Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Jun 2024 13:08 IST

1. ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్‌పై మూడో సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్‌ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి కథనం

2. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్‌ ఢీకొన్నాయి. లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు, కంటైనర్‌ పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పూర్తి కథనం

3. కువైట్‌ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు

కువైట్‌లోని అల్‌ మంగాఫ్‌లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆ విమానం భారత్‌కు చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్‌పోర్టుకు వచ్చాయి.పూర్తి కథనం

4. నేతలంతా ఒకవైపు.. బైడెన్‌ మరోవైపు: వైరల్‌గా అధ్యక్షుడి వ్యవహారశైలి

ఇటలీ (Italy)లోని అపూలియా ప్రాంతంలో జీ7 సదస్సు (G7 Summit) జరుగుతోంది. ఈ గ్రూప్ సభ్య దేశాల అధినేతలతో పాటు పలు ఆహ్వానిత దేశాల నాయకులు దీనికి హాజరయ్యారు. మన ప్రధాని నరేంద్రమోదీ కూడా గురువారం రాత్రే ఇటలీలో అడుగుపెట్టారు. ఈ అంతర్జాతీయ సదస్సులో తన వ్యవహారశైలితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) మరోసారి వార్తల్లో నిలిచారు. పూర్తి కథనం

5. హెల్మెట్‌లో ఇరుక్కున్న బంతి.. బంగ్లా బ్యాటర్ ఏం చేశాడంటే?

నెదర్లాండ్స్‌ - బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. బంగ్లా ఓపెనర్ తన్జిమ్ హసన్ బ్యాటింగ్‌ చేస్తుండగా.. కింగ్‌మా వేసిన బంతి బ్యాటర్ హెల్మెట్‌లోకి దూసుకెళ్లింది. అక్కడే ఇరుక్కుపోవడంతో తన్జిమ్ హెల్మెట్‌ను తీసి నేలకు తాకించాడు. నెదర్లాండ్స్‌ ఫీల్డర్‌ ఎవరైనా బంతిని తీసుకున్నా క్యాచ్‌ ఔట్ అప్పీలు చేయకుండా ఉండేందుకు అలా చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..పూర్తి కథనం

6. పేర్లతో పిలుచుకుంటున్న ఏనుగులు

సాధారణంగా మనుషులు పేర్లు పెట్టి పిలుచుకుంటారు. మరీ ఇష్టమైతే తమ పెంపుడు జంతువులకు పేర్లు పెట్టి పిలుస్తారు. కానీ ఆఫ్రికాలోని గజరాజులు తమ గుంపులోని ఏనుగులను ప్రత్యేకమైన పేర్లతో పిలుచుకుంటాయని తెలుసా.. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో సవన్నా ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలతో ఒకదానిని ఒకటి పిలుచుకుంటాయని వెల్లడైంది. ఆ పరిశోధన వివరాలను మనం తెలుసుకుందాం.పూర్తి కథనం

7. ‘కాళేశ్వరం’పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజినీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజినీర్లు నేడు కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి వారి పాత్ర, సంబంధిత అంశాలపై కమిషన్ విచారణ చేస్తోంది. అవసరమైన అంశాలపై సమాచారం, వివరాలు సేకరిస్తోంది.పూర్తి కథనం

8. జులై 22న కేంద్ర బడ్జెట్‌.. జులై 3న ఆర్థిక సర్వే..!

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక వర్షాకాల సమావేశాలకు (Parliament Monsoon Session) కూడా షెడ్యూల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సెషన్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో తొలి రోజే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ (Union Budget 2024)ను ప్రవేశపెట్టనుందట.పూర్తి కథనం

9. మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. ఎస్వీ యూనివర్సిటీలో సంబరాలు

సీఎం చంద్రబాబు (Chandrababu) మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయడంతో ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 16,347 పోస్టులతో రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. పూర్తి కథనం

10. ఇక పాక్‌కు ఛాన్స్‌ లేనట్లే.. ‘ఆల్‌ ది బెస్ట్‌ ఫర్ నెక్స్ట్‌ ఎడిషన్‌’: భారత మాజీ స్టార్ పేసర్

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన పాక్‌ ‘సూపర్- 8’ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కెనడాపై విజయం సాధించిన పాక్‌ రేసులో నిలిచినప్పటికీ.. యూఎస్‌ఏ-ఐర్లాండ్‌ మ్యాచ్ ఫలితంతోపాటు తాను చివరి పోరులో గెలిస్తేనే కాస్తయినా అవకాశం మిగిలి ఉంటుంది. అయితే, ఫ్లోరిడా వేదికగానే నేడు యూఎస్ఏ-ఐర్లాండ్‌ తలపడనున్నాయి.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని