Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 26 Jun 2024 09:03 IST


 

1. ఆగని ఇసుక దందా

తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా ఇంకా ఆగలేదు. వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు ఐదేళ్లపాటు యథేచ్ఛగా పెన్నానదిలో నుంచి ఇసుకను కొల్లగొట్టి  రూ.లక్షలు వెనకేసుకున్నారు. జగన్‌ ప్రభుత్వం మారినా... వారి ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడలేదు. పూర్తి కథనం

2. పటిష్ఠ విధానాలతో రైతుభరోసా

గత భారాస ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. పూర్తి కథనం

3. కలెక్టర్‌ చెబితే మాకేంటి.. మేం చెప్పిందే ధర

చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి ధరలు మళ్లీ పతనమయ్యాయి.. ధరల తగ్గుదలతో రైతులు ఆందోళనలో పడ్డారు.. ఈ ఏడాది గణనీయంగా మామిడి దిగుబడులు పడిపోవడంతో.. చేతికొచ్చిన పంటను కంటికి రెప్పలా కాపాడినప్పటికీ.. మంచి ధర లేక కర్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పూర్తి కథనం

4. అక్రమాలు సహించం

అధికారులు, నాయకులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పట్టణంలోని పంచాయతీరాజ్‌శాఖ అతిథిగృహంలో మంగళవారం అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.పూర్తి కథనం

5. ఇంతకీ ఏం జరుగుతోంది?

జగిత్యాల భారాస ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు అధికార పార్టీ తీవ్రంగా యత్నిస్తోందిపూర్తి కథనం

6. ‘చెవి’కి భూములు.. జనానికి పువ్వులు

నాటి అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సాగిల పడ్డారు. ఒంగోలు డిపో పరిధిలో విలువైన స్థలాన్ని వైకాపా నేత చెవిరెడ్డి పుత్రరత్నం మోహిత్‌రెడ్డి కంపెనీకి కట్టబెట్టేశారు. ఈ విషయం బయటకు రాగానే తప్పులను కప్పిపుచ్చుకునే యత్నంలో నిమగ్నమయ్యారు. టెండర్ల ప్రక్రియ మొత్తం పారదర్శకంగానే సాగిందంటూ జనం చెవిలో పువ్వులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. పూర్తి కథనం

7. మార్కెట్‌ విలువల పెంపు 20-40 శాతం!

రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువ పెంపు దాదాపు 20 నుంచి 40 శాతం మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూములు, స్థలాలు, వెంచర్లు, అపార్ట్‌మెంట్లకు సంబంధించి ప్రాంతాల వారీగా ఈ నెల 18వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టిన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు విలువల సవరణపై ప్రాథమిక అంచనాలను శాఖ ప్రధాన కార్యాలయంలో అందజేశారు.పూర్తి కథనం

8. సైబర్‌ నేరస్థుల కొత్త ఎత్తుగడ.. గృహిణికి భర్త ఏడుపు వినిపించి దోపిడీ యత్నం

నగరానికి చెందిన ఓ గృహిణికి మంగళవారం సైబర్‌ నేరస్థుల నుంచి వీడియో కాల్‌ వచ్చింది. తెలిసినవారనుకొని కాల్‌ లిఫ్ట్‌ చేసింది. ఇక అంతే ఎదురుగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు.ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తాము సీబీఐ పోలీసులమని పరిచయం చేసుకున్నారు.పూర్తి కథనం

9. చంద్రబాబు, అచ్చెన్నకూ వైకాపా రంగులేశారు!

కొత్త ప్రభుత్వం వచ్చినా వ్యవసాయ, అనుబంధ శాఖల్లో వైకాపా వాసనలు పోలేదు. కొందరు అధికారులు ఇంకా రంగుల పిచ్చి నుంచి బయటపడలేకపోతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడికీ వైకాపా రంగులద్దేశారు.పూర్తి కథనం

10. కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో 78 రైళ్ల రద్దు.. 26 ఎక్స్‌ప్రెస్‌ల దారి మళ్లింపు

దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఆసిఫాబాద్‌-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. 26 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడపనున్నారు. వాటి వివరాలను ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని