Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 17 Nov 2022 13:00 IST

1. Jack Dorsey: మళ్లీ ట్విటర్‌ సీఈఓగా చేస్తారా..? జాక్‌ డోర్సే సమాధానమిదే..!

ట్విటర్‌ను సొంతం చేసుకున్న కొన్ని గంటల్లోనే కంపెనీ సీఈఓగా ఉన్న పరాగ్‌ అగర్వాల్‌ను ఎలాన్‌ మస్క్‌ ఇంటికి పంపించారు. అప్పటి నుంచి మూడు వారాలు గడుస్తున్నా కొత్త సీఈఓ నియామకం ఇంకా జరగలేదు. ఈ క్రమంలోనే ట్విటర్‌ సీఈఓగా ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే (Jack Dorsey) మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై డోర్సేను ప్రశ్నించగా.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. Amazon: అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు!

అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ (Amazon) సైతం ఉద్యోగులను తగ్గించుకునేందుకు సిద్ధమైంది. సంస్థలో ఇకపై కొన్నిరకాల ఉద్యోగాలు అవసరం లేదని నిర్ణయించినట్లు హార్డ్‌వేర్‌ చీఫ్‌ డేవ్‌ లింప్‌ సిబ్బందికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇది కఠినమైన నిర్ణయమైనప్పటికీ తప్పడం లేదని లింప్‌ పేర్కొన్నారు. దీనివల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులకు కొత్త పని వెతుక్కోవడానికి కావాల్సిన సహకారం కూడా అందిస్తామని తెలిపారు. అయితే.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. Raja Singh: ఆ వాహనాన్ని వాడలేను.. మీరే తీసుకోండి: ఇంటెలిజెన్స్‌ ఐజీకి రాజాసింగ్‌ లేఖ

ఇంటెలిజెన్స్‌ అధికారులు తనకు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన ఆయన.. తాజాగా తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. ఫోన్లు మార్చుకోవడంతో తారుమారైన ప్రేమికుల జీవితాలు.. తర్వాతేంటి..?

వాళ్లిద్దరూ స్నేహితులు.. అనుకోకుండా వారి మధ్య ప్రేమ చిగురించింది.. పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు.. పెద్దవాళ్లు పెట్టిన కండిషన్‌తో వాళ్లిద్దరూ సెల్‌ఫోన్లు మార్చుకున్నారు.. కట్‌ చేస్తే అప్పటిదాకా ప్రశాంతంగా సాగిన వారి జీవితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. వాళ్ల మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ పెళ్లి పీటలెక్కిందా? విడిపోవడానికి దారి తీసిందా? వంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ టుడే’. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. Roja: సినిమాల్లోకి కుమార్తె ఎంట్రీపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

తన కుమార్తె, కుమారుడు సినిమాల్లోకి రావాలనుకుంటే.. ఒక తల్లిగా, నటిగా చాలా సంతోషిస్తానని ఏపీ మంత్రి రోజా అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జబర్దస్త్ టీం సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. Babar azam: మిడిలార్డర్‌లో ఎందుకు ఆడడో అర్థం కాదు.. బాబర్‌ వల్లే పాక్‌ నష్టపోతోంది: డానిష్‌ కనేరియా

టీ20 ప్రపంచకప్‌ ఆరంభంలోనే రెండు ఓటములను నమోదు చేసిన పాకిస్థాన్‌ అనూహ్యంగా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసినప్పటికీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే, జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఈ టోర్నమెంట్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ కెప్టెన్‌ డానిష్‌ కనేరియా స్పందిస్తూ బాబర్‌పై విమర్శలు గుప్పించాడు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Casino: క్యాసినో వ్యవహారం.. ఈడీ ముందుకు వైకాపా మాజీ ఎమ్మెల్యే

క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట అనంతపురానికి చెందిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడంతో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. క్యాసినోల వ్యవహారంలో గుర్నాథరెడ్డి పాత్రపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. Delhi Murder: శ్రద్ధా హంతకుడి పక్కా ప్లాన్‌.. సవాలుగా సాక్ష్యాలు..!

దిల్లీ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన ప్రియురాలిని ముక్కలుగా కోసి, దిల్లీలో పలుచోట్ల విసిరినట్లు నిందితుడే విచారణలో అంగీకరించాడు. తాజాగా వెలుగులోకి వస్తోన్న విషయాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ కేసు గురించి ఇప్పటికే అన్ని వివరాలు ఉన్నప్పటికీ.. దానిని నిరూపించే సాక్ష్యాధారాలను సేకరించడం పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. Zelenskyy: ఆ క్షిపణి ఉక్రెయిన్‌ది కాదు: జెలెన్‌స్కీ ప్రకటన

నాటో సభ్యదేశమైన పోలండ్‌ సరిహద్దుల్లోని షెవాడో గ్రామంపై క్షిపణి దాడి ఘటనలో తమను నిందించడం సరికాదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఆ క్షిపణి తమది కానే కాదని స్పష్టం చేశారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జి-20 దేశాల సదస్సు జరుగుతుండగా.. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఉక్రెయిన్‌ సరిహద్దు దేశమైన పోలండ్‌ శివారులోని షెవాడో గ్రామంపై ఓ క్షిపణి కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. Twitter: కష్టపడతారా.. వెళ్లిపోతారా.. ఉద్యోగులకు మస్క్‌ అల్టిమేటం!

వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులను తొలగించిన ట్విటర్‌ (Twitter) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీని లాభదాయకంగా మార్చేందుకు ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారి నుంచి లిఖితపూర్వక హామీ కోరినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని