Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 11 Jul 2024 13:03 IST

1. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఆందోళన చెందొద్దు: కేంద్రమంత్రి కుమారస్వామి

విశాఖ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన.. గురువారం స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు.  విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. పూర్తి కథనం

2. గత ఐదేళ్ల విధ్వంసంతో పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు: సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ పునర్నిర్మాణం కోసం ఓ లక్ష్యంతో పని చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. ‘‘గత ప్రభుత్వం నిర్వాకాలు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారాయి. రాష్ట్ర పునర్నిర్మాణ మిషన్‌లో అందరి మద్దతు అవసరం. పౌరులకు సమాచారం అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోంది.పూర్తి కథనం

3. ఏపీలో గత పాలకులు వీరప్పన్‌ వారసులు: కేంద్రమంత్రి బండి సంజయ్‌

తిరుమల: శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.పూర్తి కథనం

4. ఎక్కడికీ పారిపోను.. కోలుకున్నాక మీ ముందుకొస్తా: ప్రభాకర్‌రావు లేఖ

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 23న ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. జూన్‌ 26న తాను భారత్‌కు రావాల్సిందని.. ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు.పూర్తి కథనం

5. డేట్‌ మార్చి.. పేపర్ స్క్రీన్‌షాట్‌ వైరల్‌ చేసి: యూజీసీ నెట్‌ పేపర్‌ లీక్‌ ఆరోపణలపై సీబీఐ

దిల్లీ: యూజీసీ నెట్ (UGC NET) పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ(CBI) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ ప్రశ్నపత్రం వక్రీకరించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన ఓ విద్యార్థిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. ఈ స్క్రీన్‌షాట్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌ కావడంతో కేంద్ర విద్యాశాఖ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే.పూర్తి కథనం

6. తప్పుడు ధ్రువీకరణలు సమర్పించిన ట్రెయినీ ఐఏఎస్‌.. పూజా వ్యవహారంలో మరో ట్విస్ట్‌

తన గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ (Puja Khedkar)కు సంబంధించి మరిన్ని వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్‌ ఇచ్చినట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలొస్తున్నాయి.పూర్తి కథనం

7. చైనాను కుదిపేస్తున్న వంటనూనెల కుంభకోణం..!

చైనా(China)ను ఇప్పుడు వంటనూనెల నాణ్యత కుంభకోణం కుదిపేస్తోంది. వీటి రవాణాకు ఉపయోగించిన విధానాలు దేశవ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మారాయి. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్‌ను రవాణా చేసిన కంటైనర్లను శుభ్రపర్చకుండానే వంటనూనెలు నింపి తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.పూర్తి కథనం

8. యూకే పార్లమెంట్‌లో.. భగవద్గీతపై భారత సంతతి ఎంపీ ప్రమాణం

ఇటీవల ముగిసిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో (UK Elections) భాగంగా అక్కడి పార్లమెంట్‌ దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో భారత సంతతి హవా కొనసాగింది. మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. వారిలో ఒకరైన శివాని రాజా (British MP Shivani Raja) ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు. పూర్తి కథనం

9. ఫ్లిప్‌కార్ట్‌లో ఫాస్టాగ్‌, డీటీహెచ్‌ రీఛార్జ్‌ సేవలు

దిల్లీ: ఫాస్టాగ్, డీటీహెచ్‌ రీఛార్జ్‌ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్‌ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్‌ సొల్యూషన్ల సంస్థ బిల్‌డెస్క్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) వెల్లడించింది. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్‌ పోస్ట్‌పెయిడ్‌ బిల్లుల విభాగాలకు ఈ సదుపాయాన్ని విస్తరించినట్లు తెలిపింది.పూర్తి కథనం

10. మరింతమందికి న్యూరాలింక్‌ బ్రెయిన్‌ చిప్‌.. ఏఐ ముప్పును ఎదుర్కోవడమే లక్ష్యం: మస్క్‌

వాషింగ్టన్‌: మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాలను ఎలాన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ (Neuralink) మరింత వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఓ పక్షవాత బాధితుడికి చిప్‌ అమర్చిన ఆ సంస్థ వారం రోజుల్లో మరో వ్యక్తిలోనూ దాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని