Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 26 Jun 2024 21:00 IST

1.మా పార్టీ కార్యాలయాలు కూల్చేయబోతున్నారు: హైకోర్టులో వైకాపా పిటిషన్‌

రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేయబోతున్నారంటూ ఏపీ హైకోర్టులో వైకాపా నేతలు లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్ధమైందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. పూర్తి కథనం

2. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్‌-2 పంపుహౌజ్‌ మరమ్మతుల కారణంగా కొన్ని చోట్ల పూర్తిగా, మరి కొన్ని చోట్ల పాక్షికంగా నీటి సరఫరా నిలిపివేయనున్నట్టు జల మండలి అధికారులు వెల్లడించారు.  పూర్తి కథనం

3. తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు

తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమణకు అంగీకరించారు. ఎనిమిది డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. పూర్తి కథనం

4. వైద్యుడు సహా కుమార్తెకు జికా వైరస్‌

మహారాష్ట్రలో జికా వైరస్‌ కలకలం రేపింది. పుణెకు చెందిన ఓ వైద్యుడు సహా ఆయన కుమార్తెకు ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. అయితే, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి కథనం

5. ప్రపంచ రికార్డు.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు!

43 రన్స్‌.. ఒక ఇన్నింగ్స్‌లో బ్యాటర్‌ చేసిన స్కోరు కాదు ఇది. కేవలం ఒకే ఓవర్‌లో సాధించిన పరుగులు. ఇది ప్రపంచ రికార్డు కూడా. లీసెస్టర్‌షైర్‌, సస్సెక్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఇలా ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చి ఇంగ్లాండ్‌ బౌలర్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పూర్తి కథనం

6. ఇంగ్లాండ్‌తో సెమీస్‌.. మన బౌలింగ్‌కు ఎదురుందా..?

టీమ్‌ఇండియా పొట్టి ప్రపంచకప్‌ విజేతగా నిలవడానికి మరో రెండడుగుల దూరంలోనే ఉంది. ఈసారి కప్‌ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని పట్టుదలగా ఉంది. వరుస విజయాలతో సెమీస్‌కు చేరిన టీమ్‌ఇండియానే పేవరెట్‌గా కనిపిస్తోంది. అన్ని విభాగాల్లో రాణిస్తోంది. ఇక మన బౌలింగ్‌ విభాగం గురించి ఎంత చెప్పినా తక్కువే.  పూర్తి కథనం

7. జమ్మూకశ్మీర్‌లో కాల్పులు .. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. డోడా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.  పూర్తి కథనం

8. జీరో FIR, ఆన్‌లైన్‌ ఫిర్యాదులు.. జులై 1 నుంచే కొత్త చట్టాలు!

బ్రిటిష్‌ వలస పాలన నాటి చట్టాల స్థానంలో ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నేర న్యాయ చట్టాలు (New Criminal Laws) జులై 1నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR), ఆన్‌లైన్‌లోనే పోలీసు ఫిర్యాదు (Online police complaints), ఎలక్ట్రానిక్‌ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటివి కీలక అంశాలు ఇందులో ఉండనున్నాయి. పూర్తి కథనం

9. ప్రజ్వల్‌కు దక్కని ఊరట..బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో అరెస్టయిన హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బెంగుళూరులోని కోర్టు బుధవారం అతడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. పూర్తి కథనం

10. సిసోదియా పేరు నేను చెప్పలేదు.. కోర్టులో వాదనలు వినిపించిన కేజ్రీవాల్‌

దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం (Delhi Excise Scam Case) వ్యవహారంలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈడీ కేసులో బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను నేడు సీబీఐ అరెస్టు చేసింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని