Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Jul 2024 13:12 IST

1. శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్‌ రెడ్డి

తిరుమల: ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను వైకాపా ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, ఇంజినీరింగ్ పనులంటిన్నింటిలోనూ అవినీతి చేశారని విమర్శించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం

2. హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్‌ గాంధీ

హాథ్రస్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హాథ్రస్‌లో భోలే బాబా (Bhole Baba) సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.పూర్తి కథనం

3. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. మరో కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అఠావలెతోనూ ఆయన భేటీ కానున్నారు.పూర్తి కథనం

4. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన.. పలువురి అరెస్టు

హైదరాబాద్‌: టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. రహదారిపై బైఠాయించి నేతలు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్‌వీ నేత గెల్లు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన వీరు.. ప్రధానంగా మూడు డిమాండ్లు చేస్తున్నారు. పూర్తి కథనం

5. నిద్ర సరిపోవట్లేదు.. రాత్రి 8 తర్వాత రాలేను: బైడెన్

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు నిర్విరామంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 81 ఏళ్ల అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ ప్రచారపర్వంతో అలసిపోతున్నారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు. పూర్తి కథనం

6. అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం

దిల్లీ: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీలందరి సమక్షంలో ఈ చెక్కును అందజేశారు. దీంతో ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు.పూర్తి కథనం

7. పెద్ద అంబర్‌పేట సమీపంలో పోలీసుల కాల్పులు

హైదరాబాద్‌: దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్‌ శివారు పెద్ద అంబర్‌పేట సమీపంలో ఔటర్‌ రింగురోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి కథనం

8. ‘అదానీ’పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్‌ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!

అదానీ గ్రూప్‌, హిండెన్‌బర్గ్‌ వివాదంపై (Adani Hindenburg Row) ప్రముఖ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనక చైనా వర్గాల హస్తం ఉందని ఆరోపించారు. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మార్క్‌ కింగ్‌డన్‌.. అదానీ గ్రూప్‌పై (Adani Group) నివేదికను సిద్ధం చేసేందుకు హిండెన్‌బర్గ్‌ను నియమించుకున్నారని తెలిపారు.పూర్తి కథనం

9. నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్‌మెంట్‌పై బుమ్రా స్పందన ఇదే..

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ఫార్మాట్‌ (T20 Format) నుంచి స్టార్‌ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికేశారు. పొట్టి కప్‌ను (T20 World Cup 2024) సొంతం చేసుకున్నాక వీరంతా తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో బుమ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.పూర్తి కథనం

10. యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో (UK Parliament Elections) లేబర్‌ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీని గద్దెదించి.. 14 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకుంది. అయితే, ఈ ఎన్నికల బరిలో నిలిచిన పలువురు భారత సంతతి అభ్యర్థులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని