Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jun 2024 13:09 IST

1. జగన్‌.. ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి?రాష్ట్రం నీ తాత జాగీరా!: మంత్రి నారా లోకేశ్‌ ఫైర్‌

వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో చేసిన భూకేటాయింపులపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ చేశారు. పూర్తి కథనం

2. మియాపూర్‌, చందానగర్‌లో ఉద్రిక్తత.. 144 సెక్షన్‌ విధించిన పోలీసులు

నగరంలోని మియాపూర్‌, చందానగర్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. ఈ నెల 29 అర్ధరాత్రి వరకు ఇది అమలులో ఉండనుంది. ఈ మేరకు సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్‌లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టారు. పూర్తి కథనం

3. అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడి మృతి

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు.పూర్తి కథనం

4. దేశంలో విద్యావ్యవస్థ నాశనం అయ్యింది: కాంగ్రెస్‌

నీట్‌ యూజీ, యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌(Congress) అధ్యక్షుడు మల్లికిర్జున ఖర్గే(Mallikarjun Kharge) కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.పూర్తి కథనం

5. నీట్‌ పరీక్షల్లో ‘మున్నాభాయ్‌’లు.. వెలుగులోకి కళ్లుబైర్లుకమ్మే వాస్తవాలు..!

మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ చిత్రం గుర్తుందా..? అందులో ఒకరికి బదులు మరో వ్యక్తి మెడికల్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష రాసి ర్యాంక్‌ సాధిస్తాడు. కొన్నేళ్లుగా నీట్‌ పరీక్షల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పేపర్‌ లీక్‌లో ‘సాల్వర్‌ గ్యాంగ్‌’ హస్తం ఉన్నట్లు బయటపడటంతో బిహార్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో ఈ గ్యాంగ్‌ కీలక సభ్యుడు రవి అత్రి హస్తం ఉన్నట్లు బలంగా విశ్వసిస్తున్నారు.పూర్తి కథనం

6. మహిళా పోలీసుతో అక్రమ సంబంధం.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా డిమోషన్‌

ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి యూపీ పోలీసు విభాగం తగిన బుద్ధి చెప్పింది. నేరానికి పాల్పడిన అతడిని కానిస్టేబుల్‌ స్థాయికి డిమోట్‌ (DSP Demoted To Constable) చేస్తూ అక్కడి పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..పూర్తి కథనం

7. పొట్టి ప్రపంచకప్‌లో మరో సంచలనం.. ఆసీస్‌ను ఓడించిన అఫ్గాన్‌

ఏంటా.. పొట్టి కప్‌ సూపర్‌-8లో భాగంగా గ్రూప్‌-1లో సెమీస్‌ రేసు చప్పగా సాగుతుందని భావించిన అభిమానులను అఫ్గానిస్థాన్‌ థ్రిల్‌కు గురిచేసింది. హాట్‌ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌ రేసును రసవత్తరంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ గెలిచి ఉంటే.. భారత్‌తోపాటు ఆ జట్టు నాకౌట్‌కు వెళ్లిపోయేది. పూర్తి కథనం

8. బౌండరీలు బాదుతున్నా.. ఆ సూత్రానికే కట్టుబడి ఉంటా: కుల్‌దీప్‌

టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) టోర్నీ ముందుకు సాగేకొద్దీ కరీబియన్‌ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయని భారత జట్టు అంచనా వేసింది. అందుకు అనుగుణంగా వ్యూహాలు మార్చింది. పేసర్‌ సిరాజ్‌ను తప్పించి అక్షర్, జడేజాలకు తోడు మూడో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ను (Kuldeep Yadav) తుది జట్టులోకి తీసుకుంది. ఈ ప్రయోగం ఫలితాన్నిస్తోంది. కుల్‌దీప్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు.పూర్తి కథనం

9. ఇస్రో హ్యాట్రిక్‌.. ‘పుష్పక్‌’ మూడో ప్రయోగం సక్సెస్

 పునర్వినియోగ వాహకనౌకల (రీయూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌ ల్యాండింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌- RLV LEX) సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) వెల్లడించింది. ఈసారి మరింత సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిపింది. పూర్తి కథనం

10. ఆర్టీసీలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

నెలలోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఆయన రవాణా, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మాట్లాడారు. తెలంగాణ, కర్ణాకటలో ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఉచిత బస్సు కల్పనలో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తున్నామన్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని