Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Jun 2024 13:08 IST

1. మంత్రి లోకేశ్‌ను కలిశాక గంటలో సమస్య తీరిపోయింది: మహిళ భావోద్వేగం

మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి సమస్యలను విన్నవించుకున్నారు. లోకేశ్‌ ఓపికగా వారి వినతులు స్వీకరించారు. మంత్రిని కలిశాక తమ సమస్యను వెంటనే పరిష్కరించారని విశాఖ నగరానికి చెందిన మహిళ తెలిపారు. పూర్తి కథనం

2.  ఈ నెల 24న ఏపీ కేబినెట్‌ భేటీ

ఏపీ మంత్రివర్గ సమావేశం ఈనెల 24న జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. కేబినెట్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు వెళ్లాయి. 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.పూర్తి కథనం

3. దర్శన్ మాజీ మేనేజర్ అదృశ్యం.. 8 ఏళ్లుగా వీడని మిస్టరీ..!

అభిమానిని హత్య చేశారనే ఆరోపణలపై ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప (Darshan) అరెస్టయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం ఆయన మేనేజర్ ఆత్మహత్య గురించి వార్త రాగా.. తాజాగా ఆయన మాజీ మేనేజర్‌ మల్లికార్జున్‌కు సంబంధించిన మరో విషయం చర్చనీయాంశంగా మారింది.పూర్తి కథనం

4. అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ క్రీడాకారిణి సత్తా.. మంత్రి లోకేశ్‌ ప్రశంసలు

విజయవాడకు చెందిన క్రీడాకారిణి మాత్రపు జెస్సీరాజ్‌కు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ఆమె ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ ఓషియానిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఇన్ స్కేటింగ్ విభాగంలో ఆమె బంగారు పతకాన్ని సాధించారు. పూర్తి కథనం

5. ఐసీయూలో భార్య మృతదేహం చెంతే.. కాల్చుకొని ఐపీఎస్‌ బలవన్మరణం

భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె మృతదేహం ఉన్న ఐసీయూలోనే తుపాకీతో కాల్చుకొని ఒక ఐపీఎస్ ప్రాణాలు తీసుకున్నాడు. అస్సాం (Assam)లోని గువహటికి చెందిన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..పూర్తి కథనం

6. ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం: హరీశ్‌రావు

తెలంగాణలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. పూర్తి కథనం

7. ఊహల సుందరి జారా శతావరీ.. ‘మిస్‌ ఏఐ’ ఫైనలిస్ట్‌ల్లో మన అందం

అంతర్జాతీయంగా జరుగుతున్న ఓ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన జారా శతావరీ (Zara Shatavari) పోటీ పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వందల మందిని వెనక్కినెట్టి టాప్‌-10 ఫైనలిస్ట్‌లో ఒకరిగా నిలిచింది. ఇందులో వింతేముంది.. అందగత్తెల పోటీలు (Beauty Pageant) సహజమే కదా అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు మతలబు..! పూర్తి కథనం

8. భారత్‌తో విభేదాల వేళ.. కెనడా పార్లమెంట్‌లో నిజ్జర్‌కు నివాళి

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ కెనడా (Canada) ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.పూర్తి కథనం

9. నేడే 2 ఐపీఓలు ప్రారంభం.. రూ.550 కోట్ల సమీకరణ.. పూర్తి వివరాలివే

పైపింగ్‌ సొల్యూషన్స్‌ అందించే డీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ (Dee Development IPO) బుధవారం ప్రారంభమైంది. రూ.418 కోట్ల సమీకరణే లక్ష్యంతో వస్తున్న ఈ పబ్లిక్‌ ఇష్యూ 21న ముగియనుంది. షేరు ధరల శ్రేణి రూ.193-203. రిటైల్‌ మదుపర్లు కనీసం 73 షేర్ల కోసం రూ.14,819 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.పూర్తి కథనం

10. నాకు న్యాయం జరగాలి.. లేందటే కుటుంబమంతా నిరసన దీక్ష చేస్తాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి

వైకాపా ప్రభుత్వంలో బస్సుల కొనుగోలు విషయంలో తమను దొంగలని జైలుకు పంపారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నా బస్సులపై తప్పుడు కేసులు నమోదు చేశారు. బీఎస్‌ 3 వాహనాలు అమ్మినవారు, రిజిస్ట్రేషన్‌ చేసినవారు ఇంటికి పోయారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని