Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...   

Updated : 15 Jun 2024 20:59 IST

1.తెలంగాణ వైద్యారోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్ణయం

వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 531 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయడానికి  ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. పూర్తి కథనం

2.రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని విమాన సర్వీసులు: ఎంపీ బాలశౌరి

 రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని నూతన విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ అన్నారు. విజయవాడ - ముంబయి విమాన సర్వీసు ప్రారంభోత్సవానికి వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడారు. పూర్తి కథనం

3.‘పుష్ప2’ రిలీజ్ డేట్‌కు రామ్ సినిమా.. అధికారికంగా ప్రకటించిన టీమ్‌

ఒక హీరో సినిమాకు లాక్ అయిన తేదీకి మరొకరి మూవీ రావడం సహజమే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆగస్టు 15వ తేదీ విడుదల కోసం సినిమాలు పోటీపడుతున్నట్లు కనిపిస్తుంది. సుకుమార్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తోన్న చిత్రం ‘పుష్ప2’. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి కథనం

4.కళ్లల్లో కారం కొట్టి.. కర్రలతో దాడి చేసి.. ప్రొఫెసర్‌పై విద్యార్థుల దుశ్చర్య

ప్రొఫెసర్‌(Professor)పై విద్యార్థులు కారం చల్లి, కర్రలతో దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌(Madhya pradesh) లోని ప్రభుత్వ జేహెచ్ పీజీ కళాశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం సాయంత్రం ఏడుగురు విద్యార్థుల గుంపు కారం పొడి, కర్రలతో కళాశాలలోకి వచ్చారు. పూర్తి కథనం

5. రుణ రేట్లను సవరించిన SBI

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఎంపిక చేసిన కాలవ్యవధులకు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్ ఫండింగ్ లెండింగ్ రేటు  (MCLR)ను 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం ఓవర్‌నైట్‌ MCLR ఇప్పుడు 8% నుంచి 8.10%కు చేరుకుంది. ఒక సంవత్సరం MCLR.. 8.65% నుంచి 8.75%కు పెరిగింది. ఈ పెరిగిన MCLR రేట్లు 2024 జూన్‌ 15 నుంచి వర్తిస్తాయి. పూర్తి కథనం

6. 56 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం.. సంతోషంలో మస్క్ డ్యాన్స్‌

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్ (Elon Musk)కు 56 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సాధారణ వార్షిక సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడటంతో.. ఆయన సంపద భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. దీనితర్వాత మస్క్‌ సంతోషంతో డ్యాన్స్ చేస్తోన్న వీడియో ఎక్స్‌లో వైరల్‌ అయింది. పూర్తి కథనం

7. భాజపాదీ ‘రిక్షా’ పరిస్థితే.. అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది: ఉద్ధవ్‌ ఠాక్రే

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శివసేన (యూబీటీ) నేతల ఫిరాయింపులు, ఎన్సీపీలో చీలికలు ఏర్పడినా.. అధికార కూటమితో పోలిస్తే మహా వికాస్‌ అఘాడి (ఎంవీయే) లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కూటమి కసరత్తు ప్రారంభించింది. పూర్తి కథనం

8. మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్యూ మోదీజీ: శరద్ పవార్

రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఎక్కడెక్కడ రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించారో ఆ స్థానాల్లో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) విజయకేతనం ఎగురవేసిందని ఎన్సీపీ (ఎస్‌సీపీ) నేత శరద్ పవార్(Sharad Pawar) అన్నారు.  పూర్తి కథనం

9. ఫ్రాన్స్‌ అధ్యక్షుడి వైపు మెలోనీ సీరియస్‌ లుక్‌ : వీడియో వైరల్‌

జీ7(G7) సమావేశాల్లో భాగంగా ఇటలీ ప్రపంచస్థాయి నేతలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈసందర్భంగా జరిగిన డిన్నర్‌లో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron ), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) పొడిపొడిగా పలకరించుకున్నారు. ఆ సమయంలో ఆమె మెక్రాన్‌ను సీరియస్‌గా చూసిన చూపు వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిదంటే..? పూర్తి కథనం

10. పుణె కారు ప్రమాదం.. మైనర్‌కు బెయిల్‌ మంజూరులో లోపాలు!

మహారాష్ట్రలోని పుణెలో నిర్లక్ష్య డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగుల మృతికి కారణమైన బాలుడికి (17) జువనైల్‌ జస్టిస్‌ బోర్డు (JJB).. 15 గంటల్లోనే బెయిల్‌ మంజూరుచేయడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. 300 పదాల్లో ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలంటూ విధించిన బెయిల్ షరతులు చర్చనీయాంశమయ్యాయి. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని