ప్రపంచంలో టాప్ 10 భాషలివే..!
ప్రపంచంలో 200కుపైగా దేశాలు.. 7వేలకుపైగా భాషలున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషలో ఒక్క భారత్‌లోనే 22 అధికారిక భాషలతోపాటు వేలాది భాషలు మనుగడలో ఉన్నాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒక దేశంలో పుట్టిన భాష.. అక్కడి ప్రజల వలసల కారణంగా
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో 200కుపైగా దేశాలు.. 7వేలకు పైగా భాషలున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాతృభాషగా, అధికారిక భాషగా ఉంటుంది. ఒక్క భారత్‌లోనే 22 అధికారిక భాషలతోపాటు వేలాది భాషలు మనుగడలో ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒక దేశంలో పుట్టిన భాష.. అక్కడి ప్రజల వలసల కారణంగా లేదా కొన్ని దేశాలు ఇతర దేశాలను స్వాధీనం చేసుకొని వారి భాషను పరిచయం చేయడం ద్వారా వివిధ భాషలు ప్రపంచమంతా వ్యాపించాయి. మరి అలాంటి భాషల్లో టాప్ 10 భాషలేవీ..? ఎంతమంది ఆయా భాషలను మాట్లాడుతున్నారో ఓ లుక్కేద్దామా..!
ఇంగ్లీష్ - 135 కోట్లు
ప్రపంచంలో అత్యధికంగా 135 కోట్ల మంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ప్రపంచంలో 60కిపైగా దేశాల్లో ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉంది. ఇతర దేశాల్లో అధికార భాష కాకపోయినా.. సంభాషించడానికి సులువుగా ఉండేలా ఇంగ్లీష్‌ను తప్పకుండా నేర్చుకుంటుంటారు. అందుకే దీన్ని యూనివర్సల్ భాషగా పేర్కొంటారు.
మాండరీన్ - 112కోట్లు
చైనీస్ సంప్రదాయ భాష మాండరీన్. ఈ పదం పోర్చుగీసులోని మాండరిమ్ అనే పదం నుంచి వచ్చింది. ఈ భాషను ప్రపంచవ్యాప్తంగా 112కోట్ల మంది మాట్లాడుతున్నారు. చైనా, తైవాన్, సింగపూర్ దేశాల్లో మాండరీన్ అధికార భాష.
హిందీ - 60కోట్లు
భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ. ఈ భాషను ప్రపంచవ్యాప్తంగా 60కోట్ల మంది మాట్లాడుతారట. ఇందులో 52కోట్లమందికి పైగా భారత్‌లోనే ఉన్నారు. మన దేశంలోనే కాకుండా పాకిస్థాన్, ఫిజీ దేశాల్లోనూ హిందీని అధికారిక భాషగా వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, దక్షిణాఫ్రికాలోనూ హిందీ మాట్లాడేవారున్నారు.
స్పానిష్ - 54కోట్లు
స్పెయిన్ దేశానికి చెందిన స్పానిష్ భాషను 20కిపైగా దేశాల్లో అధికారిక భాషగా గుర్తిస్తున్నారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని మెక్సికో, కొలంబియా, అర్జెంటీనా చీలి, వెనుజువెలా వంటి పలు దేశాల్లో స్పానిష్ మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 54కోట్ల మంది స్పానిష్ మాట్లాడుతున్నారు.
అరబిక్ - 27కోట్లు
యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్, లిబియా, సోమాలియా, బహ్రెయిన్, ఇరాక్‌సహా 22 దేశాల సమూహాన్ని అరబ్ ప్రపంచంగా పిలుస్తుంటారు. ఈ దేశాల అధికారిక భాష అరబిక్. మొత్తంగా 27కోట్ల మంది ఈ భాషను మాట్లాడుతున్నారు. అన్ని భాషల లిపి ఎడమ నుంచి కుడివైపు ఉంటే అరబిక్ దానికి భిన్నంగా ఉంటుంది.
బెంగాలీ - 26.8కోట్లు
బెంగాలీ భాషను 26.8కోట్లు మంది మాట్లాడుతున్నారు. మన దేశంలోని పశ్చిమ్ బెంగాల్‌తోపాటు త్రిపుర, అసోం, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు చోట్ల.. పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో బెంగాలీ మాట్లాడుతారు. ఈ భాష బంగ్లాదేశ్ అధికారిక భాష కాగా.. భారత్‌లో రాజ్యాంగం గుర్తింపు పొందిన భాషల్లో ఇదీ ఒకటి.
ఫ్రెంచ్ - 26.7కోట్లు
ఫ్రాన్స్ సహా ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో ఫ్రెంచ్ అధికారిక భాషగా ఉంది. ఇతర దేశాల్లో ఫ్రెంచ్‌లో సంభాషించేవారిని కలుపుకుంటే ఆ భాష మాట్లాడేవారి సంఖ్య 26.7కోట్లు.
రష్యన్ - 25.8కోట్లు
రష్యా అధికారిక భాష రష్యన్. కానీ ఒకప్పటి సోవియేట్ యూనియన్‌లో ఉన్న ఉక్రెయిన్, జార్జియా, ఉజ్బెకిస్థాన్, అర్మెనియా, అజర్‌బైజాన్ సహా అనేక దేశాల్లో రష్యన్ అధికార భాషగా ఉండేది. సోవియేట్ నుంచి విడిపోయిన తర్వాత ఆయా దేశాలు సొంతగా వేర్వేరు భాషలను అధికారికంగా ప్రకటించుకున్నా.. అన్ని దేశాల్లోనూ రష్యన్ భాష మనుగడలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రష్యన్ మాట్లాడేవారి సంఖ్య 25.8కోట్లు.
పోర్చుగీసు - 25.8కోట్లు
పోర్చుగీసు.. పోర్చుగల్ దేశ భాష. కానీ ఆ దేశంలో కన్నా బ్రెజిల్, అంగోలా, మొజాంబిక్ దేశాల్లోని ప్రజలు ఎక్కువగా పోర్చుగీసులో మాట్లాడుతారు. మొత్తంగా పది దేశాల్లో పోర్చుగీసు అధికారిక భాషగా ఉండగా.. దీన్ని మాట్లాడేవారి సంఖ్య 25.8కోట్లు. ప్రపంచ జనాభాలో రష్యన్, పోర్చుగీసు మాట్లాడేవారి సంఖ్య సమానంగా ఉండటం విశేషం.
ఉర్దూ - 23కోట్లు
ఉర్దూ.. హిందీ భాషల్లో సారూప్యత కనిపిస్తుంటుంది. పాకిస్థాన్, భారత్‌లో ఉర్దూ అధికారిక భాషగా ఉంది. ఇరు దేశాల్లోని ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉర్దూ మాట్లాడేవారు 23కోట్ల మంది ఉన్నారు. ఈ భాష లిపిని కూడా అరబిక్‌లాగే కుడి నుంచి ఎడమకు రాస్తారు. వీటి తర్వాత 19.9 కోట్ల మంది ఇండోనేషియన్ భాషను, 13.5కోట్ల మంది జర్మన్, 12.6కోట్ల మంది జపనీస్, 9.9కోట్ల మంది మరాఠీ, 9.6కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడేవారున్నారు.
source: ethnologue.com
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Aadhaar: ఆధార్.. ఓటర్ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు..!
-
Technology News
Legacy Contact: వారసత్వ నంబరు ఎలా?
-
Movies News
Mrunal Thakur: ‘నా కథను అందరితో పంచుకుంటా..’ కన్నీళ్లతో ఉన్న ఫొటో షేర్ చేసిన మృణాల్
-
World News
Earthquake: పాక్, అఫ్గాన్‌లో భూకంపం.. 11 మంది మృతి..!
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Movies News
Anasuya: ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న అనసూయ