Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 18 Jun 2024 13:00 IST

1. జైలు జీవితం కోసం జగన్‌ ఎదురుచూడటమే తరువాయి: కేశినేని చిన్ని

ప్రజల సొమ్ము దోచేసిన జగన్‌ రూ.500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్‌ కట్టించుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) ఆరోపించారు.  విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం.

2. అమరావతి, పోలవరం పూర్తి చేయడమే మా ప్రధాన లక్ష్యం

రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటును ప్రజలంతా హర్షిస్తున్నారని తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం.

3. ‘అప్పుడు మోదీ దాచిపెట్టారా..?’

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించడంతో రాయ్‌బరేలీనే అట్టిపెట్టుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) నిర్ణయించుకున్నారు. మరోస్థానం కేరళలోని వయనాడ్ (Wayanad) నుంచి ఆయన సోదరి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) పోటీ చేయనున్నారు. ఆమెను బరిలోకి దింపడంపై భాజపా స్పందించింది. వారసత్వ రాజకీయాలు అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. పూర్తి కథనం.

4. ఎస్‌బీఐ ఖాతా బ్యాలెన్స్‌.. సులువుగా తెలుసుకుందామిలా..

ఖాతాదారులకు కావాల్సిన సమాచారాన్ని వేగంగా అందించేందుకు ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)’ పలు ఆన్‌లైన్‌ సేవలను అందిస్తోంది. దీంతో క్యూలైన్లలో గంటలతరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలుసుకోవడానికి కూడా లైన్లలో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని క్లిక్కులలోనే సమాచారమంతా కస్టమర్ల ముందుంటుంది. ఎస్‌బీఐ ఖాతాలో బ్యాలెన్స్‌ (SBI Account Balance) తెలుసుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. పూర్తి కథనం.

5. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా భారాస ఆందోళన

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా భారాస ఆందోళన చేపట్టింది. రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు.. నీట్‌ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. భారాస శ్రేణులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. పూర్తి కథనం.

6. యాదాద్రి క్షేత్రంలో వైభవంగా ‘గిరి ప్రదక్షిణ’

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూర్తి కథనం.

7. ‘సూపర్-8’లో మా వ్యూహం ఇదే: రవీంద్ర జడేజా

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) టీమ్‌ఇండియా సూపర్‌-8 మ్యాచ్‌లను విండీస్‌ వేదికగా ఆడనుంది. ఇప్పటివరకు యూఎస్‌ఏలోని డ్రాప్‌-ఇన్‌ పిచ్‌లపై స్వల్ప స్కోర్లకే పరిమితమైన మ్యాచుల్లో తలపడింది. ఇకనుంచి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే వెస్టిండీస్‌లో అడుగుపెట్టనుంది. ఇక్కడ స్పిన్నర్లకూ పిచ్‌ నుంచి సహకారం లభిస్తుంది. ఇదే విషయాన్ని భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా అంగీకరించారు. పూర్తి కథనం.

8.అమెరికాను కలసికట్టుగా ఎదుర్కొంటాం.. కిమ్‌తో భేటీకి ముందు పుతిన్‌

ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉత్తర కొరియా తమకు మద్దతుగా నిలుస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) వెల్లడించారు. అందుకు ఆ దేశ అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ‘కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ’కి వ్యాసం రాశారు. పుతిన్‌ మంగళ, బుధవారాలలో ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు. పూర్తి కథనం.

9.గన్నవరం ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయల్దేరారు. పూర్తి కథనం. 

10. అభ్యంతరకరంగా తాకాడు.. కానీ, ఏం చేయలేకపోయా

బాలనటిగా కెరీర్‌ ఆరంభంలోనే విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు నటి అవికా గోర్‌. ఇండస్ట్రీకి వచ్చాక వరుస సినిమాలతో అలరించారు. గతంలో ఓ ఈవెంట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. తన (Avika Gor) బాడీగార్డ్‌ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని తెలిపారు. పూర్తి కథనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని