Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 20 Jun 2024 13:00 IST

1. ప్రజావేదిక శిథిలాలను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు

వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఏపీ సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం బయల్దేరారు. పూర్తి కథనం

2. పాడైపోయిన మటన్‌తో బిర్యానీ.. ఆల్ఫా హోటల్‌కు జరిమానా

రెండు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌లో ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నేడు వెల్లడించారు. హోటల్‌లో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించట్లేదని పేర్కొన్నారు. పాడైపోయిన మటన్‌తో బిర్యానీ చేసినట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం వేడి చేసి ఇస్తున్నట్లు తెలిపారు. పూర్తి కథనం

3. పోలవరం ప్రాజెక్టును క్లిష్టతరం చేశారు: మంత్రి నిమ్మల రామానాయుడు

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తిచేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.పూర్తి కథనం

4. గంభీర్‌తోపాటు కోచ్‌గా రామన్.. ఆలోచనలో బీసీసీఐ!

టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటివరకు కేవలం గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) మాత్రమే ఉన్నాడని భావిస్తే.. మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్‌ కూడా బీసీసీఐ ఇంటర్వ్యూకి వెళ్లాడు. తన ప్రణాళికలను గంభీర్ వివరించగా.. భారత క్రికెట్‌ అభివృద్ధి కోసం రామన్‌ రోడ్‌మ్యాప్‌ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలిసింది. పూర్తి కథనం

5. ముద్రగడ పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌

వైకాపా నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్‌ విసిరారు.పూర్తి కథనం

6. హైదరాబాద్‌లో 24 గంటల్లో 5 హత్యలు!

నగరంలో రోజూ ఎక్కడో ఒక చోట నేరాలు జరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌ పరిధిలో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు చోటు చేసుకున్నాయి. పాతబస్తీ శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలో నిమ్రా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ యజమాని రఫీక్ దారుణ హత్యకు గురయ్యాడు. శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలో వజీద్, ఫక్రుద్దీన్‌పై హత్యాయత్నం జరిగింది. పూర్తి కథనం

7. అవును.. పరీక్షకు ముందురోజు రాత్రే నీట్ పేపర్‌ అందింది: అంగీకరించిన విద్యార్థులు

దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు సమాచారం రాగా.. కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది. అయితే, పేపర్‌ లీక్‌ నిజమేనని తాజాగా బయటికొచ్చింది.పూర్తి కథనం

8. ‘రామాయణం’ స్కిట్‌తో జోకులు.. ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.1.20లక్షల ఫైన్‌

ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే (IIT Bombay) విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్‌ వివాదాస్పదమైంది. పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని అపహాస్యం చేసేలా వారు ప్రదర్శించిన నాటకం (Students Skit)పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ.1.20లక్షల చొప్పున జరిమానా విధించింది.పూర్తి కథనం

9. అభిమానిని చంపి.. భార్య ఫ్లాట్‌లో పూజలు: నటుడు దర్శన్‌ నిర్వాకం

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప(Darshan)కు సంబంధించిన సంచలన విషయాలను పోలీసులు వెలికితీస్తున్నారు. తాజాగా దర్శన్‌ వినియోగించిన లోఫర్స్‌ ఆయన భార్య విజయలక్ష్మి ఫ్లాట్‌ వద్ద గుర్తించారు. వీటినే హత్య సమయంలో అతడు వినియోగించాడు.పూర్తి కథనం

10. ఆదాయ పన్ను రిటర్నులు.. మీకు ఏ ఫారం వర్తిస్తుందో తెలుసా?

గత ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులను (Income Tax Returns- ITR) దాఖలు చేసేందుకు సమయం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు సరైన ఫారాన్ని ఎంచుకోవడం తప్పనిసరి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (CBDT) ఇప్పటికే ఈ ఫారాలను నోటిఫై చేసింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని