Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 17 Jun 2024 20:59 IST

1.కేంద్రమంత్రి అయినా నా స్వభావం మారదు: రామ్మోహన్‌నాయుడు

కేంద్రమంత్రి పదవిని అలంకరించినా తన స్వభావంలో ఎలాంటి మార్పు ఉండబోదని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. మోదీ క్యాబినెట్‌లో కేంద్రమంత్రిగా రామ్మోహన్‌నాయుడు, చంద్రబాబు మంత్రివర్గంలో అచ్చెన్నాయుడుకు చోటు దక్కిన నేపథ్యంలో శ్రీకాకుళంలో వారికి ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు.  పూర్తి కథనం

2.24 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఇవి జరగనున్నాయి. పూర్తి కథనం

3. ఏపీలో తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు

తెలుగుదేశం ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. గతంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఏడాదిగా పేదలకు కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి కథనం

4. ఈసారి ఖైరతాబాద్‌ మహా గణపతి ఎత్తు ఎంతంటే..?

ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కర్రపూజ నిర్వహించారు. ఈసారి 70 అడుగుల వినాయకుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తెలిపారు. కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  పూర్తి కథనం

5. ‘రమీజ్‌ రజా ఫిట్‌గా ఉన్నాడు.. కెప్టెన్‌ చేయండి’.. మంజ్రేకర్‌ చమత్కారం

టీ20 ప్రపంచకప్‌ 2024 (T20 World Cup 2024)లో పాకిస్థాన్‌ పేలవ ప్రదర్శన చేసింది. టీమ్‌ఇండియా చేతిలో కంగుతిన్న పాక్‌.. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న అమెరికా చేతిలోనూ ఓడింది. ఫలితంగా కనీసం సూపర్‌-8కు చేరకుండా లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లపై సొంత దేశానికి చెందిన మాజీలతోపాటు ఇతర దేశాల క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.  పూర్తి కథనం

6. రోహిత్ కోచ్‌ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నా.. నా కెరీర్‌ను మార్చింది ఆయనే: హర్మిత్‌ సింగ్

టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) వంటి మెగా టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన యూఎస్‌ఏ (USA Cricket Team) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. భారత్‌పై ఓడినప్పటికీ పాకిస్థాన్‌, కెనడాను చిత్తు చేసిన యూఎస్‌ఏ ‘సూపర్‌-8’కి దూసుకొచ్చింది. ఆ జట్టులో కెప్టెన్ మోనాంక్‌ పటేల్‌, సౌరభ్‌ నేత్రావల్కర్, హర్మిత్‌ సింగ్, నితీశ్ కుమార్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పూర్తి కథనం

7. సోదరుడి వివాహానికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన కంగన..ఏంటంటే?

 తన కజిన్ సోదరుడు వరుణ్ రనౌత్‌(Varun Ranaut) వివాహానికి హాజరైన బాలీవుడ్‌ నటి, మండి ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) అతడికి ఓ ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించి వరుణ్ రనౌత్‌ కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన పోస్టులను కంగనా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. పూర్తి కథనం

8. ‘ఉష్ణోగ్రత’ సెగ.. రెండు గంటలు నిలిచిపోయిన విమానం

వేసవి కాలం ముగిసినా ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గటం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇండిగో (IndiGo) విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలిగింది. గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి కథనం

9. రీల్స్ చేయడంలో రైల్వే మంత్రి బిజీ: కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని దార్జీలింగ్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం(Train Collision)పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి కథనం

10. ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్‌.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి!

దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చిన వేళ.. ఉత్తర కొరియా మీడియా కీలక ప్రకటన చేసింది. దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆహ్వానం మేరకు జూన్‌ 18- 19వ తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) ఉత్తర కొరియా (North Korea)లో పర్యటించనున్నట్లు తెలిపింది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు