Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jun 2024 09:08 IST

1. భజన చేశారు.. పర్యవేక్షకుడి కుర్చీలో కూర్చొన్నారు

కర్నూలు వైద్య కళాశాలలో కార్డియోథొరాసిక్‌ విభాగాధిపతి పనిచేసిన ప్రొఫెసర్‌ ప్రభాకరరెడ్డి రాసిన కవితా పంక్తులివి. ఇలా నిత్యం జగన్‌ను స్తుతిస్తూ కవితలల్లి సామాజిక మాధ్యమాల్లో పెడుతు ప్రస్తుతం వైద్యశాల పర్యవేక్షకుడి కుర్చీలో కూర్చొన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఆయన వైద్య వృత్తిని పూర్తిగా పక్కన పెట్టేసి జగన్‌ను ఆకాశానికి ఎత్తారు.. మరోవైపు ప్రతిపక్షాలపై అభ్యంతరకర పదాలు వాడేవారు. పూర్తి కథనం

2. తెలంగాణ గడ్డపై భాజపా పాగా ఖాయం

శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 88 మంది శాసనసభ్యులను గెలిపించుకుని.. తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి కార్యకర్త ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘సెల్యూట్‌ తెలంగాణ’ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.పూర్తి కథనం

3. ‘షిప్‌యార్డు’.. పడిలేచిన కెరటం!

దేశంలోనే తొలి నౌకా నిర్మాణ కేంద్రమైన విశాఖపట్నం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు(రక్షణ ఉత్పత్తుల సంస్థ)’ పడిలేచిన కెరటంలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. దేశ, రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి తనవంతుగా సేవలు అందజేస్తూ జాతీయస్థాయిలో ఎనలేని కీర్తిని సముపార్జించింది. నేడు సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా...ప్రస్థాన పర్వం తెలుసుకుందాం.పూర్తి కథనం

4. వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులివ్వాలి

గోదావరి పరీవాహకంలోని కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను సన్నిహిత పారిశ్రామికవేత్తల కంపెనీలకు అప్పగించేందుకు నాటి భారాస ప్రభుత్వం.. బొగ్గు గనుల వేలంలో పాల్గొననీయకుండా సింగరేణిని నిండా ముంచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆయన గురువారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు.పూర్తి కథనం

5. అడవుల పరిరక్షణకు ప్రత్యేక రూట్‌ మ్యాప్‌: ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

రాష్ట్రంలో అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. మడ అడవుల పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యమివ్వాలని, వాటిని ధ్వంసం చేసే వారెవరినీ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అటవీ శాఖాధికారులతో గురువారం ఆయన సమీక్షించారు.పూర్తి కథనం

6. హైదరాబాద్‌ వాసులు మదుపరులే.. ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు!

భాగ్యనగరవాసులు ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు.. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హోం క్రెడిట్‌ ఇండియా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ వాలెట్‌’ జాతీయ స్థాయి అధ్యయనం స్పష్టం చేసింది. ఆర్థిక క్రమశిక్షణలోనూ ఇతర నగరాల కంటే మెరుగైన స్థానంలో ఉన్నారని వెల్లడించింది. సగటు వ్యక్తిగత ఆదాయంలోనూ 17 నగరాల కంటే ముందున్నారని పేర్కొంది.పూర్తి కథనం

7. నిజాం నగలు నగరానికి వచ్చేదెన్నడో..?

ఆర్బీఐ అధీనంలో ఉన్న నిజాం నగలను నగరానికి తీసుకురావాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భవనం, భద్రత ఏర్పాట్లు చేస్తే వాటిని తీసుకురావడానికి ఇబ్బందులు లేవని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రెండేళ్ల క్రితం ప్రకటించారు. సొంత భవనం లేదా సాలార్‌జంగ్‌ మ్యూజియంలోనే ఓ ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పూర్తి కథనం

8. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ని నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం వెల్లడించారు.పూర్తి కథనం

9. జాడ లేని వరుణుడు.. మండుతున్న భానుడు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే ఈ నెల 2న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గురువారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. కానీ ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి ప్రభావం చూపడంతో స్తబ్దుగా ఉండిపోయాయి. రాష్ట్రమంతటా నైరుతి వ్యాపించినా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. పూర్తి కథనం

10, జగన్‌ భక్త ఐపీఎస్‌ అధికారులపై వేటు

జగన్‌ ప్రభుత్వ హయాంలో వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకుల అరాచకాలకు కొమ్ముకాసిన వివాదాస్పద ఐపీఎస్‌ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్ర డీజీపీగా ఉంటూ మొత్తం పోలీసు వ్యవస్థనే వైకాపా అనుబంధ విభాగంగా మార్చేసిన ప్రస్తుత ఏసీబీ డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీ చేసింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని