Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Jun 2024 21:02 IST

1.నాటు సారా దుమారం.. స్టాలిన్‌ రాజీనామా చేయాల్సిందే: ఏఐఏడీఎంకే

తమిళనాడులో (TamilNadu) నాటు సారా తాగి 37 మంది మృతి చెందిన ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ విషాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ (MK Stalin) రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఏఐఏడీంకే డిమాండ్‌ చేస్తోంది. ఈ దారుణం వెనక డీఎంకే కార్యకర్తల హస్తం ఉందని మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి ఆరోపించారు. పూర్తి కథనం

2.తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించం.. ‘నీట్‌’ వ్యవహారంపై ధర్మేంద్ర ప్రధాన్‌

వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ పరీక్ష (NEET 2024) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరణ ఇచ్చారు. ఈ పరీక్షలో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకు మాత్రమే పరిమితమని, ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదన్నారు.  పూర్తి కథనం

3.విజయవాడ విమానాశ్రయం భద్రత సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలోకి

గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయం భద్రతను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) తీసుకుంటుందని ఎయిర్‌పోర్టు అథారిటీ.. డీజీపీకి లేఖ రాసింది. జులై 2 నుంచి సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది. పూర్తి కథనం

4.‘మీ పని మీరుచూసుకోండి.. నేను నా కుమార్తె పెళ్లికి వెళ్తా’: శతృఘ్న సిన్హా

ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నటుడు జహీర్ ఇక్బాల్‌తో ఆమె వివాహం బంధంలో అడుగుపెట్టనున్నారు. కుమార్తె వివాహానికి హాజరవుతానని నటుడు శతృఘ్నసిన్హా (Shatrughan Sinha) వెల్లడించారు. పూర్తి కథనం

5.బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లు.. షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

2024-25 మధ్య టీమ్‌ఇండియా సీనియర్‌ పురుషుల జట్టు స్వదేశంలో ఆడే సిరీస్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ ప్రకటించింది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో భారత జట్టు పలు సిరీస్‌ల్లో తలపడనుంది. సెప్టెంబరులో బంగ్లాదేశ్‌ జట్టు.. భారత పర్యటనకు రానుంది. పూర్తి కథనం

6.ఆమోదించలేని రిస్క్‌లతో వృద్ధి ఎప్పటికీ రాదు: బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్‌ చురక

బ్యాంకులు లాభాల కోసం రిస్క్‌లు తీసుకోవడం మానుకోవాలని ఆర్‌బీఐ (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ హితవు పలికారు. కాలేజ్‌ ఆఫ్‌ సూపర్‌వైజర్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులు లాభాల కోసం కొన్ని రకాల రిస్కలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి చర్యలతో లాభాలు ఏమాత్రం రావని అభిప్రాయపడ్డారు. పూర్తి కథనం

7.ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో రియల్‌మీ కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లు ఇవే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ తన GT సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. రియల్‌మీ జీటీ6 (Realme GT 6) పేరిట దీన్ని తీసుకొచ్చింది. అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఉన్న ఈ ఫోన్‌లో 4ఎన్‌ఎమ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌ను అమర్చారు.   పూర్తి కథనం

8.ఐటీ స్టార్టప్స్‌లో దూసుకుపోతున్న భారత్‌

ఐటీ స్టార్టప్‌ల రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఆరో స్థానంలో ఉన్నట్లు ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ వెల్లడించింది. భారత్‌లో అధికారికంగా 3,600 అంకుర సంస్థలుండగా.. వాటి ద్వారా గత ఏడాది 850 మిలియన్‌ డాలర్లు ఆర్జించినట్లు తెలిపింది. ఈమేరకు గురువారం ఓ నివేదిక విడుదల చేసింది.  పూర్తి కథనం

9.వందేభారత్‌ భోజనంలో బొద్దింక.. రైల్వేశాఖ ఏమందంటే..?

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన (Chenab Rail Bridge)పై తొలిసారిగా ఓ పూర్తిస్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై రైలు ట్రయల్‌ రన్‌ (Train Trail Run)ను గురువారం విజయవంతంగా నిర్వహించారు. పూర్తి కథనం

10.చీనాబ్‌ బ్రిడ్జ్‌పై రైలు పరుగులు.. ట్రయల్‌ రన్‌ వీడియో చూశారా..?

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన (Chenab Rail Bridge)పై తొలిసారిగా ఓ పూర్తిస్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై రైలు ట్రయల్‌ రన్‌ (Train Trail Run)ను గురువారం విజయవంతంగా నిర్వహించారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని