Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 20 Jun 2024 09:01 IST

1. బాబోయ్‌ బె‘ధర’గొడుతున్నాయ్‌!

ఇటీవల వరకు రూ.వందతో మార్కెట్‌కు వెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. గత పది రోజులుగా ఆ పరిస్థితి లేకపోయింది. ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చోవడంతో సామాన్యులు కొనే పరిస్థితి లేకపోయింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులు.. ఎండలు, కొన్నిచోట్ల అకాల వర్షాలతో తోటలు దెబ్బతిన్నాయి. పూర్తి కథనం

2. దశలవారీగా రుణమాఫీ?

వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశలవారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.పూర్తి కథనం

3. తెలుగు అకాడమీ.. ఉన్నట్లా.. లేనట్లా..?

వైకాపా పాలనలో తెలుగు అకాడమీ చిరునామా గల్లంతైంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తుండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్కడికి తరలించారు. తదనంతరం కాగితాలకే పరిమితమై కేవలం ప్రాంతీయ తెలుగు అకాడమీ కేంద్రం కార్యకలాపాలకు పరిమితమైంది.పూర్తి కథనం

4. సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు

సింగరేణి ప్రైవేటీకరణ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. 2018 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేసీఆర్‌ సింగరేణి ప్రైవేటీకరణ అంటూ విషప్రచారంచేశారు తప్ప, అందులో నిజం లేదన్నారు. దిల్లీలోని తన కార్యాలయంలో ఆయన బుధవారం వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.పూర్తి కథనం

5. జోగి.. ఇదేం యాగీ! 

విజయవాడ గ్రామీణ పరిధిలోని అంబాపురంలో సీఐడీ జప్తు చేసిన అగ్రి గోల్డ్‌ సంస్థ భాగస్వాముల భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ అడ్డంగా బుకాయిస్తున్నారు. తన తప్పేమీ లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.పూర్తి కథనం

6. బెదిరించి రాజీనామా చేయించారు.. వైకాపా నాయకులపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదులు

వైకాపా ప్రభుత్వంలో ప్రజలు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే కాదు వాలంటీర్లూ బాధితులే. వాలంటీర్లంతా ప్రభుత్వ కార్యక్రమాల అమలుకే పనిచేస్తున్నారని అప్పటి ప్రభుత్వం సుద్దులు చెప్పినా.. ఎన్నికల ముందు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించడం దగ్గర నుంచి కులాలవారీగా ఓటర్ల వివరాలు సేకరించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో భాగం చేయాలని వైకాపా పథకం వేసింది.పూర్తి కథనం

7. నకిలీ బీమా ఉంటే.. తప్పించుకోలేరు

ఉత్తుత్తి వాహన బీమాకు రవాణాశాఖ చెక్‌ పెట్టనుంది. ఇప్పటివరకు యథేచ్ఛగా జరుగుతున్న ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ)తో పూర్తి స్థాయిలో అనుసంధానించేందుకు యోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.పూర్తి కథనం

8. డ్రోన్ల సాయంతో కొరియర్‌ డెలివరీ

డ్రోన్ల ద్వారా కొరియర్‌ డెలివరీని విజయవంతంగా ప్రారంభించినట్లు బ్లూడార్ట్‌ తెలిపింది. ఇందుకోసం డ్రోన్‌ సాంకేతికతలో దిగ్గజమైన స్కై ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. తన రవాణా వ్యవస్థలను మెరుగుపర్చుకోవడానికి డ్రోన్‌ సాంకేతికతనూ ఉపయోగించుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు బ్లూడార్ట్‌ సమాచారమిచ్చింది.పూర్తి కథనం

9. అధిక ధర నిర్ణయంలో అత్యుత్సాహం ఎవరిది? 

తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీజీబీసీఎల్‌) యంత్రాంగం విస్మయకర నిర్ణయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో, మరే కంపెనీకీ ఇవ్వని తీరులో ఒక సంస్థ బీర్లకు ఇబ్బడిముబ్బడిగా ప్రాథమిక ధర నిర్ణయించడం విస్మయపరుస్తోంది.పూర్తి కథనం

10. జగన్‌కు వ్యతిరేకంగా జనమంతా ఏకం

ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్‌ను గద్దె దించాలని బలంగా అనుకున్నారని, అందుకే వైకాపా ఘోర పరాజయం చవిచూసిందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలోనే విచిత్రమైనవని అభివర్ణించారు. విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని