Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Jun 2024 21:02 IST

1. చీనాబ్‌ రైల్వే బ్రిడ్జ్‌.. మీకివి తెలుసా?

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌ - శ్రీనగర్‌ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. పూర్తి కథనం

2. సింగరేణి విషయంలో కేంద్రాన్ని విమర్శిస్తే సహించేది లేదు: కిషన్‌రెడ్డి

కేంద్రమంత్రిగా సింగరేణికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటా. సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత 49 శాతం వాటా ఉన్న కేంద్రంపై కూడా ఉంది. పూర్తి కథనం

3. తెలంగాణావ్యాప్తంగా.. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో యోగాభ్యాసం

అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) పురస్కరించుకుని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ (Art of living)’ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణావ్యాప్తంగా 100కుపైగా ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 60 వేలమంది యోగా సాధకులు, ఔత్సాహికులు ఇందులో భాగమై.. రాష్ట్ర ప్రజలకు యోగాభ్యాసం, శారీరక, మానసిక ఆరోగ్యంపై ఉన్న మక్కువను చాటిచెప్పారు. పూర్తి కథనం

4. నవదీప్‌ బోల్డ్‌ మూవీ ‘లవ్‌ మౌళి’.. ఓటీటీలో ఎప్పుడంటే?

నవదీప్‌ (Navdeep) కథానాయకుడిగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌ రొమాంటిక్‌ మూవీ ‘లవ్‌ మౌళి’ (Love Mouli). ఫంకూరీ గిద్వానీ (Pankhuri Gidwani) కథానాయిక. ప్రేమ అనేది లేకుండా ప్రపంచంలో మనుషులకు దూరంగా బతుకుతున్న వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది.. ఆ సమయంలో ప్రేమించే వ్యక్తి దొరికితే మనిషి ఎలా మారతాడు? అన్న కాన్సెప్ట్‌తో ‘లవ్‌ మౌళి’ని రూపొందించారు. పూర్తి కథనం

5. నా దృష్టిలో అతడు ప్రపంచంలోనే బెస్ట్‌ బౌలర్: సూర్య

ఓవైపు ప్రపంచమంతా టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తేస్తున్నారు. కానీ, టీ20 టాప్ ర్యాంకర్ సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం అత్యుత్తమ బౌలర్‌గా మరొకరి పేరును చెప్పడం గమనార్హం. పూర్తి కథనం

6. చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు: నిర్మలా సీతారామన్

చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కౌన్సిల్‌ సమావేశం ముగిసిన తర్వాత దిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం

7. నీట్‌-యూజీ 2024.. రద్దు చేయకపోవడానికి కారణం అదే: విద్యాశాఖ మంత్రి

వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ2024 ప్రవేశపరీక్ష (NEET UG-2024)’ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. పరీక్షకు ముందు రోజే పేపర్‌ లీకైందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  పూర్తి కథనం

8. 1985 విమాన పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది: కెనడా

ఇండియా కెనడా (Canada) మధ్య దౌత్య వివాదాలు కొనసాగుతున్న వేళ కెనడా దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నో ఫ్లై జాబితా నుంచి తొలగించాలంటూ ఇద్దరు ఖలిస్థానీ వేర్పాటువాదులు చేసిన అభ్యర్థనను ఫెడరల్ కోర్టు ఆఫ్ అప్పీల్‌ తిరస్కరించింది. పూర్తి కథనం

9. CNG రేట్లను స్వల్పంగా పెంచిన కేంద్రం.. ఇవాళ్టి నుంచే అమలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోవడంతో చాలా మంది కంప్రెస్‌డ్‌ నేచురల్ గ్యాస్‌ (CNG)తో నడిచే వాహనాలవైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో వీటి వాడకం కూడా ఎక్కువైంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేజీ సీఎన్‌జీపై రూ.1 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి కథనం

10. యూట్యూబ్‌లో చూసి.. పెళ్లయిన 3 నెలలకే భార్యను హతమార్చిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌

కట్టుకున్న భార్యపై అనుమానంతో పెళ్లయిన మూడు నెలలకే పథకం ప్రకారం హతమార్చి.. ఆ నేరం మరొకరిపై మోపేందుకు ప్రయత్నించిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం మీడియాకు వెల్లడించారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని