Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 15 Jun 2024 13:00 IST

1. భారీ మెజార్టీతో నాపై బాధ్యత మరింత పెరిగింది: ‘ప్రజా దర్బార్‌’లో లోకేశ్‌

మంగళగిరి ప్రజల కోసం ‘ప్రజా దర్బార్‌’ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. పూర్తి కథనం

2. అనుచిత వ్యాఖ్యలు చేసి.. యూటర్న్‌ తీసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త

సార్వత్రిక ఫలితాలను ఉద్దేశించి భాజపా(BJP)పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఇంద్రేశ్‌ కుమార్ (Indresh Kumar) వివరణ ఇచ్చారు. ‘‘దేశ ప్రజల ఆలోచన ఏంటో స్పష్టంగా ఉంది. రాముడిని వ్యతిరేకించిన వారు అధికారాన్ని కోల్పోయారు. ఆయన్ను గౌరవించిన వారు అధికారం దక్కించుకున్నారు.పూర్తి కథనం

3. ఎన్డీయే మైనార్టీ సర్కార్... అయితే కొనసాగాలి: ఖర్గే కీలక వ్యాఖ్యలు

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం (NDA Govt)పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కారు పొరపాటుగా ఏర్పాటైందని, ఏ క్షణమైనా కూలిపోతుందని జోస్యం చెప్పారు. పూర్తి కథనం

4. మళ్లీ ‘మెలోడీ’ మూమెంట్‌.. మోదీ, మెలోనీ మరో సెల్ఫీ వైరల్‌

ఆ మధ్య భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సెల్ఫీ దిగారు. ‘మెలోడీ (#Melodi)’ పేరుతో ఆ ఫొటో అప్పట్లో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. తాజాగా మరోసారి వీరిద్దరూ స్వీయ చిత్రం తీసుకున్నారు. దీంతో ఈ ‘మెలోడీ’ మూమెంట్‌ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది. పూర్తి కథనం

5. మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు: జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ లేఖ

విద్యుత్‌ కొనుగోలు విషయంలో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు వివరణ ఇచ్చారు. కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు. అన్ని రకాల చట్టాల నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామన్నారు.పూర్తి కథనం

6. ‘ఆ వీడియో తొలగించండి’: సునీతా కేజ్రీవాల్‌కు దిల్లీ కోర్టు నోటీసులు

ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్‌ (Sunita Kejriwal)కు దిల్లీ కోర్టు నోటీసులు జారీచేసింది. మార్చి 28న అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో మాట్లాడుతున్న దృశ్యాలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని ఆదేశించింది.పూర్తి కథనం

7. వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది: హోంమంత్రి అనిత

వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్ల కాలంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు.పూర్తి కథనం

8. పుంగనూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారనే సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గోబ్యాక్‌,.. పెద్దిరెడ్డి డౌన్‌ డౌన్‌.. అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలో పర్యటించవద్దని నాయకులు హెచ్చరించారు. పూర్తి కథనం

9. ఎక్కువ చెల్లించాం.. తిరిగి ఇచ్చేసేయండి: మాజీ ఉద్యోగులకు మస్క్‌ హెచ్చరిక..!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్(Elon Musk) తన నిర్ణయాలు, వ్యాఖ్యలతో వార్తల్లోనిలుస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్(ట్విటర్) మాజీ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో చెల్లించాల్సిన దానికంటే అధిక మొత్తం ఇచ్చామని, దానిని వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలన్నారు.పూర్తి కథనం

10. ఒక్క పరుగుతో ఓటమి.. నేపాల్‌ ఆశలను కూల్చేసిన సఫారీలు

సంచలనాలకు వేదికైన పొట్టి ప్రపంచకప్‌ టోర్నీ (T20 Worldcup 2024)లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌ జరిగింది. నేపాల్‌ ‘సూపర్‌-8’ ఆశలను దక్షిణాఫ్రికా (NEP vs SA) కేవలం ఒకే ఒక్క పరుగుతో కూల్చేసింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో సఫారీ జట్టు విజయం సాధించింది. దీంతో ముక్కలైన హృదయంతో నేపాల్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని