Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Jun 2024 13:05 IST

1. ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి: చంద్రబాబు

గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పూర్తి కథనం 

2. పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు

తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.పూర్తి కథనం 

3. నీట్‌ పరీక్షలో ఆ 1500 మందికి గ్రేస్‌ మార్కులను తీసేస్తాం: సుప్రీంకు కేంద్రం వెల్లడి

ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- యూజీ 2024లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ (NEET) ఫలితాల్లో 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను (Grace marks) తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.పూర్తి కథనం 

4. వర్చువల్‌ క్రెడిట్ కార్డ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

రోజురోజుకూ డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్నాయి. దీంతో యూపీఐ లైట్‌, ట్యాప్‌ అండ్‌ పే వంటి కొత్త తరహా పేమెంట్‌ పద్ధతులు పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా పిన్‌ లేకుండానే లావాదేవీలు జరపొచ్చన్నమాట. అంతేకాదు భౌతికంగా మన వద్ద క్రెడిట్‌ కార్డు లేకుండా చెల్లింపులు జరిపే మరో సదుపాయమూ ఉంది. అదే వర్చువల్‌ క్రెడిట్‌ కార్డ్‌ (VCC). ఇంతకీ ఏంటీ కార్డ్‌? దీంతో ప్రయోజనమేంటి?పూర్తి కథనం 

5. మోదీ ‘తాడాసనం’ చూశారా.. తన గ్రాఫిక్‌ వీడియో షేర్ చేసిన ప్రధాని

ఉరుకులు పరుగుల జీవితం, విద్యార్థుల్లో ర్యాంకుల కోసం పోటీతత్వం, ఉద్యోగులు కంప్యూటర్‌ ముందు సుదీర్ఘ సమయం కూర్చొనే ఉండటం వంటి పలు కారణాలు జీవనశైలి ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. వాటి నుంచి బయటపడటానికి యోగాసనాలు చక్కని పరిష్కారమని నిపుణులు చెప్తుంటారు.పూర్తి కథనం 

6. ఆ తూటాల శబ్దంతోనే నిద్రలేచా.. కాల్పుల ఘటనపై సల్మాన్‌ఖాన్‌ వాంగ్మూలం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు (Firing outside Salman Khan house) చోటుచేసుకోవడం ఇటీవల తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబయి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఘటనకు సంబంధించి నటుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ రోజు ఇంట్లోనే ఉన్నానని, తూటాల శబ్దంతోనే నిద్రలేచానని సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) పోలీసులకు తెలిపారు.పూర్తి కథనం 

7.  పొట్టి కప్‌లో తొలిసారి విరాట్ గోల్డెన్ డక్.. రోహిత్‌ షాక్

యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) తొలి బంతికే డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలో ఇలా గోల్డెన్‌ డక్ కావడం విరాట్‌కిదే తొలిసారి. భారత మూలాలు కలిగిన యూఎస్‌ఏ బౌలర్ సౌరభ్ నేత్రవల్కర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.పూర్తి కథనం 

8. ఇంగ్లండ్‌ను అడ్డుకొనేందుకు.. ఆసీస్‌ అలా చేస్తే నిషేధం తప్పదు!

టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ - B నుంచి ఆస్ట్రేలియా సూపర్ - 8కి చేరింది.  రెండో జట్టుగా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో స్కాట్లాండ్, ఇంగ్లండ్‌ రేసులో ఉన్నాయి. అయితే, అందరి కళ్లూ ఆసీస్‌ - స్కాట్లాండ్‌ (జూన్ 16న) ఫలితంపైనే ఉంది. ఇంగ్లండ్‌ తర్వాత దశకు రాకుండా ఉండేలా.. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేయాలని ఆసీస్‌ మాజీ కెప్టెన్ టిమ్‌ పైన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది.పూర్తి కథనం 

9. ఫ్లేమింగ్ పర్వతాల్లో 75 డిగ్రీల ఉష్ణోగ్రత

50 డిగ్రీల ఉష్ణోగ్రతలో బయటకి రావటమే కష్టంగా ఉంటుంది. అలాంటిది వాయవ్య చైనాలోని ఫ్లేమింగ్  పర్వతాల్లో మంగళవారం 75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంత వేడిలో కూడా ఆ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి భారీగానే ఉంది. యాత్రికులు వెళ్లడమే కాదు అక్కడి వేడి ఇసుకలో గుడ్లను కాల్చుకొని తిన్నారు. తీవ్రస్థాయిలో వేడి వాతావరణంలోనూ పర్యాటకులు అక్కడ ఎలా ఉండగలిగారో ఈ కథనంలో చూద్దాం.పూర్తి కథనం 

10.  కోన్‌ ఐస్‌క్రీంలో మనిషి వేలు.. ముంబయి డాక్టర్‌కు చేదు అనుభవం

మండుటెండల్లో ఎవరికైనా ఐస్‌క్రీం తినాలనిపిస్తుంది. కానీ, వాటిని ఎలా తయారు చేస్తారో అనే అందోళన చాలా మందిలో ఉంటుంది. గతంలో ఐస్‌క్రీమ్‌ల్లో పురుగులు కన్పించిన ఘటనలు చూశాం. కానీ, ఇప్పుడు మానవ అవయవాలు కూడా వస్తున్నాయి. ముంబయిలోని ఓ డాక్టర్‌ కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో ఏకంగా మనిషి వేలు వచ్చింది.పూర్తి కథనం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని