Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jun 2024 09:11 IST

1.  కి.మీ. పరిగెత్తి.. అమ్మ ప్రాణాలు కాపాడుకుని..

అపస్మారక స్థితిలో ఉన్న తల్లిని చూసి ఆ కుమార్తె తల్లడిల్లిపోయింది. చెల్లితో పాటు కి.మీ.దూరంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి తమ తల్లిని కాపాడాలని వేడుకుంది. వెంటనే పోలీసులు అప్రమత్తం అవ్వడంతో ఆ మహిళ ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో శనివారం చోటుచేసుకుంది. పూర్తి కథనం

2. హైదరాబాద్‌లో.. బాబోయ్‌ ఇదేం ట్రాఫిక్‌!

రోడ్డెక్కితే గమ్యం చేరేందుకు వాహనదారులు నరకం చవిచూస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్‌ సమస్యతో విసుగెత్తి పోతున్నారు. అర కిలోమీటరు దూరానికి అరగంట వెచ్చించాల్సి వస్తోంది. కీలకమైన సమయంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు కనిపించడం లేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు.పూర్తి కథనం

3. ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్కారు మథనం

రాష్ట్రంలో పెండింగులో ఉన్న అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) చిక్కుముడులు విప్పేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలుండడంతో నాలుగేళ్లుగా ఈ వ్యవహారం అపరిష్కృతంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన.పూర్తి కథనం

4. దూర ప్రయాణాలకు ఎక్స్‌ప్రెస్‌లు దూరం!

 రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలున్న ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ పెంచడం లేదు. పూర్తి టికెట్‌ కొనాల్సిన డీలక్స్‌ బస్సుల వైపు వారిని మళ్లించేందుకు కొన్నిచోట్ల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా డీలక్స్‌ బస్సు ఎక్కితే మహిళలకు బహుమతులు ఇస్తామంటూ కొత్త స్కీంను ప్రారంభించింది.పూర్తి కథనం

5. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వసూళ్ల దందా!

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వసూళ్ల దందా పరాకాష్ఠకు చేరింది.  ర్యాంకు వచ్చిన వారిని అడ్డమైన కారణాలు చెప్పి బాదేస్తుంటే..ర్యాంకు రాని వారిని డొనేషన్‌ పేరుతో వీరబాదుడు బాదేస్తున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్య అందని ద్రాక్షగా మారుతోంది. వైకాపా పాలనలో విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నమైంది.పూర్తి కథనం

6. జనాభా ప్రాతిపదికన నిధులివ్వండి

‘కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు ఒక నిర్దిష్ట విధానాన్ని పాటించడంలేదు. రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఆ నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం దామాషా పద్ధతిలో విడుదల చేయాలి’ అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.పూర్తి కథనం

7. ఫ్యాన్‌ సేవలో రెక్కలుముక్కలు.. గత అయిదేళ్లు కొమ్ముకాసిన ఖాకీలెందరో

గత అయిదేళ్లలో పోలీసులందు ఏపీ పోలీసులు వేరయా అన్నట్లు ఆ శాఖ తీరు ఉంది. డీజీపీ స్థాయి అధికారులే వైకాపాకు ఊడిగం చేస్తే మా స్థాయిలో మేం చేయొద్దా అంటూ స్థానిక పోలీసులు అప్పటి వైకాపా నేతల సేవలో తరించడానికి పోటీపడ్డారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కంటే నాటి అధికార పార్టీ నేతల కొమ్ముకాయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.పూర్తి కథనం

8. ఇంద్రకీలాద్రికి అమరావతి రైతుల పాదయాత్ర

రాజధాని ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. ఆదివారం తెల్లవారుజామున తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు.పూర్తి కథనం

9. జులై 2న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ!

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై 2న ఉంటుందని కాంగ్రెస్‌ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందని చెప్పారు. ఆ రోజు మక్తల్‌ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణం చేస్తారని వెల్లడించారు.పూర్తి కథనం

10. భారాస పాలనలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం

దేశంలోనే మంచి సంస్థగా పేరొందిన సింగరేణి పదేళ్ల భారాస పాలనలో ఆర్థిక విధ్వంసానికి గురై, దివాలా తీసేస్థితికి చేరుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు వరకూ బ్యాంకు ఖాతాల్లో రూ.3,500 కోట్ల డిపాజిట్లు ఉన్న సింగరేణిని రూ.30 వేల కోట్ల అప్పులపాలు చేసిన పాపం కేసీఆర్‌దే అన్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని