Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 03 Jul 2024 20:59 IST

1. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా

తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడింది. కాంగ్రెస్‌ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోడంతో ఎంపిక ప్రక్రియను ఏఐసీసీ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై వారం రోజుల్లో మరోసారి చర్చించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. పూర్తి కథనం

2. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు పదవి శాశ్వతం కాదు: ఎమ్మెల్యే కొలికపూడి

బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. కంభంపాడులో వైకాపా నేత కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి కొంత మేర కూల్చివేయించారు. పూర్తి కథనం

3. హామీల అమలుపై కాంగ్రెస్‌ నేతల కాలయాపన: రఘునందన్‌రావు

అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ నేతలు కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. పూర్తి కథనం

4. ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత అయిదేళ్లూ ఇసుకను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం

5. అలా కూర్చొని.. ఇలా రికార్డులు నెలకొల్పి: ప్రభాస్‌పై నాగ్‌ అశ్విన్‌ పోస్ట్‌

బాక్సాఫీస్‌ వద్ద ‘కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతోంది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వాటన్నింటికీ హీరో ప్రభాస్‌ (Prabhas) కీలకమని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin)కొనియాడారు. పూర్తి కథనం

6. ‘భారతీయుడు2’లో నటించడానికి ఏకైక కారణమిదే: కమల్‌ హాసన్‌

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). వీళ్లిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన హిట్‌ సినిమా ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా రానుంది. జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ పార్ట్‌3 గురించి చూడా ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పూర్తి కథనం

7. జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?

భారత యువ జట్టు జింబాబ్వేతో ఐదు టీ20ల(ZIM vs IND) సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పుడంటే జింబాబ్వే గొప్ప ప్రదర్శన చేయడం లేదు కానీ గతంలో ‘పసికూన’గా ఉంటూనే అద్భుతాలు సృష్టించిన చరిత్ర ఉంది. అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లతో బలమైన జట్లకూ గట్టిపోటీనిచ్చేది. జింబాబ్వే-భారత్‌ ఇప్పటి వరకు మూడు ద్వైపాక్షిక సిరీసుల్లో తలపడ్డాయి.  పూర్తి కథనం

8. సీఎంఎఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక

ప్రముఖ టెక్‌ కంపెనీ నథింగ్ తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్‌ (CMF)కు సినీనటి  రష్మిక (Rashmika mandanna)ను  ప్రచారకర్తగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నథింగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రష్మికను సీఎంఎఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడం పట్ల నథింగ్‌ ఇండియా ప్రెసిడెంట్ విశాల్‌ భోలా ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి కథనం

9. వందేభారత్‌లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్‌!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సెమీహైస్పీడ్‌ వందే భారత్‌ (Vande Bharat)లోని సౌకర్యాలపై తరచూ ఫిర్యాదు వస్తున్నాయి. టిక్కెట్‌ ధర ఎక్కువైనా ప్రయాణంలో సౌకర్యాల దృష్ట్యా చాలామంది ఈ ప్రీమియం రైలునే ఎంచుకుంటున్నా.. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి కథనం

10. ఝార్ఖండ్‌ సీఎం చంపాయీ సోరెన్‌ రాజీనామా

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు అందించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు అప్పటి సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేయడంతో చంపాయీ సోరెన్‌ ఆ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని