనలో వందలమంది తమ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ ఉద్యోగాలు లభించాయి.పూర్తి కథనం

9. లోక్‌సభలో 6వ అతిపెద్ద పార్టీ తెదేపా.. వైకాపాకు ఎన్నో స్థానమంటే?

మొత్తం 41 పార్టీల సభ్యులతో కొత్తగా ఏర్పడనున్న 18వ లోక్‌సభలో సంఖ్యాపరంగా తెలుగుదేశం ఆరో అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది. మొత్తం సభలో భాజపా - 240, కాంగ్రెస్‌ - 99, సమాజ్‌వాదీ పార్టీ - 37, తృణమూల్‌ కాంగ్రెస్‌- 29, డీఎంకే - 22 స్థానాలతో తెదేపా కంటే పైనున్నాయి. తెలుగుదేశం పార్టీ 16 మంది సభ్యులతో  6వ స్థానంలో ఉంది.పూర్తి కథనం

10. 2026లో దేశీయ తయారీ ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌

భారతదేశంలో తమ హెలికాప్టర్లను రూపొందించేందుకు తుది అసెంబ్లింగ్‌ లైన్‌ను ఎక్కడ నెలకొల్పేదీ టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ భాగస్వామ్యంతో నిర్ణయిస్తామని ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌ ప్రకటించింది. 2026లో దేశీయ తయారీ హెలికాప్టర్‌ను ఆవిష్కరించాలన్నది తమ ప్రణాళికగా సంస్థ పేర్కొంది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని