Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 08 Jul 2024 20:59 IST

1. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై ఆర్థికశాఖ తర్జన భర్జన పడుతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పూర్తి కథనం

2. షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణ డీఎస్సీ.. ఎలాంటి మార్పు లేదు

తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఇటీవలే టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి కథనం

3. ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఘోరం జరిగింది. కథువా (Kathua)జిల్లాలోని మాచేడి (Machedi) ప్రాంతంలో ఇండియన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాచేడి- కిండ్లీ- మల్హార్‌ రోడ్డు మార్గంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి కథనం

4. అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్‌ రెండు భాగాలు: శంకర్‌

కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో 1996లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’ (Bharateeyudu). దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) ఈ నెల 12న విడుదల కానుంది. పూర్తి కథనం

5. అధిక వడ్డీ ఆశ జూపి భారీ మోసం.. రూ.514 కోట్ల డిపాజిట్లు సేకరణ

అధిక వడ్డీ ఆశ జూపి ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ ఫౌండేషన్ ఛైర్మన్‌ కమలాకర్ శర్మ బాధితుల నుంచి రూ.కోట్లలో వసూలు చేశారు. పెట్టుబడులు పెట్టిన కొందరికి ఫ్లాట్లను ఇస్తామని చెప్పి మోసం చేశారు. పూర్తి కథనం

6. మాల్దీవుల్లో సంబరాలు చేసుకోండి.. భారత క్రికెట్‌ జట్టుకు ఆహ్వానం

భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవుల (Maldives)కు ఇక్కడి నుంచి పర్యటకం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో కుదేలైన అక్కడి పర్యటక సంస్థలు.. భారతీయులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే ఇటీవల టీ20 ప్రపంచకప్‌ సాధించిన భారత క్రికెట్‌ జట్టు (Indian Cricket Team)ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి. పూర్తి కథనం

7. నీట్‌-యూజీ పేపర్‌ లీకైన మాట వాస్తవమే: సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్‌ యూజీ 2024 (NEET UG 2024) పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్‌ లీకైన (NEET Row) మాట వాస్తవమేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇది 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం అయినందున.. ‘నీట్ రీటెస్ట్‌’ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని వెల్లడించింది.  పూర్తి కథనం

8. బ్యాంకుల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఇదే సరైన సమయం: ఎస్‌బీఐ నివేదిక

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఇదే సరైన సమయమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకులన్నీ మంచి స్థితిలో ఉన్న వేళ ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, పెట్టుబడుల ఉపసంహరణకు ఇది అనుకూలమని తెలిపింది. పూర్తి కథనం

9. ‘హిమాచల్‌’లో 76 రహదారులు మూసివేత.. 3 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక!

 హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి.  పలుచోట్ల భారీ వర్షాల నేపథ్యంలో 76 రహదారులను మూసివేశారు. వీటిలో 52 రహదారులు మండీలో ఉండగా.. 13 సిర్‌మౌర్‌, 6 శిమ్లాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, శిమ్లా, కంగ్రా, చంబా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి కథనం

10. విమానంలో ఘర్షణకు దిగిన ప్రయాణికులు.. అత్యవసర ల్యాండింగ్‌

విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ నెలకొనడంతో టేకాఫ్‌ అయిన అరగంటకే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం ర్యాన్‌ఎయిర్(Ryanair) విమానం బుధవారం మొరాకోలోని అగాదిర్‌ నుంచి లండన్‌(London)కు బయల్దేరింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని