Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 06 Jul 2024 20:59 IST

1. పునర్వినియోగం కాని వస్తువులను ప్రోత్సహించొద్దు: డిప్యూటీ సీఎం పవన్‌

వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అధికారులకు సూచించారు. వీటిపై అవగాహన కోసం గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్‌ షాప్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన పరిశీలించారు. పూర్తి కథనం

2. ‘భారతీయుడు2’లో నా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది: ఎస్‌.జె.సూర్య

‘భారతీయుడు2’లో తన పాత్ర నిడివి తక్కువే అయినా, సినిమా, ప్రేక్షకులకుపై దాని ప్రభావం ఉంటుందని నటుడు, దర్శకుడు ఎస్‌.జె.సూర్య అన్నారు. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. పూర్తి కథనం

3. రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన భారాస ఎమ్మెల్యేలు

రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబును శనివారం భారాస ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వివేకానందగౌడ, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి కలిశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  పూర్తి కథనం

4. ఇకపై ఓలా సొంత మ్యాప్స్‌

ప్రముఖ క్యాబ్ బుకింగ్‌ సేవల సంస్థ ఓలా (Ola).. గూగుల్ మ్యాప్స్ నుంచి పూర్తిగా నిష్క్రమించింది. అదే స్థానంలో తన సొంత మ్యాప్స్‌ను తీసుకొచ్చింది. అంటే ఇకపై ఓలా ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ రూపొందించిన మ్యాప్‌ వినియోగానికి అందుబాటులో రానున్నాయి. యూజర్లకు మెరుగైన ఫీచర్లు అందించడం కోసం దీన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) తెలిపారు. పూర్తి కథనం

5. 5-10 ఏళ్లలో ₹2.5 లక్షల కోట్లకు.. డీమార్ట్‌నీ అధిగమిస్తాం: జెప్టో సీఈఓ

ప్రముఖ క్విక్‌ కామర్స్ సంస్థ జెప్టో (Zepto) విస్తరణకు మరింత అవకాశం ఉందని కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ఆదిత్‌ పలిచా అన్నారు. సరిగ్గా నిర్వహిస్తే ఇప్పుడున్న రూ.10 వేల కోట్ల వ్యాపారాన్ని రాబోయే 5-10 ఏళ్లలో రూ.2.5 లక్షల కోట్లకు చేర్చగలమన్న విశ్వాసం వ్యక్తంచేశారు.  పూర్తి కథనం

6. నా భర్త రాజకీయ కుట్రలో ఇరుక్కున్నారు: సునీత కేజ్రీవాల్‌

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) సతీమణి సునీత కేజ్రీవాల్‌(Sunita Kejriwal)  శనివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ తన భర్తపై రాజకీయ కుట్ర జరుగుతోందని మరోసారి ఆరోపించారు. పూర్తి కథనం

7. కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. 15 మందికి గాయాలు!

గుజరాత్‌ (Gujarat)లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌ పట్టణంలోని సచిన్‌ పాలీ ప్రాంతంలో ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన (Surat Building Collapse)లో 15 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  పూర్తి కథనం

8. హాథ్రస్ ఘటన.. భోలేబాబాపై తొలికేసు

దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన హాథ్రస్ తొక్కిసలాట (Hathras stampede) ఘటనకు సంబంధించి భోలేబాబాపై తొలికేసు నమోదైంది. పట్నా కోర్టులో ఈ కేసు ఫైల్ అయిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పూర్తి కథనం

9. ప్రజావ్యతిరేక శక్తులకు రామోజీ ఎప్పుడూ తల వంచలేదు: మంత్రి తుమ్మల

రామోజీరావు విశ్వసనీయత, గొప్పదనం అందరికీ తెలుసని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతి క్షణం ప్రజాహితం తప్ప.. ప్రజా వ్యతిరేక శక్తులకు ఏనాడూ రామోజీ తలవంచలేని స్పష్టం చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి తుమ్మల హాజరయ్యారు. పూర్తి కథనం

10. ఆయన వ్యాఖ్యలతో నా హృదయం బరువెక్కింది: జగదీప్‌ ధన్‌ఖడ్‌

బ్రిటిష్‌ వలస పాలన నాటి నేర న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేస్తూ రూపొందించిన మూడు నేర చట్టాల (Criminal Laws)పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం (P. Chidambaram) చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపత్రి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) మండిపడ్డారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని