Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 21 Jun 2024 12:59 IST

1. ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్‌ ప్రమాణస్వీకారం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. పూర్తి కథనం

2. అసెంబ్లీకి వెనుక గేటు నుంచి వచ్చిన జగన్‌

వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ (YS Jagan) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్‌ సభలో ఉండకుండా ఛాంబర్‌కు వెళ్లిపోయారు. పూర్తి కథనం

3. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామా చేయించారని నానిపై పలువురు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది.పూర్తి కథనం

4. శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ యోగా: కిషన్‌రెడ్డి

యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాణులు ప్రకృతితో మమేకమవ్వడమే యోగా అంతరార్థమని తెలిపారు. ఇవాళ ప్రపంచమంతా యోగా వైపు చూస్తోందని చెప్పారు. పూర్తి కథనం

5. వకీలుగా మారిన ఎంపీ.. కార్యకర్తల తరఫున రఘునందన్ రావు వాదనలు

మెదక్ ఎంపీ రఘునందన్ రావు నల్ల కోటు ధరించి కార్యకర్తల తరఫున కేసు వాదించారు. ఇటీవల మెదక్‌లో చోటు చేసుకున్న ఘర్షణలపై కోర్టులో తన వాదనలు వినిపించారు. నల్ల కోటు ధరించి లాయర్‌గా కార్యకర్తలకు అండగా నిలబడటం ఆసక్తి రేపింది. కోర్టులో వాదనల అనంతరం మాట్లాడిన రఘునందన్ రావు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు.పూర్తి కథనం

6. కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

తెలంగాణ మాజీ స్పీకర్‌, భారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి పోచారం, ఆయన కుమారుడికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్‌, పోచారం మీడియాతో మాట్లాడారు.పూర్తి కథనం

7. రోహిత్‌ శర్మ ఔట్.. అది బలహీనత కాదు: గావస్కర్

టీ20 ప్రపంచ కప్‌ సూపర్-8 పోరును భారత్‌ ఘనంగా ప్రారంభించింది. అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. అయితే, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. అఫ్గాన్ బౌలర్ ఫరూఖి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి మిడాన్‌లో దొరికిపోయాడు. తొలి ఓవర్‌ నుంచే పేస్‌ బౌలింగ్‌లో ఇబ్బందిపడినట్లు అనిపించాడు.పూర్తి కథనం

8. యోగా డే రోజున.. కేంద్రమంత్రికి చేదు అనుభవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) రోజున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan)కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వేడుకలకు హాజరుకావడానికి వచ్చిన ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తంకావడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?పూర్తి కథనం

9. రూ.1.5 లక్షలతో భారత్‌లో లెనొవో కొత్త యోగా ల్యాప్‌టాప్‌.. ఫీచర్లివే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో యోగా ప్రో 7ఐ (Lenovo Yoga Pro 7i) పేరిట లెనొవో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. మల్టీటాస్కింగ్‌ కంటెంట్‌ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా మార్చిలోనే విడుదలైన ఈ ల్యాప్‌టాప్ తాజాగా భారత కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.1.5 లక్షలు. పూర్తి కథనం

10. ‘ఈసారి నేను మౌనంగా ఉండలేను..’: మిలిందా గేట్స్‌ ఆసక్తికర పోస్ట్‌

మరికొన్ని నెలల్లో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections) జరగనున్నాయి. అధ్యక్ష పీఠం కోసం తలపడుతున్న జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య గట్టి పోటీ ఉంది. ఈ ఎన్నికలపై ప్రముఖ దాత, బిల్‌గేట్స్‌ మాజీ భార్య మిలిందా గేట్స్‌ (Melinda French Gates) ఆసక్తికర పోస్ట్‌ చేశారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని