Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jun 2024 21:10 IST

1.స్పీకర్‌ స్థానంలో అయ్యన్న.. శనివారం సభకు రాకూడదని జగన్‌ నిర్ణయం

ఏపీ శాసనసభ స్పీకర్‌గా నర్సీపట్నం ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభకు రాకూడదని వైకాపా నిర్ణయించింది. పూర్తి కథనం

2.జగన్‌ వ్యాఖ్యలపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైర్‌

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్‌ డిజిట్‌ వస్తుందని వైకాపా నేతల సమావేశంలో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. గడిచిన ఐదేళ్లలో జగన్‌ రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, దీన్ని సహించలేక ప్రజలు తగిన తీర్పు ఇచ్చారన్నారు. జగన్‌ చేసిన అరాచక పాలనకు ఫలితాన్ని త్వరలో అనుభవించి తీరుతారన్నారు.  పూర్తి కథనం

3.ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవి కోసం ఒకే ఒక నామినేషన్‌ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. తెదేపాలో సీనియర్‌ నేతగా కొనసాగుతున్న అయ్యన్న.. కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్‌.  పూర్తి కథనం

4.బాపట్ల జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

స్నేహితులతో సరదాగా తీరంలో గడిపేందుకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా.. మరొకరు గల్లంతైన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీరంలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు యువకులు సరదాగా గడిపేందుకు రామాపురం సముద్ర తీరానికి చేరుకున్నారు.పూర్తి కథనం

5.మొదలైన యాపిల్‌ స్కూల్‌ సేల్‌.. ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌, ఐమ్యాక్‌పై డిస్కౌంట్లు

ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ స్కూల్‌ సేల్‌ (Apple School Sale) ప్రారంభమైంది. ఇందులో ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌, ఐ మ్యాక్‌పై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ అందిస్తోంది. నిర్దిష్ట కొనుగోళ్లు చేసిన వారికి ఎయిర్‌పాడ్స్‌, యాపిల్‌ పెన్సిల్‌ ఉచితంగా ఇస్తోంది. విద్యార్ధులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన సేల్‌ సెప్టెంబర్‌ 20 వరకు అందుబాటులో ఉంటుంది. పూర్తి కథనం

6.కెనడా పార్లమెంట్‌లో నిజ్జర్‌కు సంతాపం.. స్పందించిన భారత్‌

భారత్‌తో కొనసాగుతోన్న దౌత్యపరమైన విభేదాలకు ఇటీవల కెనడా మరింత ఆజ్యం పోసిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar)కు పార్లమెంట్‌ వేదికగా సంతాపం ప్రకటించింది. పూర్తి కథనం

7.రాజ్యసభా పక్ష నేతగా జేపీ నడ్డా?

కేంద్రమంత్రి జేపీ నడ్డా(JP Nadda) రాజ్యసభా పక్షనేత(Leader Of House In Rajya Sabha)గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం నడ్డా భాజపా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుండడంతో.. ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని అధిష్ఠానం కోరినట్లుగా సమాచారం.  పూర్తి కథనం

8.పదేళ్లుగా పట్టించుకోలేదు.. గెలిచిన వెంటనే నోటీసులు: యూసుఫ్‌ పఠాన్‌

భూఆక్రమణ కేసులో తనకు అందిన నోటీసులపై మాజీ క్రికెటర్, తృణమూల్ ఎంపీ యూసుఫ్‌ పఠాన్ (Yusuf Pathan) గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. వడోదర మున్సిపల్‌ కార్పొరేషన్‌(VMC)కు చెందిన స్థలంలోని అక్రమ కట్టడాలను 15 రోజుల్లోగా తొలగించాలంటూ ఆ సంస్థ జూన్‌ 6న  పఠాన్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి కథనం

9.నా ఆరోగ్య రహస్యం అదే.. బిల్‌గేట్స్‌ చెప్పిన హెల్త్‌ టిప్స్‌..

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటానని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) అన్నారు. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటానని అదే తన ఆరోగ్య రహస్యమని చెప్పారు. పూర్తి కథనం

10.పని ఇవ్వకుండా 20ఏళ్లుగా జీతం.. కంపెనీపై దావా వేసిన మహిళ..

 ఫ్రాన్స్‌ టెలికాం సంస్థ ఆరెంజ్‌పై ఓ మహిళా ఉద్యోగి దావా వేసింది. 20 ఏళ్లుగా తనకు ఎలాంటి పని అప్పజెప్పట్లేదని పేర్కొంది. అయితే.. జీతం మాత్రం ఇస్తున్నారని తెలిపింది. తన అనారోగ్య పరిస్థితిపై వేధింపులు, చూపుతున్న వివక్ష కారణంగా కంపెనీపై ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త వెబ్‌సైట్‌ వెల్లడించింది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు