టాప్‌ 10 న్యూస్‌ @ 1PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తల కోసం క్లిక్ చేయండి

Published : 14 Apr 2021 12:57 IST

1. ఇజ్రాయెల్..‌ అందుకో టీకా ఫలం‌!

ఏడాది క్రితం కరోనా వైరస్‌ అంటే ఏమిటో సరిగ్గా తెలియదు.. దానికి ఎలా చికిత్స చేయాలో అంతకంటే తెలియదు.. రోగ లక్షణాలను తగ్గించేందుకు మాత్రమే చికిత్స జరిగేది.. ఇక వ్యాధి వ్యాప్తిని నిరోధించే టీకాలపై ఏమాత్రం ఆశలు లేవు.  అలాంటిది ఇప్పుడు టీకాలు అందుబాటులోకి రావడంతో కొన్ని దేశాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. ఆ ఫలాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. పాక్‌ రెచ్చగొడితే.. భారత్‌ స్పందన గట్టిగానే

రాబోయే రోజుల్లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని, పాక్‌ కవ్వింపు చర్యలకు భారత్‌ మరింత బలంగా స్పందించే అవకాశముందని అమెరికా నిఘా సంస్థ అంచనా వేసింది. ఈ రెండు దేశాల మధ్య విభేదాలు యావత్‌ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. ఇక భారత్‌-చైనా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ కొనసాగుతున్నప్పటికీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదని తెలిపింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. నేను అలిపిరిలో ఉన్నా.. జగన్‌ రాగలరా?

మాజీ మంత్రి వివేకా హత్యకేసుతో తనకు, తమ కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చేయడానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన అలిపిరి చెక్‌పోస్ట్ వద్దకు చేరుకొని బైఠాయించారు. కాసేపట్లో అలిపిరి గరుడ సర్కిల్‌ వద్ద ఆయన ప్రమాణం చేయనున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను అలిపిరిలో ఉన్నా.. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి సీఎం జగన్‌ రాగలరా.. వైకాపా నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జగన్‌ను అలిపిరి తీసుకురావాలి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. భారత్‌లో కరోనా : ఒక్కరోజే వెయ్యికిపైగా మరణాలు

రెండో దశలో కరోనా వైరస్ రోజురోజుకు ప్రాణాంతకంగా మారుతోంది. తాజాగా 1,027 మందిని బలితీసుకుంది. మరణాల సంఖ్య వెయ్యి దాటడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. నిన్న 14,11,758 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,84,372 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకు కోటీ 38 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 1,72,085 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. ముంబయికి ఇది కొత్తేం కాదు!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటే సిక్సర్ల జడివానకు మరోపేరు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో విరుచుకుపడే ఈ టోర్నీల్లో 200+ లక్ష్యాలనే ‘ఉఫ్’ అనేస్తున్నారు.‌ ఇక 150+ స్కోర్ల సంగతి సరేసరి. ముంబయి ఇండియన్స్‌ మాత్రం ఇందుకు భిన్నం. కీలక మ్యాచుల్లో మోస్తరు స్కోర్లను కాపాడుకోవడం దానికి కొత్తేం కాదు. గతంలో రెండుసార్లు ఫైనళ్లలో అలాగే గెలిచి ట్రోఫీలు కైవసం చేసుకుంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. తెలంగాణలో కొత్తగా 2,157 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 72,364 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2,157 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న వీటి సంఖ్య 3,052గా ఉండేది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 8 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,780కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,07,499కి చేరింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. కరోనారోగుల దుస్థితి.. వీడియో షేర్‌చేసిన భజ్జీ

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కొత్త కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేసులు నానాటికీ పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో పడకలు చాలట్లేదు. దీంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొవిడ్‌ రోగుల దుస్థితిని తెలియజేస్తూ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన హృదయవిదారక వీడియోలు దేశంలో మహమ్మారి తీవ్రతకు అద్దంపడుతున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. కోల్‌కతా ఓటమి: షారుఖ్‌ క్షమాపణలు

ముంబయి ఇండియన్స్‌తో మ్యాచులో తమ జట్టు ప్రదర్శన నిరాశ పరిచిందని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహ యజమాని షారుక్‌ ఖాన్‌ అన్నాడు. నిజం చెప్పాలంటే మోర్గాన్‌ సేన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని అంగీకరించాడు. అభిమానులు క్షమించాలని ట్వీట్‌ చేశాడు. మంగళవారం స్వల్ప స్కోరు నమోదైన మ్యాచులో ముంబయి ఘన విజయం సాధించింది. కోల్‌కతాను 10 పరుగుల తేడాతో ఓడించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. ఐపీఎల్‌ కోసం ఖైదీల నిరాహార దీక్ష

ఐపీఎల్‌ ఫీవర్‌.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఓ కారాగారంలో నిరసనకు దారితీసింది. టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూసేలా ఏర్పాట్లు చేయాలని ఫతేగఢ్‌ కేంద్ర కారాగారంలోని ఖైదీలు నిరాహార దీక్షకు దిగారు. అల్పాహారాన్ని మూకుమ్మడిగా మానేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో లఖ్‌నవూలో అధికారులతో సమావేశంలో ఉన్న జైలు సూపరింటెండెంట్‌ ప్రమోద్‌ కుమార్‌ శుక్లా.. హుటాహుటిన కారాగారానికి తిరిగివచ్చారు. ఖైదీలతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు చర్చ లు ఫలించాయి. తమ డిమాండ్లకు జైలు అధికారులు అంగీకరించడంతో.. ఖైదీలు దీక్షను విరమించారు.

10. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స‌రైన‌ పొదుపు ప‌థ‌కాలు ఏవి?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో స‌హా కొన్ని అగ్ర బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 5-10 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాల‌ప‌రిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు గ‌రిష్టంగా 6.2% వ‌డ్డీని  అందిస్తున్నాయి. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి మ‌ధ్య బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాయి. ఈ వ‌డ్డీ రేటు ప‌రిస్థితుల్లో స్థిరంగా రెగ్యుల‌ర్ ఆదాయం కొసం చూస్తున్న సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎక్కువ‌గా దెబ్బ‌తిన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని