Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jul 2024 13:13 IST

1. గుంతకల్లు రైల్వే DRM ఆఫీస్‌లో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది

గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం వివిధ విభాగాల్లో సీబీఐ సోదాలు చేసింది. రైల్వే డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌ నివాసంలో తనిఖీలు పూర్తయ్యాయి. అక్కడ భారీగా బంగారం, నగదు పట్టుబడింది. 8 మంది సిబ్బందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి కథనం

2. నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ వాయిదా..

దిల్లీ: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ 2024 పరీక్షలో అక్రమాల (NEET Row) వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు కౌన్సెలింగ్‌ (NEET UG counselling)ను వాయిదా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి.పూర్తి కథనం

3. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ సంతకం ఫోర్జరీ.. మేయర్‌ భర్తపై కేసు

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్‌ సంతకం ఫోర్జరీపై క్రిమినల్‌ కేసు నమోదైంది. కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌తో పాటు మాజీ కమిషనర్‌ హరిత సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనపై కేసులు నమోదు చేశారు. కమిషనర్‌ సంతకం ఫోర్జరీ కేసులో గత పది రోజులుగా విచారణ కొనసాగింది.పూర్తి కథనం

4. కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు

గుడివాడ: ఏపీ బెవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్‌ మాధవీలతారెడ్డిపై కేసు నమోదు చేశారు. పూర్తి కథనం

5. ‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్‌ సెటైర్‌

దిల్లీ: భారతీయ జనతా పార్టీ(BJP)ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్(Shashi Tharoor) చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 370కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 400లకు పైగా సీట్లు సాధిస్తుందని ప్రధాని మోదీ(PM Modi) తన ప్రచారాల్లో తరచుగా చెప్పేవారు.పూర్తి కథనం

6. భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్‌ఎంసీ మేయర్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్‌ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నిరసన తెలిపారు. దీంతో భారాస కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి కథనం

7. హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన హాథ్రస్‌ తొక్కిసలాట (Hathras stampede) ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. దాంతో ‘భోలే బాబా’(Bhole Baba) పేరు దేశమంతా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.పూర్తి కథనం

8. సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్‌ కొత్త అధ్యక్షుడిగా మసౌద్‌ పెజెష్కియాన్‌..!

ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఇరాన్‌లో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో మసౌద్‌ పెజెష్కియాన్‌ (Masoud Pezeshkian) విజయం సాధించారు. పిడివాదిగా పేరుపొందిన సయీద్‌ జలిలితో పోటీపడి గెలుపొందారని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది.పూర్తి కథనం

9. ఓపెనర్‌గా రావాలనుకుంటున్నా.. రోహిత్‌, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్‌మన్‌ గిల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రపంచకప్‌ పోరులో వీరిద్దరూ ఓపెనింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు స్టార్లను రీప్లేస్ చేసే బ్యాటర్లు ఎవరు అనే చర్చ మొదలైంది. పూర్తి కథనం

10. మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్య శిక్షణ: ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం: గత ఐదేళ్లలో నైపుణ్య శిక్షణపరంగా రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయనగరంలోని టీటీడీసీ శిక్షణా కేంద్రం, జిల్లా సమాఖ్య కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. యువతీయువకులు ఉద్యోగాలు పొందిన తీరు, ఉపాధి అవకాశాలు కల్పించిన సంస్థల గురించి ఆరా తీశారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని