Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 08 Jul 2024 13:01 IST

1. దొంగను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యం తొలగించినట్లవుతుంది: అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం: నియోజకవర్గంలోని గబ్బడ ఇసుక డిపోలో అక్రమ నిల్వలపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సమగ్ర విచారణకు ఆదేశించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 65 వేల టన్నుల ఇసుకపై విచారణ చేపట్టాలన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని తెలిపారు. వందల కోట్లు దోచుకున్న ఇసుక మాఫియాను బయటపెట్టాలన్నారు. పూర్తి కథనం

2. తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15నే ఇందుకు సంబంధించి జీవో విడుదలైంది. అయితే, ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఆపి ఈరోజు తిరిగి విడుదల చేశారు. రెండు రోజుల్లో కార్పొరేషన్‌ ఛైర్మన్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. 35 మంది ఛైర్మన్లను నియమిస్తూ జీవో విడుదల చేశారు. పూర్తి కథనం

3. కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ నివాళులర్పించారు. వైఎస్‌ఆర్‌ 75వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.పూర్తి కథనం

4. భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 27 విమానాల దారి మళ్లింపు..!

ముంబయిలో భారీ వర్షాల ప్రభావం ఎయిర్‌ పోర్టు (Mumbai Airport)పై తీవ్రంగా ఉంది. కొద్దిసేపు రన్‌వే కార్యకలాపాలను సస్పెండ్‌ చేయగా.. మొత్తం 27 విమానాలను దారి మళ్లించారు. ఇవి హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ఇండోర్‌ వంటి ప్రాంతాల్లో ల్యాండ్‌ అయ్యాయి.పూర్తి కథనం

5. మహిళపై కారుతో దూసుకెళ్లి.. గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో నక్కి: శివసేన యువనేతపై లుక్‌ఔట్‌ నోటీసు

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శివసేన (Shiv Sena) నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన (Mumbai Hit and Run case) తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.పూర్తి కథనం

6. ఆ స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: రష్యా పర్యటనకు బయల్దేరిన మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈసందర్భంగా ఇద్దరు నేతలు 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈసందర్భంగా పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రష్యాతో పాటు ప్రధాని ఆస్ట్రియాకు వెళ్తారుపూర్తి కథనం

7. అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో రాహుల్‌ పర్యటన

అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం ఉదయం పర్యటించారు. ఆయన కచార్‌ జిల్లాలో సిల్చార్‌ను సందర్శించారు. ఎయిర్‌పోర్టులో అస్సాం, మణిపుర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆయన్ను కలిశారు. ఇక్కడ ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను రాహుల్‌ సందర్శించారు.పూర్తి కథనం

8. బలపడుతున్న బైడెన్‌పై వ్యతిరేకత.. కమలా హ్యారిస్‌కు పెరుగుతున్న మద్దతు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై పోటీ నుంచి డెమోక్రాటిక్‌ పార్టీ నామినీ జో బైడెన్ (Joe Biden) వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకీ బలపడుతున్నాయి. తాజాగా సొంత పార్టీలోని కీలక ప్రతినిధులే ఆయన వైదొలగాలని పట్టుబడుతున్నారు. ప్రతినిధుల సభలోని మైనారిటీ నేత హకీం జెఫరీస్‌ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో చాలా మంది బైడెన్‌ (Biden) నిష్క్రమించాలని అభిప్రాయపడ్డట్లు సమాచారం.పూర్తి కథనం

9. టీమ్‌ఇండియాకు రూ. 125 కోట్ల నజరానా.. ఎవరికి ఎంతంటే?

టీమ్ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ సాధించడంతో బీసీసీఐ (BCCI) రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన చెక్కును బీసీసీఐ అందజేసింది. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, రిజర్వ్‌ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మొత్తం 42 మంది అమెరికా, వెస్టిండీస్ వెళ్లారు. పూర్తి కథనం

10. కొన్ని జిల్లాల్లో ఇసుక సరఫరాను ప్రారంభించిన మంత్రులు

అమరావతి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో స్టాక్‌ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు మొదలుపెట్టారు. ప్రస్తుతం వేర్వేరు స్టాక్‌ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వలున్నాయి.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని